గీతాంజలి.. హారర్ ప్లాన్ మారింది

ఎంత కొత్తగా ఉంటే సినిమా జనాల్లోకి అంత త్వరగా వెళుతుంది అని ఆలోచిస్తూ ఉన్నారు

Update: 2024-02-24 09:44 GMT

సినిమా కంటెంట్ కు తగ్గట్టుగా ప్రమోషన్స్ చేయడం ఈ రోజుల్లో చిత్ర యూనిట్ సభ్యులకు చాలా చాలెంజింగ్ గా మారిపోయింది. ఎంత కొత్తగా ఉంటే సినిమా జనాల్లోకి అంత త్వరగా వెళుతుంది అని ఆలోచిస్తూ ఉన్నారు. ఇక భయపెట్టే ఒక సినిమాకు సంబంధించిన ప్రమోషన్స్ ను ఏకంగా స్మశాన వాటికలో స్టార్ట్ చేయాలి అనుకున్నా ఒక చిత్ర యూనిట్ అందరిని ఆశ్చర్యానికి గురి చేసింది.

గీతాంజలి మళ్లీ వచ్చింది సినిమాకు సంబంధించిన అప్డేట్ ఇటీవల ఇండస్ట్రీలో కూడా హాట్ టాపిక్ గా మారిన విషయం తెలిసిందే.

ఈ సినిమాలో అంజలి ప్రధాన పాత్రలో నటిస్తుండగా శ్రీనివాస్ రెడ్డి సత్యం రాజేష్ సత్య కీలకపాత్రలో కనిపించబోతున్నారు. ఇక కోన వెంకట్ ఈ సినిమాకు స్టోరీ అందిస్తుండగా జీవి దర్శకత్వం వహిస్తున్నారు. ఎంవివి.సత్యనారాయణ కొన వెంకట కాంబినేషన్లో ఈ సినిమాను నిర్మిస్తున్నారు.

కోన వెంకట్ సమర్పణలో తెరపైకి రాబోతున్న గీతాంజలి మళ్లీ వచ్చింది సినిమా టీజర్ లాంచ్ వేడుకను మొదట బేగంపేట స్మశాన వాటికలో లాంచ్ చేయాలని అనుకున్నారు. అది కూడా రాత్రి 7 గంటలకు ప్లాన్ చేయడంతో అందరూ ఒక్కసారిగా అవాక్కయ్యారు. అయితే ఈ విషయంలో సోషల్ మీడియాలో కూడా అనేక రకాల అభిప్రాయాలు కూడా వ్యక్తమయ్యాయి.

మరికొందరు సినీ ప్రముఖులే సరదాగా సెటైర్లు కూడా వేశారు. ఆత్మలకు కూడా మనోభావాలు ఉంటాయి అనే విధంగా కూడా మరి కొందరు కామెంట్ చేశారు. ఇక ఆ విషయంలో మొత్తానికి చిత్ర యూనిట్ నిర్ణయాన్ని మార్చుకున్నారు. టీజట్ లాంచ్ వేదికను మరొక చోటికి మార్చినట్లు అధికారికంగా తెలియజేశారు.

ఆత్మల ఆత్మగౌరవాన్ని, మనోభావాలను పరిగణనలోకి తీసుకుంటూ, భయబ్రాంతులకు గురవుతున్న మా టీం సబ్యులను అర్థం చేసుకుంటూ, కొంతమంది మిత్రుల పాత్రికేయుల సలహమేరకు మా టీజర్ లాంచ్ వేదికను దస్ పల్లా కన్వెన్షన్ సెంటర్ కు మార్చడం జరిగిందని సరదాగానే క్లారిటీ ఇచ్చారు. ఇక ఈ విషయంపై కూడా భిన్నమైన స్థాయిలో అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి మొత్తానికి గీతాంజలి టీం అయితే మరోసారి సినిమాపై అందరి ఫోకస్ పడేవిధంగా ప్రమోషన్స్ అయితే చేస్తోంది.

Tags:    

Similar News