గుంటూరు కారం.. అలా చేయకుండా ఉండాల్సింది - నాగ వంశీ
సూపర్ స్టార్ మహేష్ బాబు త్రివిక్రమ్ కాంబినేషన్ లో సంక్రాంతి కానుకగా వచ్చిన మూవీ గుంటూరు కారం
సూపర్ స్టార్ మహేష్ బాబు త్రివిక్రమ్ కాంబినేషన్ లో సంక్రాంతి కానుకగా వచ్చిన మూవీ గుంటూరు కారం. ఈ సినిమాకి థియేటర్స్ లో మిక్సడ్ టాక్ వచ్చింది. అయితే కలెక్షన్స్ పరంగా మాత్రం మంచి పెర్ఫార్మెన్స్ కనిపించింది. ఫెస్టివల్ సీజన్ కావడంతో థియేటర్స్ బాగానే హౌస్ ఫుల్ అయ్యాయి. ఈ మూవీకి రాత్రి ఒంటిగంటకి మిడ్ నైట్ ప్రీమియర్ షోస్ హైదరాబాద్ తో పాటు చాలా పట్టణాలలో వేశారు.
అయితే ఈ షోని ఎక్కువగా ఫ్యాన్స్ చూడటానికి వస్తారు. ఫ్యాన్స్ ఎక్స్ పెక్టేషన్స్ కి తగ్గట్లు మూవీ లేకపోవడంతో ఆరంభంలో కొంత నెగిటివ్ టాక్ వచ్చిందని తాజాగా నాగవంశీ మీడియా మీట్ లో చెప్పుకొచ్చారు. సలార్ పక్కా మాస్ మూవీ అది మిడ్ నైట్ షో వేసిన ఆడియన్స్ ఎంజాయ్ చేస్తారు. కానీ గుంటూరు కారం పక్కా ఫ్యామిలీ మూవీ. నిజానికి ఈ సినిమాకి మిడ్ నైట్ షో వేయకుండా ఉండాల్సింది.
ఫ్యామిలీ స్టోరీతో నడిచే సినిమాలు మిడ్ నైట్ షోలు వేయకూడదని గుంటూరు కారంకి వచ్చిన ఫీడ్ బ్యాక్ చూసిన తర్వాత అర్ధమైంది. ఆ టైంలో ఫ్యాన్స్, ఫిలిం క్రిటిక్స్ అందరూ హై ఎక్స్ పెక్టేషన్స్ తో వస్తారు. వాటిని మూవీ అందుకోలేకపోయేసరికి కాస్తా నెగిటివ్ టాక్ స్ప్రెడ్ అయ్యింది. అయితే ఫ్యామిలీ ఆడియన్స్ కి బాగా చేరువ కావడంతో తరువాత మంచి కలెక్షన్స్ వచ్చాయని మీడియా సమావేశంలో పేర్కొన్నారు.
గుంటూరు కారం సినిమా వన్ మెన్ షో కాదని, సినిమాలో సూపర్ స్టార్ మహేష్ బాబు మొత్తం కనిపిస్తున్నారు అంటే అతనితో అవన్నీ చేయించింది త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు. అంటే గుంటూరు కారం మూవీ టూ మెన్ షో అవుతుంది అంటూ నాగ వంశీ చెప్పడం విశేషం.
సినిమా ఫ్యామిలీ ఎంటర్టైనర్ కావడం వలనే మొదటి రోజు ప్రీమియర్స్ షో నుంచి కాస్తా నెగిటివ్ టాక్ వచ్చిందని ఓవరాల్ గా ప్రేక్షకులకి కనెక్ట్ అయ్యిందని నాగ వంశీ చెప్పుకొచ్చారు. సంక్రాతి ఫెస్టివల్ సందడి ముగియడంతో ఇకపై మూవీకి ఏ స్థాయిలో కలెక్షన్స్ వస్తాయనేదానిని బట్టి గుంటూరు కారం సక్సెస్ రేట్ ఆధారపడి ఉంటుందని సినీ విశ్లేషకులు అభిప్రాయం పడుతున్నారు.