ఈ రోజుల్లో సెంచరీ... వీడు మగాడ్రా బుజ్జీ

ఒకప్పుడు హీరోలు వందల కొద్ది సినిమా లు చేశారు. ఏడాదికి అయిదు నుంచి పదిహేను సినిమాల వరకు విడుదల చేసిన హీరోలు తెలుగు సినిమా ఇండస్ట్రీ లో కూడా చాలా మంది ఉన్నారు

Update: 2023-10-27 08:05 GMT

ఒకప్పుడు హీరోలు వందల కొద్ది సినిమా లు చేశారు. ఏడాదికి అయిదు నుంచి పదిహేను సినిమాల వరకు విడుదల చేసిన హీరోలు తెలుగు సినిమా ఇండస్ట్రీ లో కూడా చాలా మంది ఉన్నారు. అలాంటి పరిస్థితి నుంచి ఇప్పుడు రెండు మూడు ఏళ్లకు ఒక సినిమాను చేసే పరిస్థితి వచ్చింది. ఇప్పుడు హీరోలు కెరీర్‌ మొత్తం లో పాతిక సినిమా లు చేస్తే గొప్ప విషయం.

కేవలం హీరోలు మాత్రమే కాకుండా హీరోయిన్స్‌, దర్శకులు, ఇతర టెక్నీషియన్స్ ఎవరైనా కూడా ఇదే పరిస్థితి నెలకొంది అనే విషయం ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. చాలా కొద్ది మంది మాత్రం సినిమాల సంఖ్య ఇతరులు చూసి ఆశ్చర్యపోయే విధంగా పెంచుకుంటూ వెళ్తున్నారు. సంగీత దర్శకుఉ జీవి ప్రకాష్ ఇప్పుడు తన స్పీడ్‌ వల్ల వార్తల్లో నిలిచాడు.

19 ఏళ్ల వయసు లో సంగీత దర్శకుడిగా ఎంట్రీ ఇచ్చి కేవలం ఇరువై ఏళ్ల వయసు లో సూపర్ స్టార్‌ సినిమాకు సంగీతాన్ని అందించే అవకాశం ను దక్కించుకున్నాడు. జీవి ప్రకాష్‌ వయసు 36 ఏళ్లు అయినా కూడా ఇప్పుడు ఆయన సినిమాల సంఖ్య వందకు చేరింది. ఒక వైపు హీరోగా నటిస్తూనే మరో వైపు ఇలా సంగీత దర్శకుడిగా అరుదైన మైలు రాయి చేరుకోవడం కేవలం ఈయనకే చెల్లింది.

తమిళ స్టార్‌ హీరో సూర్య హీరోగా సుధ కొంగర దర్శకత్వంలో రూపొందబోతున్న ప్రతిష్టాత్మక మూవీకి జీవి ప్రకాష్ సంగీతాన్ని అందించబోతున్నాడు. ఈ విషయాన్ని స్వయంగా సూర్య ప్రకటించడంతో పాటు, ఈ సినిమా అతడికి వందవ సినిమా ఆనందించదగ్గ విషయం అన్నట్లుగా కూడా సూర్య తన పోస్ట్ లో పేర్కోన్నాడు.

ఇండస్ట్రీ లో అడుగు పెట్టడం ఈజీనే అయినా కూడా ఇలాంటి రికార్డులు సాధించాలి అంటే.. ఇలాంటి సెంచరీలు నమోదు చేయాలి అంటే కచ్చితంగా ప్రతిభావంతుడు అయ్యి ఉండాలి. జీవి ప్రకాష్‌ ఆ కోవకు చెందిన వ్యక్తి అనడం లో సందేహం లేదు. అందుకే ఆయన్ను ఇప్పుడు అభిమానులు ఇండస్ట్రీ వర్గాల వారు అంతా కూడా ఆడు మగాడ్రా బుజ్జీ అన్నట్లుగా కామెంట్స్ చేస్తున్నారు.

Tags:    

Similar News