జెంటిల్మెన్-2 బ్యూటీకి స్పెష‌ల్ ట్రైనింగ్!

యాక్ష‌న్ కింగ్ అర్జున్ - శంక‌ర్ బ్లాక్ బ‌స్ట‌ర్ యాక్ష‌న్ థ్రిల్ల‌ర్ 'జెంటిల్మెన్' కి సీక్వెల్ గా 'జెంటిల్మెన్ -2' తెర‌కెక్కుతున్న సంగ‌తి తెలిసిందే

Update: 2023-10-02 10:30 GMT

యాక్ష‌న్ కింగ్ అర్జున్ - శంక‌ర్ బ్లాక్ బ‌స్ట‌ర్ యాక్ష‌న్ థ్రిల్ల‌ర్ 'జెంటిల్మెన్' కి సీక్వెల్ గా 'జెంటిల్మెన్ -2' తెర‌కెక్కుతున్న సంగ‌తి తెలిసిందే. ఈసారి చిత్ర నిర్మాత కె.టి కుంజుమోన్ పూర్తిగా కొత్త టీమ్ తోనే ముందుకెళ్తున్నారు. ఏ. గోకుల్ కృష్ణ అనే కొత్త కుర్రాడు ద‌ర్శ‌కుడిగా పని చేస్తున్నాడు. అలాగే రెహ‌మాన్ స్థానంలో సంగీత ద‌ర్శ‌కుడిగా ఎం.ఎం కీర‌వాణీ ని తీసుకున్నారు. పాన్ ఇండియాలోనే చిత్రాన్ని తెర‌కెక్కిస్తున్నట్లు ప్ర‌క‌టించారు.

త్వ‌ర‌లోనే సినిమా రెగ్యుల‌ర్ షూటింగ్ ప్రారంభం కానుంది. అయితే ఇంత‌వ‌ర‌కూ ఈ సినిమాలో హీరో ఎవ‌రు? అన్న‌ది క్లారిటీ లేదు. య‌ధావిధిగా యాక్ష‌న్ కింగ్ నే మ‌ళ్లీ దించుతున్నారా? లేక కొత్త న‌టుడ్ని తెర‌పైకి తెస్తున్నారా? ఈ రెండు గాక కోలీవుడ్ స్టార్ హీరోనే సీన్ లోకి తెస్తున్నారా? అన్న‌ది ఆస‌క్తిక‌రంగా మారింది. జెంటిల్మెన్ కి ఉన్న ఇమేజ్ ని బ‌ట్టి ఇందులో హీరోని తీసుకోవాలి.

అలాగే కీర‌వాణి లాంటి దిగ్గ‌జం కూడా ప‌నిచేస్తున్నారు? కాబ‌ట్టి హీరో కూడా స్టార్ ఇమేజ్ ఉన్న హీరో అవుతాడ‌ని అంతా ఆశిస్తున్నారు. అయితే ఇంత‌వ‌ర‌కూ ఆ విష‌యంపై క్లారిటీ రాలేదు. తాజాగా హీరోయిన్ ఎవ‌రు? అన్న‌ది రివీల్ చేసారు. ఇందులో ప్రాచీ తెహ్లాన్ హీరోయిన్ గా ఎంపికైంది. ఈ సంద‌ర్బం గా ప్రాచీ సంతోషాన్ని వ్య‌క్తం చేసింది. ఇంత పెద్ద హిట్ ప్రాంచైజీలో భాగం అవ్వ‌డం అదృష్టంగా భావించింది.

ఇక సినిమాలో హీరోయిన్ పాత్ర‌కి ప్ర‌త్యేకంగా శిక్ష‌ణ ఇస్తున్నారుట‌. యాక్ష‌న్ స‌న్నివేశాల్లో కూడా హీరోయిన్ న‌టించాల్సి రావ‌డంతో! ఆన్ సెట్స్ లో ఇబ్బందులు ప‌డ‌కుండా ముందుగానే కొంత ట్రైనింగ్ ఇస్తే బాగుంటుంద‌ని భావించి స్టంట్ మాస్ట‌ర్లు శిక్ష‌ణ కి రిఫ‌ర్ చేసిన‌ట్లు తెలుస్తోంది. దీన్ని బ‌ట్టి హీరోయిన్ పాత్ర కూడా సాహ‌సోపేతంగానే ఉంటుంద‌ని చెప్పొచ్చు. తొలి భాగం జెంటిల్మెన్ లో హీరోయిన్ సాప్ట్ గానే క‌నిపిస్తుంది. కానీ ఇప్పుడు క‌థ‌కు త‌గ్గ‌ట్లు హీరోయిన్ రోల్ కూడా శ‌క్తివ‌తంగా తీర్చిదిద్దిన‌ట్లు తెలుస్తోంది.

Tags:    

Similar News