గుంటూరు కారం.. ఆ సాంగ్ లేనట్లేనా?

ఇదిలా ఉంటే ఈ సినిమాలో మహేష్ బాబుకి జోడీగా శ్రీలీల, మీనాక్షి చౌదరి హీరోయిన్స్ గా నటించిన సంగతి తెలిసిందే.

Update: 2023-12-20 09:22 GMT

సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న మూవీ గుంటూరు కారం. ఈ సినిమా జనవరి 12న సంక్రాంతి సందర్భంగా రిలీజ్ కాబోతోంది. ఇప్పటికే మెజారిటీ షూటింగ్ మొత్తం కంప్లీట్ అయ్యింది. పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ ప్రస్తుతం నడుస్తోంది. భారీ బడ్జెట్ తో ఈ చిత్రం తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే.

ఇదిలా ఉంటే ఈ సినిమాలో మహేష్ బాబుకి జోడీగా శ్రీలీల, మీనాక్షి చౌదరి హీరోయిన్స్ గా నటించిన సంగతి తెలిసిందే. శ్రీలీలనే సినిమాలో మెయిన్ హీరోయిన్. అయితే మూవీలో ఇద్దరు హీరోయిన్స్ తో కలిసి ఒక మాస్ డ్యూయెట్ సాంగ్ ని చిత్రీకరించాలని త్రివిక్రమ్ అనుకున్నారంట. సాంగ్ ట్యూన్ కూడా థమన్ రెడీ చేయడం జరిగిందని ప్రచారం జరిగింది.

అయితే ఈ సాంగ్ సినిమా కంటెంట్ ని ఏ మాత్రం దగ్గరగా లేకపోవడంతో వద్దని సూపర్ స్టార్ మహేష్ బాబు చెప్పారని టాక్. దీంతో సాంగ్ ఎలాగూ రెడీ కావడంతో ప్రమోషన్స్ కోసం మాస్ డ్యూయెట్ వాడుదామని త్రివిక్రమ్ అనుకున్నారంట. కానీ ఇప్పుడు శ్రీ లీల తన మెడిసన్ ఫైనల్ ఇయర్ పరీక్షల కోసం రెండు నెలల పాటు షూటింగ్ లకి విరామం ఇచ్చింది.

దీంతో ఈ సాంగ్ ని షూట్ చేసే అవకాశం అయితే ప్రస్తుతానికి లేదు. ఈ నేపథ్యంలో ఇద్దరు హీరోయిన్స్ తో కలిపి మహేష్ బాబు మాస్ డ్యూయెట్ సినిమాలో ఉండే అవకాశం లేదని స్పష్టం అవుతోంది. ఇక సినిమా ప్రమోషన్స్ కి కూడా శ్రీలీల అందుబాటులో ఉండకపోవచ్చనే మాట వినిపిస్తోంది. ఈ సినిమాపై చిత్ర యూనిట్ మాత్రం చాలా కాన్ఫిడెంట్ గా ఉంది.

కానీ మహేష్ బాబు ఫ్యాన్స్ మాత్రం టెన్షన్ లో ఉన్నారు. ఇప్పటికే వచ్చిన సాంగ్స్ పెద్దగా కనెక్ట్ కాకపోవడంతో ట్రైలర్ మీద అభిమానులు హోప్స్ పెట్టుకున్నారు. జనవరి ఫస్ట్ వీక్ లో ట్రైలర్ వచ్చే ఛాన్స్ ఉంటుందనే మాట టాలీవుడ్ సర్కిల్ లో వినిపిస్తోంది. మహేష్ కి శ్రీ మంతుడు మూవీ తర్వాత కెరియర్ లో పెద్దగా డిజాస్టర్స్ లేవు. త్రివిక్రమ్ కూడా బ్యాక్ టూ బ్యాక్ రెండు బ్లాక్ బస్టర్ హిట్స్ అందుకున్నారు. మరి వీరిద్దరి కాంబోలో గుంటూరు కారం ఎలా ఉండబోతోంది అనేది చూడాలి.

Tags:    

Similar News