ఓల్డ్‌మాంక్ రమ్ బాటిల్ లేపేస్తున్న మహేష్ బాబు
సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన 'గుంటూరు కారం' జనవరి 12న గ్రాండ్ రిలీజ్‌కి సిద్ధమైంది
సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన 'గుంటూరు కారం' జనవరి 12న గ్రాండ్ రిలీజ్‌కి సిద్ధమైంది. అభిమానులు తమ ఫేవరెట్ స్టార్ ని స్వాగతించడానికి సిద్ధంగా ఉన్నారు. ప్రస్తుతం ప్రమోషన్స్ లో మహేష్ టీమ్ జోరుమీద ఉంది. తాజాగా గుంటూరు కారం నుంచి తదుపరి బ్యాంగర్ #మావా ఎంతైనా అంటూ సాగే పాట విడుదలకు సిద్ధమైందని టీమ్ తెలిపింది.
పోస్టర్ లో ఓల్డ్‌మాంక్ రమ్ బాటిల్ లేపేస్తున్న మహేష్ బాబు ఫ్యాన్స్ లో కిక్కు పెంచాడు. ఇంతకుముందు ట్రైలర్ లో పూర్తి మాస్ అవతార్ లో కనిపించిన మహేష్ లోని ఈ యాంగిల్ ఫ్యాన్స్ తో పాటు, మందు బాబులకు కూడా కిక్కు పెంచేస్తోంది. మరీ రా..గా అలా బాటిల్ ని సింగిల్ టేక్ లో కొట్టేస్తున్నాడేంటి? అంటూ కొందరు సరదాగా జోకులు కూడా వేస్తున్నారు. ఈ సంక్రాంతి వినోదంలో కోడి పందేలకు వెళుతూ బాటిల్ మజాను ఆస్వాధించే అల్లుళ్లకు గుంటూరు కారం ట్రీట్ ఎలా ఉంటుందో మచ్చుకు మహేష్ ఇలా టీజ్ చేస్తున్నాడు అంతే. థియేటర్లకు వెళ్లి తెరపై చూస్తే అసలు సినిమా కనబడుతుంది. బాటిలెత్తేసిన గుంటూరు మిరపకాయ్ ఘాటు మామూలుగా ఉండదనేందుకు ఇది ప్రూఫ్. సంక్రాంతి సీజన్ లో భారీ మాస్ యాక్షన్ ఎంటర్ టైనర్ ఇది. రంజైన రొమాన్స్ కి కొదవేమీ ఉండదని శ్రీలీలతో సీన్స్ ప్రామిస్ చేసాయి.
థియేటర్‌లలో 'గుంటూరు కారం' ఫుల్ గా లోడ్ అవుతోంది. ఈ చిత్రం తెలుగు రాష్ట్రాల్లో జనవరి 12 వేకువఝాము 1 ఏఎంకు షో ప్రారంభం కానుంది. ప్రారంభ రోజున 1 AM షోలకు అనుమతులు లభించాయి. కొన్నిచోట్ల షోలు జనవరి 12 న ఉదయం 6గం.ల నుండి ప్రారంభమవుతాయి. అందువల్ల థియేటర్లు పెరిగిన డిమాండ్‌ను ఎన్‌క్యాష్ చేసుకునే లక్ష్యంతో టిక్కెట్ ధరను పెంచాయి. ఈ చిత్రానికి సంబంధించిన ప్రీబుకింగ్‌లు చాలా లొకేషన్‌లలో బలంగా ఉన్నాయి. సంక్రాంతి పందెంలో మహేష్ బాబుదే హవా అంటూ అభిమానులు జోష్ తో ఉన్నారు. ట్రైలర్ ఇప్పటికే మహేష్ బాబు సినిమాపై అంచనాలను పెంచింది.
త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో మీనాక్షి చౌదరి మరో కథానాయిక. జగపతి బాబు, రమ్యకృష్ణ, జయరామ్, ప్రకాష్ రాజ్, బ్రహ్మానందం కీలక పాత్రల్లో నటిస్తున్నారు. థమన్ సంగీతం అందించగా, ఛాయాగ్రహణం -ఎడిటింగ్ వరుసగా మనోజ్ పరమహంస - నవీన్ నూలి నిర్వహిస్తున్నారు.