గన్స్ అండ్ గులాబ్స్.. ఇక్కడ ఇలా.. అక్కడ అలా
గన్స్ అండ్ గులాబ్స్తో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. కానీ ఈ సారి వారి ప్రయోగం కాస్త తేడా కొట్టినట్టు కనిపిస్తోంది.
రాజ్ అండ్ డీకే.. ఓటీటీలో ఈ పేరు ఓ బ్రాండ్. హిందీలో సత్తా చాటుతున్న ఈ తెలుగు దర్శకద్వయం.. పలువురు అగ్ర కథానాయకులతో సిరీస్‌లు చేస్తూ తమకుంటూ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకున్నారు. ఇప్పటికే సమంత-మనోజ్ బాజ్‌పేయ్-ప్రియమణితో ఫ్యామిలీ మెన్, విజయ్ సేతుపతి-షాహిద్ కపూర్‌తో 'ఫర్జీ' సిరీస్‌లు చేసి ఆకట్టుకున్నారు.
ఈ రెండు సిరీస్‌లు ఓటీటీ ఆడియెన్స్‌ను బాగా మెప్పించాయి. కాస్టింగ్ ఛాయిసెస్తోనే తమ సిరీస్‌పై స్పెషల్ బజ్ క్రియేట్ చేసే ఈ దర్శకద్వయం.. ఈ సారి కూడా అలానే ఆకట్టుకున్నారు. రాజ్‌కుమార్‌రావు, దుల్కర్ సల్మాన్ వంటి స్టార్స్.. క్రైం, రొమాన్స్, వినోదం ప్రధానంగా గన్స్ అండ్ గులాబ్స్తో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. కానీ ఈ సారి వారి ప్రయోగం కాస్త తేడా కొట్టినట్టు కనిపిస్తోంది.
ఈ సిరీస్ మిక్స్డ రివ్యూస్ ఎక్కువగా వినిపిస్తున్నాయి. సౌత్ ఆడియెన్స్ రివ్యూ విషయానికొస్తే.. ఈ సిరీస్ చూడటానికి పర్వాలేదంటూనే మిక్స్డ్ రివ్యూస్ ఇస్తున్నారు. అయితే నార్త్ ఆడియెన్స్ రివ్యూ మాత్రం ఇందుకు భిన్నంగా ఉంది. బాగానే ఉందని చెబుతున్నారు. ఏదేమైనప్పటికీ గత సిరీస్‌లతో పోలిస్తే.. రాజ్ అండ్ డీకే ఈ సారి మునపటి స్థాయిలో సక్సెస్‌ను అందుకోలేదని తెలుస్తోంది.
ఈ సిరీస్‌లో రాజ్‌కుమార్ రావ్, దుల్కర్ సల్మాన్‌తో పాటు గుల్షన్ దేవయ్య, ఆదర్శ్ గౌరవ్, సతీష్ కౌశిక్, పూజా గోర్, శ్రేయా ధన్వంతరి, విపిన్ శర్మ తదితరులు నటించారు. అమన్ పంత్- సంగీతం, పంకజ్ కుమార్ -సినిమాటోగ్రఫీ అందించారు. సుమీత్ కొటియాన్ ఎడిటర్‌గా వ్యవహరించారు. సుమిత్ అరోరా, సుమన్ కుమార్ రచన అందించారు. నెట్‌ఫ్లిక్స్ వేదికగా ఇది స్ట్రీమింగ్ అవుతోంది. ప్రస్తుతం నెట్‌ఫ్లిక్స్ టాప్-10లో లిస్ట్‌లో నిలిచింది.
ఇకపోతే రాజ్ అండ్ డీకే దర్శకద్వయం తెరకెక్కించిన మరో సిరీస్ కూడా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. హాలీవుడ్ సిరీస్ సిటాడెల్‌ను ఇండియన్ వెర్షన్లో రూపొందించారు. ఇందులో సమంత ప్రధాన పాత్రలో నటించింది. అయితే హాలీవుడ్ వెర్షన్ డిజాస్టర్ టాక్‌తో బోల్తా కొట్టింది. మరి ఈ ఇండియన్ సిరీస్‌ను రాజ్ డీకే ఎలా తెరకెక్కించారో చూడాలి. ఏదేమైనప్పటీకి ఈ సిరిస్‌పై మంచి అంచనాలే ఉన్నాయి.