'గుంటూరు కారం'.. ఇలా అయితే కష్టం సారూ
ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫొటోలను బయటకొస్తున్నాయి. దీంతో మళ్లీ గుంటూరు కారంకు బ్రేక్ పడినట్టేనా?
ఎప్పుడు సార్ మీరు పూర్తి చేసేది? అసలు పూర్తి చేస్తారా లేదా మధ్యలోనే ఆపేస్తారా? ఆయనేమో అసలు సినిమాను పక్కనపెట్టి పక్క సినిమాలకు పనిచేస్తుంటారు? ఈయనేమో గ్యాప్ దొరకగానే ఫ్యామిలీతో ట్రిప్ అంటూ ఫారెన్ వెళ్లిపోతుంటారు? ఇప్పటికే అర్థమైపోయి ఉంటంది కదా.. మహేశ్ బాబు-త్రివిక్రమ్ గురించే ఈ చర్చంత.
ఈ ఇద్దరు కలిసి అప్పుడెప్పుడో మొదలు పెట్టారు 'గుంటూరు కారం' సినిమాను. అనౌన్స్ చేసినప్పటి నుంచి అన్నీ ఆటంకాలే. కథలో మార్పులు, చిత్రీకరించిన సీక్వెన్స్‌లను పక్కనపెట్టేయడం, ఆ తర్వాత పలు సార్లు షూటింగ్ పోస్ట్ పోన్ అవ్వడం, యాక్షన్ కొరియోగ్రాఫర్లను మార్చడం, నటీనటులు సెట్ అవ్వకపోవడం.. ఇలా ఎన్నో కారణాలు. దీంతో షూటింగ్ కు బ్రేక్ దొరికినప్పుడల్లా మహేశ్.. ఫారిన్ ట్రిఫ్ అంటూ ఫ్యామీలితో కలిసి చెక్కేస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ బ్రేక్ గ్యాప్ లో ఎన్ని సార్లు వెళ్లి వచ్చారో. ఇప్పుడు మళ్లీ ఆయన వెకేషన్ అంటూ లండన్ బయలుదేరిపోయారు.
ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫొటోలను బయటకొస్తున్నాయి. దీంతో మళ్లీ గుంటూరు కారంకు బ్రేక్ పడినట్టేనా? అని అంతా అంటున్నారు. ఇలా అయితే గుంటూరు కారం సినిమా ఎప్పటికీ పూర్తి చేస్తారు గురూజీ సార్? అంటూ ప్రశ్నిస్తున్నారు. సినిమా అసలు విడుదల చేసే ఉద్దేశం అని అడుగుతున్నారు. వాస్తవానికి ఇప్పుడు మహేశ్ లేకుండా.. త్రివిక్రమ్ ఇతర పాత్రలపై చిత్రీకరణ చేస్తున్నారా? లేదా అనేది క్లారిటీ లేదు.
ఇకపోతే ఈ సినిమాలో మొదట హీరోయిన్‌గా పూజా హెగ్డేను ఎంచుకున్నారు. సెకండ్ హీరోయిన్‌గా శ్రీలీలను తీసుకున్నారు. అయితే ఇప్పుడు పూజాహెగ్డే తప్పుకుంది. దీంతో రెండో హీరోయిన్‌గా ఉన్న శ్రీలీలను మొదటి హీరోయిన్ గా ఫైనలైజ్ చేశారు. రెండో కథానాయికగా మీనాక్షి చౌదరిని తీసుకున్నారు. మాస్, కమర్షియల్ ఎంటర్‌టైనర్‌గా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు.
'అతడు', 'ఖలేజా' తర్వాత మహేశ్ - త్రివిక్రమ్ కలిసి చేస్తున్న సినిమా కావడంతో దీనిపై అంచనాలు ఉన్నాయి. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్ పై ఎస్.రాధాకృష్ణ నిర్మిస్తున్నారు. తమన్ సంగీతం అందిస్తున్నారు. ఛాయాగ్రహణం.. పి.ఎస్.వినోద్, కళ... ఎ.ఎస్.ప్రకాశ్ అందిస్తున్నారు. వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 13న విడుదల చేస్తామని గతంలో మూవీటీమ్ ప్రకటించింది. చూడాలి మరి ఈ సమయానికి మూవీని రిలీజ్ చేస్తారో లేదో..