సౌత్‌ దర్శకుడితో బాలీవుడ్‌ స్టార్‌ ఫిల్మ్‌ మేకర్‌ బిగ్‌ ప్లాన్..!

తమిళ దర్శకులు అట్లీ, మురుగదాస్‌, తెలుగు దర్శకులు సందీప్‌ వంగ, గోపీచంద్‌ మలినేని, క్రిష్ ఇంకా పలువురు దర్శకులు బాలీవుడ్‌లో మంచి పేరు తెచ్చుకున్నారు

Update: 2025-02-26 23:30 GMT

సౌత్‌ సినిమాలకు, సౌత్‌ ఫిల్మ్‌ మేకర్స్‌కి బాలీవుడ్‌లో మంచి డిమాండ్‌ ఉంది. తమిళ దర్శకులు అట్లీ, మురుగదాస్‌, తెలుగు దర్శకులు సందీప్‌ వంగ, గోపీచంద్‌ మలినేని, క్రిష్ ఇంకా పలువురు దర్శకులు బాలీవుడ్‌లో మంచి పేరు తెచ్చుకున్నారు. అంతే కాకుండా బాలీవుడ్‌లో ప్రస్తుతం పలువురు సౌత్ ఫిల్మ్‌ మేకర్స్ సినిమాలు చేస్తున్నారు. బాలీవుడ్‌ స్టార్‌ హీరోల్లో పలువురు సౌత్ దర్శకులతో సినిమాలు చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. ఇప్పటికే సౌత్ దర్శకులు ఎంతో మంది బాలీవుడ్‌లో జెండా పాతేందుకు ప్రయత్నాలు చేస్తుండగా మలయాళ దర్శకుడు హనీఫ్‌కి మంచి ఛాన్స్ దక్కింది. ఇతడితో కరణ్ జోహార్‌ సినిమాకి ప్లాన్‌ చేస్తున్నాడు.

మలయాళంలో ఉన్ని ముకుందన్‌ హీరోగా హనీఫ్‌ దర్శకత్వంలో వచ్చిన 'మార్కో' సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు రాబట్టింది. హిందీలోనూ మార్కో సినిమాకు మంచి వసూళ్లు నమోదు అయ్యాయి. దాంతో హనీఫ్‌కి బాలీవుడ్‌ నుంచి పిలుపు వచ్చింది. ప్రముఖ యంగ్‌ హీరోతో సినిమా ఓకే అయిందనే వార్తలు వస్తున్నాయి. బాలీవుడ్‌ స్టార్‌ ఫిల్మ్‌ మేకర్ కరణ్‌ జోహార్‌ బ్యానర్‌లో హనీఫ్‌ మొదటి హిందీ సినిమా రూపొందబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. బాలీవుడ్ బాక్సాఫీస్‌ వద్ద 'మార్కో' వంటి సినిమాలకు మంచి డిమాండ్ ఉంది. ముఖ్యంగా యాక్షన్‌ సినిమాలకు అక్కడ డిమాండ్ బాగుంది. అందుకే హనీఫ్‌తో భారీ యాక్షన్ సినిమాను నిర్మించాలని కరణ్‌ జోహార్ భావిస్తున్నాడట.

మలయాళ సినిమా ఇండస్ట్రీలో ఇప్పటివరకు ఫ్యామిలీ సినిమాలు మాత్రమే వంద కోట్లు, అంతకు మించి వసూళ్లు రాబట్టాయి. కానీ మొదటి సారి 'ఎ' సర్టిఫికెట్‌ దక్కించుకున్న మలయాళ సినిమా బాక్సాఫీస్ వద్ద రూ.100 కోట్లకు మించి వసూళ్లు రాబట్టింది. దాంతో దర్శకుడు హనీఫ్‌ గురించి ప్రముఖంగా చర్చ జరిగింది. అతడి గురించి ఎంక్వయిరీ చేస్తున్న వారు చాలా మంది పెరిగారు. మలయాళంలో యాక్షన్‌ సినిమాలకు కాస్త డిమాండ్‌ తక్కువ ఉంటుంది. అందుకే తదుపరి సినిమాను బాలీవుడ్‌లో చేయాలని ఈ దర్శకుడు భావిస్తున్నట్లు సమాచారం అందుతోంది. అందుకే బాలీవుడ్‌లో కథలు చెప్పాడట.

సాధారణంగా వంద కోట్ల సినిమా తర్వాత దర్శకుడి డిమాండ్‌ బాగా పెరుగుతుంది. అందుకు తగ్గట్లుగానే కరణ్ జోహార్‌ భారీ పారితోషికం ఇచ్చి మరీ ఈ దర్శకుడితో సినిమాను చేసేందుకు రెడీ అయ్యారని తెలుస్తోంది. హిందీలో రూపొందబోతున్న ఈ సినిమాను మలయాళంతో పాటు, ఇతర సౌత్ ఇండియన్‌ భాషల్లోనూ డబ్‌ చేసే విధంగా కంటెంట్ ఉంటుంది అంటూ వార్తలు వస్తున్నాయి. ఒకటి రెండు వారాల్లో సినిమా అధికారిక ప్రకటన వచ్చే అవకాశాలు ఉన్నాయి. హీరో ఎవరు అనే విషయంలో క్లారిటీ రావడానికి కాస్త సమయం పట్టే అవకాశాలు ఉన్నాయి. వచ్చే ఏడాదిలో ఈ కాంబో మూవీ ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశాలు ఉన్నాయి.

Tags:    

Similar News