గుంటూరు కారం.. ముందుంది అసలు ఘాటు

సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కి ప్రేక్షకుల ముందుకి రాబోతున్న చిత్రం గుంటూరు కారం

Update: 2023-12-17 04:07 GMT

సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కి ప్రేక్షకుల ముందుకి రాబోతున్న చిత్రం గుంటూరు కారం. శ్రీలీల, మీనాక్షి చౌదరి ఈ చిత్రంలో మహేష్ బాబుకి జోడీగా నటిస్తున్నారు. హారికా హాసిని క్రియేషన్స్ బ్యానర్ పై ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్ తో రాధాకృష్ణ నిర్మిస్తున్నారు. సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకి ఈ సినిమాని తీసుకొని రానున్నారు.

ప్రస్తుతం గుంటూరు కారం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుగుతోంది. ఇప్పటికే ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా రెండు సాంగ్స్ ని రిలీజ్ చేశారు. ఈ సాంగ్స్ కి మిశ్రమ స్పందన వచ్చింది. అయితే సూపర్ స్టార్ మహేష్ బాబు చాలా కాలం తర్వాత కంప్లీట్ మాస్ రోల్ లో ఈ చిత్రంలో కనిపించబోతున్నాడు. ఈ కారణంగా మూవీకి మంచి బజ్ ఉంది.

జనవరి 12న ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ కాబోయే ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ కి చిత్ర యూనిట్ ముహూర్తం ఖరారు చేసినట్లు తెలుస్తోంది. గుంటూరు కారం ఘాటు బలంగా ఉండేలా ట్రైలర్ కట్ చేయడానికి త్రివిక్రమ్ రెడీ అయ్యారు. కచ్చితంగా ఈ ట్రైలర్ తో సినిమాపై ఎక్స్ పెక్టేషన్స్ అమాంతం పెంచాలని అనుకుంటున్నారు.

దానికి తగ్గట్లుగానే పెర్ఫెక్ట్ గా డిజైన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాకి థమన్ మ్యూజిక్ అందిస్తోన్న సంగతి తెలిసిందే. అరవింద సమేత, అల వైకుంఠపురంలో సినిమాల తరహాలోనే గుంటూరు కారం సినిమాకి బెస్ట్ మ్యూజిక్ ఇవ్వాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. ఇప్పటి వరకు అయితే సాంగ్స్ తో థమన్ మెప్పించలేకపోయారు.

త్రివిక్రమ్, సూపర్ స్టార్ కాంబినేషన్ లో గతంలో వచ్చిన అతడు, ఖలేజా థియేటర్స్ లో పెద్దగా వర్క్ అవుట్ కాలేదు. మహేష్ కెరియర్ లో బెస్ట్ మూవీస్ లో ఈ రెండు కూడా ఉంటాయి. కాని కమర్షియల్ గా వర్క్ అవుట్ కాకపోవడంతో ఈ సారి మాత్రం పక్కా కమర్షియల్ సక్సెస్ అందుకోవాలని ఇటు సూపర్ స్టార్, అటు త్రివిక్రమ్ బలంగా నిర్ణయించుకున్నారు.

అందుకు తగ్గట్లుగానే కంప్లీట్ మాస్ టచ్ తో, తన స్టైల్ ఆఫ్ హ్యూమర్ తో గుంటూరు కారంలో సూపర్ స్టార్ మహేష్ బాబు పెర్ఫార్మెన్స్ తో ఇరగదీయబోతున్నాడనే టాక్ ఇండస్ట్రీ వర్గాలలో వినిపిస్తోంది.

Tags:    

Similar News