గ్రామీ అవార్డుల్లో భారతీయుల హవా
వీళ్లు కంపోజ్ చేసిన 'దిస్ మూమెంట్' ఉత్తమ గ్లోబల్ ఆల్బమ్ అవార్డును గెలుచుకుంది.
సంగీత రంగంలో ప్రతిష్టాత్మకంగా భావించే 66 గ్రామీ అవార్డుల ప్రదానోత్సవం ఆదివారం ఆమెరికాలోని లాస్ ఏంజిల్స్ లో అట్టహాసంగా జరిగింది. ప్రపంచ దేశాలకు చెందిన సినీ ప్రముఖులు పాల్గొని తమ పాటలతో అలరించారు. ఈ అంతర్జాతీయ వేదికపై భారతీయ సంగీత కళాకారులు శంకర్ మహదే వన్..జాకీర్ హుస్సేన్ లుజయకేతనం ఎగురవేసారు. వీళ్లు కంపోజ్ చేసిన 'దిస్ మూమెంట్' ఉత్తమ గ్లోబల్ ఆల్బమ్ అవార్డును గెలుచుకుంది.
ఈపాటను జాన్ మెక్ లాప్లిన్ (గిటార్)- జాకీర్ హుస్సేన్ (తబలా) శంకర్ మహదేవన్ (సింగర్)..గణేష్ రాజగోపాలన్(వయోలిన్) మొత్తం ఎనిమిది మంది శక్తి బ్యాండ్ పేరిట కంపోజ్ చేసారు. ప్రపంచ వ్యాప్తంగా అందరి నుంచి పోటీని ఎదుర్కుని శక్తి విజేతంగా నిలవడంతో అంతర్జాతీయంగా ప్రశంసలు వెల్లువెతుతున్నాయి. గ్రామీ అవార్డుల్లో 'పాష్తో'కి గాను ఉస్తాద్ జాకీర్ హుస్సేన్ మూడు అవార్డులను గెలుచుకుని చరిత్ర సృష్టించారు.
ఉత్తమ ర్యాప్ ఆల్బమ్ - మైఖేల్ (కిల్లర్ మైక్) ఉత్తమ ఆఫ్రికన్ సంగీత ప్రదర్శన - టైలా (వాటర్) మ్యాజిక్ వీడియో - జోనథన్ క్లైడ్ ఎమ్ కూపర్ (ఐయామ్ ఓన్లీ స్లీపింగ్) గ్లోబల్ మ్యూజిక్ ప్రదర్శన - జాకిర్ హుస్సేన్, బెలా ఫెక్ (పష్టో) గ్లోబల్ మ్యూజిక్ ఆల్బమ్ - శక్తి (దిస్ మూమెంట్) ఉత్తమ బ్లూగ్రాస్ ఆల్బమ్ - మొల్లీ టర్టల్ & గోల్డెన్ హైవే - సిటీ ఆఫ్ గోల్డ్ ఉత్తమ కంటెంపరరీ ఇన్‌స్ట్రుమెంటల్ ఆల్బమ్ - బెలా ఫెక్, జాకిర్ హుస్సేన్, ఎడ్గార్ మెయర్, ఫీచరింగ్ రాకేష్ చౌరాసియా - ఆస్ వీ స్పీక్.
ఉత్తమ జాజ్ ఇన్‌స్ట్రుమెంటల్ ఆల్బమ్ - బిల్లీ చైల్డ్స్ - ద విండ్స్ ఆఫ్ చేంజ్ ఉత్తమ కంట్రీ సోలో ప్రదర్శన క్రిస్ స్టేప్లెటన్ - (వైట్ హార్స్) ఉత్తమ కంట్రీ సాంగ్ క్రిస్ స్టేప్లెటన్ - (వైట్ హార్స్) ఉత్తమ కామెడీ ఆల్బమ్ - డేవ్ చాపెల్ - (వాట్స్ ఇన్ ఎ నేమ్)? ఉత్తమ మ్యూజికల్ థియేటర్ ఆల్బమ్ - సమ్ లైక్ ఇట్ హాట్ ఉత్తమ రాక్ ఆల్బమ్ - పారామోర్ - దిస్ ఇజ్ వై ఉత్తమ రాక్ సాంగ్ బాయ్‌జెనియస్ - నాట్ స్ట్రాంగ్ ఎనఫ్ ఉత్తమ మెటల్ ప్రదర్శన - మెటాలికా - 72 సీజన్స్ ఉత్తమ రాక్ ప్రదర్శన బాయ్‌జెనియస్ - నాట్ స్ట్రాంగ్ ఎనఫ్.