బిగ్ బాస్ 8 : హౌస్ నుంచి బయటకు వచ్చిన గంగవ్వ..!

ఇలానే ఉంటే గంగవ్వ టాప్ 5 దాకా ఉంటుందని అనిపించింది.

Update: 2024-11-10 03:38 GMT

బిగ్ బాస్ సీజన్ 8 నుంచి గంగవ్వ షాకింగ్ గా సెల్ఫ్ ఎవిక్టెడ్ అయ్యారు. సీజన్ 8 లో వైల్డ్ కార్డ్ ఎంట్రీగా వచ్చిన ఆమె దాదాపు ఐదు వారాలుగా హౌస్ లో ఉన్నారు. ఐతే ఈ ఐదు వారాల్లో కూడా ఆమె టాస్కుల పరంగా పెద్దగా ఆడింది ఏమి లేదు కానీ ఒక పెద్దావిడ హౌస్ లో ఉంది అన్న విధంగా ఉంచారు. నామినేషన్స్ లో కూడా గంగవ్వని ఎవరు నామినేట్ చేసే వారు కాదు. ఇలానే ఉంటే గంగవ్వ టాప్ 5 దాకా ఉంటుందని అనిపించింది.

ఈ ఏజ్ లో అసలు గంగవ్వ బిగ్ బాస్ కి వెళ్లడమే గొప్ప విషయం. అలాంటిది గంగవ్వ రెండుసార్లు బిగ్ బాస్ కి వెళ్లింది. బిగ్ బాస్ తెలుగు సీజన్ 4లో గంగవ్వ హౌస్ లోకి వచ్చింది. ఐతే ఆమె అప్పుడు కూడా ఐదు వారాలకే హౌస్ నుంచి సెల్ఫ్ ఎవిక్ట్ అయ్యింది. ఇప్పుడు కూడా ఐదు వారాలు మాత్రమే హౌస్ లో ఉండి ఇక ఉండలేనని చెప్పి బయటకు వచ్చేసింది. గంగవ్వకి ఒళ్లు నొప్పులు, మంటలు వస్తున్నాయని హోస్ట్ నాగార్జునకు చెప్పారు.

నాగార్జున హౌస్ లో ఉంటావా వెల్తారా అంటే ఆమె వెళ్తానని చెప్పగానే బిగ్ బాస్ నిర్ణయం మేరకు గంగవ్వని హౌస్ బయటకు పంపించారు. బిగ్ బాస్ సీజన్ 8 లో గంగవ్వ ఆట ముగిసింది. ఐతే ఆమె వారం రోజులుగా ఒంటి పూట భోజనం చేస్తుందని తెలుస్తుంది. హౌస్ లో తను అంత కంఫర్ట్ గా లేదని టాక్. అందుకే హెల్త్ ఇష్యూస్ వల్లే గంగవ్వ హౌస్ నుంచి బయటకు వచ్చేసింది. ఐతే ఈ సీజన్ లో ఆల్రెడీ మణికంఠ హౌస్ లో తానిక ఉండలేనని చెప్పి సెల్ఫ్ ఎవిక్ట్ అయ్యాడు. ఇప్పుడు గంగవ్వ కూడా అలానే చేసి బయటకు వచ్చేసింది.

ఈ వారం నామినేషన్స్ లో ఉన్న వారిలో కాకుండా గంగవ్వ ఎలిమినేట్ అవ్వడం ఆడియన్స్ కి షాక్ ఇచ్చినట్టు అయ్యింది. ఐతే ఓటింగ్ ప్రకారం కూడా ఆదివారం ఎపిసోడ్ లో ఒక ఎలిమినేషన్ ఉంటుందని తెలుస్తుంది. తెలుస్తున్న సమాచారం ప్రకారం బిగ్ బాస్ సీజన్ 8 లో 10వ వారం ఎలిమినేట్ అయ్యింది హరితేజ అని లీక్స్ ద్వారా తెలుస్తుంది.

బిగ్ బాస్ సీజన్ 8 లో ఒక వారం లో ఇద్దరు ఎలిమినేట్ అవ్వడం ఇది రెండోసారి. ఆల్రెడీ ఈ సీజన్ లోనే ఆదిత్య ఓం మిడ్ వీక్ ఎలిమినేట్ అవ్వగా అదఏ వీకెండ్ నైనిక ఎలిమినేట్ అయ్యింది. సో ఈ వారం కూడా శనివారం గంగవ్వ హౌస్ నుంచి బయటకు రాగా.. ఆదివారం హరితేజ ఎలిమినేట్ అయ్యి బయటకు వస్తుందని తెలుస్తుంది.

Tags:    

Similar News