నడుము మరీ అంత వయ్యారంగానా?

'పెళ్లి చూపులు'.. ఆ మధ్య తెలుగులో వచ్చిన ఈ షో గుర్తుందా? 14 మంది అమ్మాయిలతో యాంకర్ ప్రదీప్ లీడ్ గా ఆ షోను ఒక ఛానల్ నిర్వాహకులు ఏర్పాటు చేశారు.

Update: 2024-05-12 12:12 GMT

'పెళ్లి చూపులు'.. ఆ మధ్య తెలుగులో వచ్చిన ఈ షో గుర్తుందా? 14 మంది అమ్మాయిలతో యాంకర్ ప్రదీప్ లీడ్ గా ఆ షోను ఒక ఛానల్ నిర్వాహకులు ఏర్పాటు చేశారు. షోలో విజేతగా నిలిచిన అమ్మాయితో ప్రదీప్‌ కు పెళ్లి చూపులు జరుగుతాయని నిర్వహకులు అప్పట్లో వెల్లడించారు. అయితే ఈ షో టైటిల్ ను తెలుగమ్మాయి జ్ఞానేశ్వరి కాండ్రేగుల సొంతం చేసుకుంది. కానీ షో తర్వాత వీరిద్దరూ జంటగా ఎప్పుడూ కనిపించలేదు. దీంతో ఇదంతా టీఆర్పీ స్టంట్ మాత్రమేనని అందరికీ అర్థమైంది.


ఇక షార్ట్ ఫిల్మ్‌ లు చేసుకుంటూ కెరీర్ స్టార్ట్ చేసిన జ్ఞానేశ్వరి.. పెళ్లి చూపులు షోతో పాపులర్ అయింది. ఇండస్ట్రీలో అనేక అవకాశాలు అందుకుంది. హీరోయిన్‌ గా 'మిస్టర్ అండ్ మిస్' మూవీ చేసింది. ఆ తర్వాత 'నీ జతగా', 'మాయలో', 'చక్రవ్యూహం' వంటి పలు చిత్రాల్లో కనిపించి తన నటనతో ఆకట్టుకుంది. ఇప్పుడు కూడా జ్ఞానేశ్వరి కాండ్రేగుల.. కొన్ని సినిమాలతో పాటు వెబ్ సిరీసుల్లో కూడా యాక్ట్ చేస్తోంది.


సినిమాలతో పాటు వెబ్ సిరీసుల్లో ఎంత బిజీగా ఉన్నా.. సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్ గా ఉంటోంది ఈ బ్యూటీ. తన ఫాలోయింగ్ ను ఓ రేంజ్ లో పెంచుకుంటోంది. పర్సనల్ తో పాటు ప్రొఫెషనల్ లైఫ్ కు సంబంధించిన విషయాలను ఫ్యాన్స్‌ తో షేర్ చేసుకుంటోంది. అదే సమయంలో అదిరిపోయే ఫోటోలు, వీడియోలు షేర్ చేస్తుంటోంది. కొన్ని నెలలుగా గ్లామర్ గేట్లు ఎత్తేసి మరీ.. వేరే లెవల్ లో స్కిన్ షో చేస్తోంది.


ఎప్పటికప్పుడు వెకేషన్స్ కు వెళ్తూ అక్కడ దిగిన పిక్స్ పోస్ట్ చేస్తుంటోంది. పొట్టి డ్రెస్సులు, బికినీల్లో కనిపించి కుర్రకారు మతులు పోగుడుతుంటోంది. జిమ్ లో వర్కౌట్స్ చేస్తున్న వీడియోలతో నెట్టింట సెగలు పుట్టిస్తుంటోంది. కచ్చితంగా తన పేజ్ డైలీ చూడాలనిపించేలా అందాలు విందు ఇస్తుంటోంది. తాజాగా కొత్త పిక్స్ షేర్ చేసి.. అందరి చూపు తనవైపు తిప్పుకుంది జ్ఞానేశ్వరి కాండ్రేగుల.


'మీ కళ్ళలోకి తిరిగి చూస్తున్నాను!' అంటూ క్యాప్షన్ ఇచ్చి వయ్యారాలు ఒలకబోసింది. అందాలన్నీ కనిపించేలా శారీ కట్టుకుని మాయ చేస్తోంది. నడుము మడతపై వడ్డాణం పెట్టుకుని.. అందరి ఫోకస్ అక్కడ పడేలా హోయలు ఒలికిస్తోంది. ఓరగా చూస్తూ నెటిజన్లను ఫిదా చేస్తోంది. ప్రస్తుతం జ్ఞానేశ్వరి పిక్స్ చూసిన కుర్రాళ్లు అల్లాడిపోతున్నారు. నడుమును మరీ అంత వయ్యారంగా చూపించాలా అమ్మడు అంటూ కామెంట్లు పెడుతున్నారు.

Tags:    

Similar News