సరిపోదా శనివారం.. సూర్యాస్ ఫైరీ ఆంథమ్

నేచురల్ స్టార్ నాని ఈ మధ్యకాలంలో వరుసగా సక్సెస్ లు అందుకుంటూ దూసుకుపోతున్నాడు.

Update: 2024-07-02 07:33 GMT

నేచురల్ స్టార్ నాని ఈ మధ్యకాలంలో వరుసగా సక్సెస్ లు అందుకుంటూ దూసుకుపోతున్నాడు. టైర్ 2 హీరోల జాబితా నుంచి తన ఇమేజ్ పెంచుకుంటూ స్టార్ హీరోల లైన్ లోకి వచ్చేలా కనిపిస్తున్నాడు. నాని స్టోరీ సెలక్షన్ కూడా చాలా డిఫరెంట్ గా ఉంటుంది. భిన్నమైన కథలతో మూవీస్ చేస్తున్నాడు. ప్రతి సినిమాలో ఏదో ఒక ఇంటరెస్టింగ్ ఎలిమెంట్ ని టచ్ చేస్తూ ప్రేక్షకులని థ్రిల్ చేస్తున్నాడు.


ఈ కారణంగా నేచురల్ స్టార్ సినిమాలు చూడటానికి అందరూ ఆసక్తి చూపిస్తున్నారు. దసరా, హాయ్ నాన్న సినిమాలతో గత ఏడాది నాని రెండు సూపర్ హిట్స్ ని ఖాతాలో వేసుకున్నాడు. ప్రస్తుతం వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో సరిపోదా శనివారం అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకి రావడానికి రెడీ అవుతున్నాడు. ఈ చిత్రం ఆగష్టు 29న పాన్ ఇండియా లెవల్ లో రిలీజ్ కాబోతోంది. మూవీలో ప్రియాంక అరుళ్ మోహన్ హీరోయిన్ గా నటిస్తోంది.

ఇదిలా ఉంటే ఈ సినిమా నుంచి గరం గరం అంటూ సాగె ఫస్ట్ సింగిల్ ని తెలుగులో రెండు వరాల క్రితం రిలీజ్ చేశారు. ఇప్పుడు అదే సాంగ్ ని సూర్యాస్ ఫైరీ ఆంథమ్ అంటూ హిందీతో పాటు తమిళ్, కన్నడ, మలయాళీ భాషలలో ప్రేక్షకుల ముందుకి తీసుకొచ్చారు. ఈ సాంగ్ కి మంచి ఆదరణ లభిస్తోంది. డిఫరెంట్ కాన్సెప్ట్ తో వస్తోన్న సినిమా కావడంతో కచ్చితంగా ప్రేక్షకులకి కనెక్ట్ అవుతుందనే కాన్ఫిడెన్స్ తో చిత్ర యూనిట్ ఉంది.

ఈ సినిమాకి జేక్స్ బిజోయ్ మ్యూజిక్ అందిస్తున్నారు. సూర్యాస్ ఫైరీ ఆంథమ్ సాంగ్ ట్రెండింగ్ లో దూసుకుపోతోంది. ఎస్.జె.సూర్య ఈ చిత్రంలో ప్రతినాయకుడిగా నటించారు. వారం రోజుల కోపాన్ని శనివారం చూపించే వ్యక్తిగా ఈ చిత్రంలో నాని నటించాడు. సూర్యాస్ సాటర్ డే టైటిల్ తో ఈ మూవీ ఇతర భాషలలో రిలీజ్ కానుంది.

Read more!

వరుస విజయాలతో దూసుకుపోతున్న నానికి ఈ మూవీ ఎలాంటి రిజల్ట్ ఇస్తుందనేది వేచి చూడాలి. వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో నాని గతంలో అంటే సుందరానికి మూవీ చేశారు. ఫ్యామిలీ అండ్ లవ్ డ్రామాగా సాగిన ఈ మూవీ ఆశించిన స్థాయిలో మెప్పించలేదు. అయితే ఈ సారి వివేక్ యాక్షన్ కథాంశంతో నానికి హిట్ ఇవ్వాలని గట్టిగా ప్రయత్నం చేస్తున్నాడు.

Full View
Tags:    

Similar News