తెలుగులో సంచలన వెబ్ సీరీస్

73 ఎపిసోడ్‌ల రన్ సమయంలో విపరీతమైన ప్రజాదరణ పొందింది. ఇప్పుడు, ఈ ఐకానిక్ సిరీస్ తెలుగులోకి డబ్ చేయబడింది.

Update: 2023-11-08 11:30 GMT
తెలుగులో సంచలన వెబ్ సీరీస్
  • whatsapp icon

ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించిన వెబ్ సిరీస్ లలో 'గేమ్ ఆఫ్ థ్రోన్స్' నెంబర్ వన్ స్థానంలో ఉంటుందని చెప్పవచ్చు. ఈ సీరీస్ సాధారణ జనాల నుంచి స్టార్ సెలబ్రిటీల వరకు అందరి హృదయాలను కొల్లగొట్టింది. 2011లో మొదటిసారిగా HBOలో ప్రసారమైన ఈ సీరీస్ ఆ తరువాత ఊహించని స్థాయిలో రెస్పాన్స్ అందుకుంది. టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు కూడా ఈ సీరిస్ పేవరేట్ అని పలు ఇంటర్వ్యూలో తెలియజేశారు.

ఇక 2019లో సీరీస్ ముగిసింది. 73 ఎపిసోడ్‌ల రన్ సమయంలో విపరీతమైన ప్రజాదరణ పొందింది. ఇప్పుడు, ఈ ఐకానిక్ సిరీస్ తెలుగులోకి డబ్ చేయబడింది. మొదటి ఎపిసోడ్ నుండి, ఈ ధారావాహిక భారీ ఫాలోయింగ్‌ను పొందింది, అన్ని వయసుల వారిని ఆకట్టుకుంది. ప్రతీసారి కొత్త సీజన్‌లను ఆసక్తిగా ఎదురుచూసేలా చేసింది.

ఈ సీరీస్ దాని తారాగణం సభ్యులను ఓవర్‌నైట్ స్టార్‌డమ్‌కి కూడా తీసుకువచ్చింది. ఇక ఈ సీరిస్ ను జియో సినిమా తెలుగు లాంగ్వేజ్ లో అందుబాటులోకి తీసుకు వస్తోంది. జియో సినిమా ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) ప్రసార హక్కులను పొందడం ద్వారా ప్రాధాన్యతను సంతరించుకుంది. ఇక OTT వీక్షకులను కూడా ఆకట్టుకోవడానికి, HBO, ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన నెట్‌వర్క్, డిజిటల్ కంపెనీలతో చేతులు కలిపింది.

ప్రాంతీయ భాషలలో ప్రసిద్ధ షోలను డబ్బింగ్ చేసి జియో సినిమాస్ హాట్ టాపిక్ గా నిలిస్తోంది. ఇక ఇప్పుడు ఈ సంస్థ చేతికి గేమ్ ఆఫ్ థ్రోన్స్.రావడంతో క్రేజ్ మరింత పెరిగింది. 'గేమ్ ఆఫ్ థ్రోన్స్' అనేది ఒక ఫాంటసీ, యాక్షన్-అడ్వెంచర్ సీరీస్. ట్రాజెడీ డ్రామాతో పాటు ఇందులో బోల్డ్ కంటెంట్ కూడా హైలెట్ అయ్యింది.

ఈ సిరీస్ లో ఉండే పాత్రలు అలాగే రాజ్యాలు పాలిటిక్స్ ఎన్నో అంశాలు ప్రేక్షకులను ఆకట్టుకుంటాయి. ముఖ్యంగా కొన్ని యాక్షన్ సీన్స్ కూడా ఇందులో చాలా హైలెట్ గా నిలిచాయి. ఇక ప్రపంచ వ్యాప్తంగా ఎన్నో భాషలలో వచ్చిన ఈ సిరీస్ ఇప్పుడు తెలుగువారిని ఆకట్టుకోవడానికి సిద్ధమైంది. తెలుగులో GOT వెబ్ సిరీస్ ఎంతవరకు క్లిక్ అవుతుందో చూడాలి.

Tags:    

Similar News