మీ గంగూ ఎప్పుడూ మీతోనే!
ఇలా అమ్మడు హిందీ నటి అయినా భాషతో సంబంధం లేకుండా టాలీవుడ్ లోనూ జోరు చూపిస్తోంది. అమ్మడిలో ప్రతిభనే ఆ స్థాయికి తీసుకెళ్లింది
బాలీవుడ్ బ్యూటీ అలియాభట్ కి టాలీవుడ్ ఏ స్థాయిలో పెద్ద పీట వేస్తుందో చెప్పాల్సిన పనిలేదు. 'ఆర్ ఆర్ ఆర్' లో సీతమ్మ పాత్రలో మెప్పించినప్పటి నుంచి ఏ అగ్ర హీరో సినిమా చేసినా..ఆయన సరసన అలియాభట్ పేరు వినిపిస్తుంది. ఆమె నటిస్తుందా? లేదా? అన్నది తర్వాత సంగతి ముందు అలియాభట్ పేరుని తెరపైకి తెచ్చేస్తున్నారు. దర్శకులు కూడా అలియా అయితేనే బాగుంటుందని భావిస్తున్నారు.
ఇలా అమ్మడు హిందీ నటి అయినా భాషతో సంబంధం లేకుండా టాలీవుడ్ లోనూ జోరు చూపిస్తోంది. అమ్మడిలో ప్రతిభనే ఆ స్థాయికి తీసుకెళ్లింది. ఎలాంటి పాత్ర అయినా ఆలవోకగా పోషించగల నటి. అందుకే హాలీవుడ్ లోనూ అవకాశాలు అందుకుంటుంది. 69వ జాతీయ అవార్డు వేడుకల్లో ఉత్తమ నటి అవార్డు కూడా అందుకోగల్గింది. 'గంగూబాయి కతియావాడి'కి గానూ అవార్డు కైవసం చేసుకుని మరోసారి పాన్ ఇండియాలో సంచలనమైంది.
రెండు రోజుల నుంచి ప్రశంసల వర్షంలో తడిసి ముద్దవుతుంది. అభినందనలు అందుకోవడంతోనే సమయమంతా సరిపోయింది. తాజాగా ఈ సందర్భాన్ని గుర్తు చేసుకుని ఓ ఆసక్తికర పోస్ట్ చేసింది. 'నన్ను ఎంతగానో ఆదరిస్తోన్న ప్రేక్షకులకి రుణపడి ఉంటాను. ఈ జాతీయ వార్డు మీదే. మీరు లేకపోతు ఈ అవార్డు లేదు. నేను ఉండేదాన్ని కాదు. ఇంత గుర్తింపు కు ప్రధాన కారకులు ప్రేక్షకులు మాత్రమే. వాళ్ల ఆదరించారు కాబట్టి ఇవన్నీ అని భావోద్వేగానికి గురైంది. వీలైంతకాలం వినోదం పంచడానికి సిద్దంగా ఉంటాను. ఎప్పటికీ నేను మీ గంగూనే. ఈ సినిమా నాకు అందించిన సంజయ్ లీలా భన్సాలీకి..ఇతర చిత్ర బృందానికి ప్రత్యేకంగా ధన్యవాదాలు' అని అంది.
అలియాభట్ కెరీర్ లో గంగూబాయి కతియావాడి ఓ మైల్ స్టోన మూవీ. ఇదే అమ్మడి తొలి లేడీ ఓరియేంటెడ్ చిత్రం. గంగూబాయి అనే ఓ మాఫియా డాన్ మహిళ జీవిత కథ ఆధారంగా ఈ సినిమాని దర్శకుడు సంజయ్ లీల భన్సాలీ తెరకెక్కించారు. రిలీజ్ అనంతరం బాక్సాఫీస్ ని వసూళ్లతో షేక్ చేసింది. కోవిడ్ సంక్షోభంతో సక్సెస్ లేక విలవిలాడుతోన్న సమయంలో గంగూబాయి సక్సెస్ తో బాలీవుడ్ కి ఊపిరి పోసిన చిత్రమిది.