కియారా, నయన్, కరీనా పై ఇదే క్లారిటీ!
కానీ ఆమె ఎగ్జిట్ అయినట్లు తాజాగా తెలుస్తోంది. ఇక సినిమాలో నయనతార హీరో పాత్రకి అక్కగా నటిస్తుందని ప్రచారంలో ఉంది. ఆ పాత్ర కేవలం గెస్ట్ రోల్ అనుకున్నారు.
రాకింగ్ స్టార్ యశ్ కథానాయకుడిగా గీతూ మోహన్ దాస్ దర్శకత్వంలో భారీ కాన్వాస్ పై 'టాక్సిక్' తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. డ్రగ్స్ మాఫియా నేపథ్యంలో తెరకెక్కుతోన్న చిత్రమిది. ఇప్పటికే రిలీజ్ అయిన ప్రచార చిత్రాలు...యశ్ లుక్ ప్రతీది అంచనాలు పెంచేస్తుంది. కియారా అద్వాణీ, నయనతార లాంటి స్టార్ హీరోయిన్లు నటిస్తున్నారు. కరీనా కపూర్ పేరు కూడా తెరపైకి వచ్చింది. అయితే ఎవరు ఎలాంటి పాత్ర పోషిస్తున్నారు? అన్నది ఇంత వరకూ క్లారిటీ లేదు.
ఈ నేపథ్యంలో ప్రాజెక్ట్ కి సంబంధించి తాజ్ అప్ డేట్ వైరల్ అవుతోంది. ఇందులో యశ్ కి జోడీగా కియారా అద్వాణి నటిస్తోందిట. ప్రస్తుతం గోవాలో హీరో, హీరోయిన్లపై ఓ పాట చిత్రీకరిస్తున్నట్లు సమాచారం. వాస్తవానికి హీరోయిన్ పాత్రలో కరీనా కపూర్ ని తీసుకోవాలనుకున్నారు. కానీ అమె అధిక పారితోషికం డిమాండ్ చేయడంతో ప్రాజెక్ట్ నుంచి ఆమె వైదొలిగినట్లు తెలుస్తోంది. కరీనా హీరోయిన్ కాకపోయినా మరో కీలక పాత్ర పోషిస్తుందని ఇంతవరకూ కథనాలొచ్చాయి.
కానీ ఆమె ఎగ్జిట్ అయినట్లు తాజాగా తెలుస్తోంది. ఇక సినిమాలో నయనతార హీరో పాత్రకి అక్కగా నటిస్తుందని ప్రచారంలో ఉంది. ఆ పాత్ర కేవలం గెస్ట్ రోల్ అనుకున్నారు. కానీ ఇందులో నాయన్ -వివేక్ ఓబెరాయ్ కి పెయిర్ గా నటిస్తోందిట .యశ్, నయన్, వివేక్ మధ్య సినిమాలో కీలకమైన సన్నివేశాలున్నాయని చిత్ర వర్గాలు పేర్కొంటు న్నాయి. దీంతో పాత్రల విషయంలో కొద్దిపాటి క్లారిటీ వచ్చింది.
ఈ చిత్రాన్ని ఏప్రిల్ 10న రిలీజ్ చేస్తున్నట్లు ఇప్పటికే ప్రకటించారు. దీంతో షూటింగ్ కూడా వేగంగా పూర్తి చేస్తు న్నారు. అయితే షూటింగ్ అప్ డేట్స్ మాత్రం అందించడం లేదు. ఆ విషయాల్లో సైతం మేకర్స్ గోప్యత వహిస్తున్నారు. మరి ప్రకటించిన తేదీకి చిత్రాన్ని రిలీజ్ చేస్తారా? లేదా? అన్నది చూడాలి.