ఇండియాని ఊపేసిన బ్యూటీని అందంగా లేదన్నారా?
బాలీవుడ్ సీనియర్ దర్శకుడు గుడ్డు ధనోవా ఈ విషయాన్ని రివీల్ చేసారు. ' నటనపై ఎలాంటి అనుభవం లేకుండా పరిశ్రమకి వచ్చింది.
నేడు ప్రియాంక చోప్రా రేంజ్ ఏంటన్నది చెప్పాల్సిన పనిలేదు. గ్లోబల్ స్టార్ నీరాజనాలు అందుకుం టుంది. ఇండస్ట్రీ నుంచి ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా బాలీవుడ్ కెళ్లినిలదొక్కుకుంది. కొన్నాళ్ల పాటు బాలీవుడ్ ని ఏలిన బ్యూటీ అటుపై తన ట్యాలెంట్ అక్కడికే పరిమితం కాకూడదని హాలీవుడ్ కి వెళ్లింది. లక్కీగా అక్కడా సక్సెస్ అయింది. హాలీవుడ్ టాప్ స్టార్స్ సరసనా స్థానం దక్కించుకుంది.
ప్రియాంక చోప్రా ఎదిగిన వైనం ఎంతో మంది యువతికి స్పూర్తి నిస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు. ఓ సాధారణ నటి హాలీవుడ్ వరకూ వెళ్లడం అంటే చిన్న విషయం కాదు. దాన్ని ప్రియాంక చోప్రా ప్రూవ్ చేసింది. అయితే అమ్మడు ఆస్థాయికి వెళ్లే క్రమంలో ఎన్నో అవమానాలు ఎదుర్కుంది. బాలీవుడ్ లోనే ఆమెని విమర్శించిన వాళ్లు..అవమానించిన వాళ్లు ఎంతో మంది ఉన్నట్లు తాజాగా వెలుగులోకి వచ్చింది.
బాలీవుడ్ సీనియర్ దర్శకుడు గుడ్డు ధనోవా ఈ విషయాన్ని రివీల్ చేసారు. ' నటనపై ఎలాంటి అనుభవం లేకుండా పరిశ్రమకి వచ్చింది. నేర్చుకోవాలనే తపన అమెలో ఉంది. అందుకే బిగ్ బ్రదర్ తెరకెక్కించా. ఆసినిమా షూటింగ్ సమయంలో ప్రియాంక నా దగ్గరకు వచ్చి సర్ ఈసీన్స్ ఎలా చేయాలో చెప్పండి అని అడిగేది. పాత్రకు న్యాయం చేయాలని ఎంతో శ్రమించేది. 20 రోజుల షూటింగ్ తర్వాత ఆమె అందంగా లేదు.
యాక్టింగ్ కూడా రాదని ముంబై నుంచి రిపోర్ట్ వచ్చింది. దీంతో అప్పటివరకూ షూట్ చేసిన రషెస్ చూడండని అక్కడి వారు చెప్పారు. నేను, సన్నిడియోల్ చూసి ఆమెతోనే సినిమా చేయాలని నిర్ణయిం చుకున్నాం. తెరపై ఆమె కనిపించిన విధానం ఎంతో నచ్చింది. కెరీర్ లో మంచి స్థాయికి వెళ్తుందని ఆనాడే అనుకున్నాం. అనుకున్నట్లుగానే సక్సస్ అయింది' అని అన్నారు. ప్రియాంక చోప్రా తొలుత కోలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చింది. అక్కడ 'తమిళన్' అనే సినిమా చేసింది. ఆ తర్వాత బాలీవుడ్ కి వెళ్లింది.