పనిమనిషిలా నటిస్తూ హీరో ఇంట్లో మంత్రి కూతురు
బాలీవుడ్‌ని ఖాన్‌ల త్రయం ఏల్తున్న రోజుల్లోనే గోవిందా అగ్రహీరోగా హోదాను ఆస్వాధించాడు.
బాలీవుడ్‌ని ఖాన్‌ల త్రయం ఏల్తున్న రోజుల్లోనే గోవిందా అగ్రహీరోగా హోదాను ఆస్వాధించాడు. విపరీతమైన మహిళా ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న అతడి కామిక్ టైమింగ్ కి గొప్ప గుర్తింపు ఉంది. 90వ దశకంలో గోవిందాకు గొప్ప ఆదరణ లభించింది. ఎంతగా అంటే ఒక అభిమాని తన ఇంట్లో ఉండేందుకు పనిమనిషిగా నటించింది. 20 రోజుల పాటు అతడి ఇంట్లోనే ఉండిపోయింది.
చివరికి ఆమె ఒక మంత్రి కుమార్తె అని తెలిసి గోవిందా కుటుంబం షాక్ కి గురైంది. ఈ ఆసక్తికరమైన సంఘటనను గోవింద భార్య సునీతా అహూజా ఇటీవలే వెల్లడించారు. ఒక పాడ్ కాస్ట్ లో సునీత మాట్లాడుతూ -``ఇంట్లో సహాయకురాలిగా నటిస్తూ 20-22 రోజుల పాటు సదరు మహిళా అభిమాని మాతో ఉన్నారు`` అని తెలిపారు.
ఆమె బాగా డబ్బున్న కుటుంబానికి చెందిన అమ్మాయిలా ఉందని నేను అనుకున్నాను. నేను మా అత్తగారితో చెప్పాను. ఆమెకు గిన్నెలు తోమడం.. ఇల్లు శుభ్రం చేయడం ఎలాగో తెలియదు. చివరికి ఆమె ఎవరో మంత్రి కుమార్తె అని, గోవిందా అభిమాని అని మాకు తెలిసింది.. అని తెలిపారు. అభిమాని పథకాన్ని ఎలా ఛేధించారో కూడా సునీత వెల్లడించారు.
ఆమె పని చూశాక నాకు అనుమానం వచ్చింది. ఆమె చాలా త్వరగా మేల్కొని గోవిందా కోసం వేచి ఉండేది. అలా 20రోజులు పని చేసింది. నేను ఆశ్చర్యపోయాను. చివరికి తనను గట్టిగా అడిగితే ఏడ్చేసి చివరికి అసలు నిజం చెప్పింది. ఆమె తండ్రికి విషయం చెప్పాం. నాలుగు కార్లలో వచ్చి తనను తీసుకుని వెళ్లడం చూసి షాకయ్యాం. ఇది ఆయన(గోవిందా)కు ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్.. అని సునీత తెలిపారు.
ఒకప్పుడు తాను దాదాపు ఒక సంవత్సరం పాటు గోవిందాతో డేటింగ్ చేసానని సునీత వెల్లడించారు. కానీ గోవిందా నైతిక సరిహద్దును దాటడం గురించి ఆందోళన చెందానని తెలిపారు. అప్పటికి 18 ఏళ్లు నిండాయి. 1987లో గోవింద - సునీత వివాహం చేసుకున్నారు. 1989లో కుమార్తె టీనాను, 1997లో కుమారుడు యశ్వర్దన్‌ను స్వాగతించారు.