ఇలా చేస్తే సక్సెస్ ఎలా వస్తుంది గోపి?
కానీ జనాలు ఇంకా ఎన్ని రోజులు అలా చూడాలి? అతను ఎప్పటినారే రెగ్యులర్గా యాక్షన్ లేదా ఫ్యామిలీ ఎలిమెంట్స్ తో ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నాడు.
మాస్ హీరోగా గోపీచంద్ కూడా మంచి క్రేజ్ అయితే ఉంది. పాజిటివ్ రోల్స్ మాత్రమే కాకుండా పవర్ఫుల్ నెగిటివ్ షేడ్స్ ఉన్న క్యారెక్టర్ తో కూడా ఆకట్టుకునే సత్తా ఉంది. టాలెంట్ విషయంలో అయితే గోపీచంద్ కు ఎలాంటి పేర్లు పెట్టాల్సిన అవసరం లేదు. మధ్య మధ్యలో కామెడీ సినిమాలు కూడా ట్రై చేసి బాగానే సక్సెస్ అందుకున్నాడు. అయితే గత కొన్ని నెలలుగా మాత్రం అతను వరుసగా డిజాస్టర్ సినిమాలతో తన మార్కెట్ కోల్పోతున్నాడు.
నిజానికి గోపిచంద్ కు చివరగా 2014లో లౌక్యం సినిమాతోనే పర్ఫెక్ట్ సక్సెస్ వచ్చింది. ఆ తరువాత అతను చేసిన ఏ సినిమా కూడా పూర్తిస్థాయిలో లాభాలు అందించలేకపోయింది. తన రెగ్యులర్ యాక్షన్ ఫార్ములా లోనే గోపీచంద్ కొత్తగా ఆకట్టుకునేందుకు ప్రయత్నం చేస్తున్నాడు. కానీ ఏది వర్కౌట్ కావడం లేదు. ముఖ్యంగా గౌతమ్ నంద సినిమా బాగుంది అనే కామెంట్స్ వచ్చాయి. కానీ అది కూడా పెద్దగా ఆడలేదు.
ఇక 2017 నుంచి గోపీచంద్ నుంచి మొత్తంగా 10 సినిమాలు రాగా అందులో ఒకటి కూడా సక్సెస్ కాలేదు. కొన్ని అయితే ఎప్పుడో షూటింగ్ పూర్తయితే మరెప్పుడో విడుదలయ్యాయి. మొన్న వచ్చిన రామబాణం సినిమా అయితే అసలు ఏ కోణంలోనూ ఆకట్టుకోలేకపోయింది. తనకు సక్సెస్ ఇచ్చిన దర్శకులు కూడా గోపీచంద్ కు మళ్లీ సక్సెస్ ఇవ్వలేకపోతున్నారు.
ఇక గోపీచంద్ చేస్తున్న తప్పు ఏమిటి అంటే.. అతనికి సీరియస్ పవర్ఫుల్ హీరో క్యారెక్టర్స్ అలాగే మంచి అబ్బాయి పాత్రలు బాగానే సెట్ అవుతాయి. కానీ జనాలు ఇంకా ఎన్ని రోజులు అలా చూడాలి? అతను ఎప్పటినారే రెగ్యులర్గా యాక్షన్ లేదా ఫ్యామిలీ ఎలిమెంట్స్ తో ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నాడు. ఈ రోజుల్లో నటులు యాక్టింగ్ లోనే కాకుండా కంటెంట్ లో కూడా ఊహలకు అందనిదేదో చూపించాలి. ఈ రోజుల్లో మాస్ కమర్షియన్స్ సినిమాలు అంటే కేవలం టాప్ హీరోలకు మాత్రమే కలిసి వస్తున్నాయి. అది కూడా పండగ సీజన్లో కంటెంట్ క్లిక్ అయితేనే కలెక్షన్ సాలీడ్ గా ఉంటున్నాయి.
ఇక మిగతాజీ ఎవరు మాస్ కమర్షియల్ సినిమాలు చేసిన కూడా పెద్దగా లెక్క చేయడం లేదు. ఇక గోపీచంద్ నెక్స్ట్ సినిమా బీమా ఫస్ట్ లుక్ చూస్తే అది కూడా రెగ్యులర్ మాస్ కమర్షియల్ సినిమా అని అనిపిస్తుంది. అందులో పోలీస్ క్యారెక్టర్ లో కూడా కనిపించబోతున్నాడు. ఇక తర్వాత శ్రీను వైట్ల దర్శకత్వంలో చేయనున్న సినిమా కూడా రెగ్యులర్ కమర్షియల్ ఫార్మాట్లోనే ఉండబోతున్నట్లుగా తెలుస్తోంది. ఏదేమైనాప్పటికీ గోపీచంద్ ఈ రెగ్యులర్ పాయింట్స్ కాకుండా కాస్త డిఫరెంట్ జానర్స్ లో మళ్ళీ తనను తాను సరికొత్తగా ప్రొజెక్ట్ చేసుకొని ఒక సక్సెస్ అందుకుంటే ఫామ్ లోకి వచ్చే అవకాశం ఉంటుంది. మరి ఆ రూట్లో ఏదైనా కొత్త కథను చేస్తాడో లేదో చూడాలి.