అమ్మపై విమర్శలు నా హృదయాన్ని విచ్చిన్నం చేశాయి

చిన్న వయసులోనే హీరోయిన్ గా దేశ ముదురు సినిమాలో నటించి అందంతో పాటు అభినయంతో మెప్పించిన ముద్దుగుమ్మ హన్సిక మోత్వానీ

Update: 2023-12-08 06:03 GMT

చిన్న వయసులోనే హీరోయిన్ గా దేశ ముదురు సినిమాలో నటించి అందంతో పాటు అభినయంతో మెప్పించిన ముద్దుగుమ్మ హన్సిక మోత్వానీ. ఈ అమ్మడు సుదీర్ఘ కాలంగా ఇండస్ట్రీ లో కొనసాగుతూ స్టార్‌ డమ్‌ దక్కించుకుంది. ఈ మధ్య కాలంలో టాలీవుడ్‌ కంటే కోలీవుడ్‌ లో ఎక్కువగా సందడి చేస్తోంది.

కోలీవుడ్‌ లో లేడీ ఓరియంటెడ్‌ సినిమాలకు మోస్ట్‌ వాంటెడ్‌ హీరోయిన్ గా నిలిచిన ముద్దుగుమ్మ హన్సిక చేతిలో మంచి ఆఫర్లు ఉన్న సమయంలోనే పెళ్లి చేసుకుని కొత్త జీవితంను మొదలు పెట్టింది. సాధారణంగా సౌత్‌ సినీ ఇండస్ట్రీలో పెళ్లి అయిన హీరోయిన్స్ కి ఆఫర్లు తగ్గుతాయి. కాని హన్సిక పెళ్లి అయిన తర్వాత కూడా బిజీగానే ఉంది.

ఇటీవలే తన భర్త తో కలిసి మొదటి వివాహ వార్షికోత్సవం జరుపుకున్న ముద్దుగుమ్మ హన్సిక ఒక ఇంటర్వ్యూలో గతంలో తనపై. మరియు తన తల్లిపై వచ్చిన విమర్శలపై స్పందించింది. స్కిన్‌ స్పెషలిస్ట్‌ అయిన హన్సిక తల్లి పై అప్పట్లో మీడియాలో అనేక ఆరోపణలు, విమర్శలు వచ్చేవి.

ముఖ్యంగా హన్సిక చిన్న వయసులోనే పెద్దగా కనిపించేందుకు ఆమె తల్లి హార్మోన్‌ లకు సంబంధించిన ఇంజక్షన్‌ ఇచ్చిందనే ఆరోపణలు ఎదుర్కొంది. ఆ విషయమై హన్సిక గతంలో పలు సార్లు స్పందించింది. ఆ విమర్శలు నా హృదయాన్ని విచ్చిన్నం చేశాయని, అమ్మను విమర్శిస్తూ ఉంటే తట్టుకోలేక పోయేదాన్ని అంటూ హన్సిక పేర్కొంది.

చిన్న వయసులో పెద్ద అమ్మాయిలుగా కనిపించేందుకు కొందరు హర్మోన్‌ ఇంజక్షన్‌ లు ఇవ్వడం జరుగుతుంది. హన్సిక కి కూడా అలాంటి ఇంజక్షన్స్‌ ను స్వయంగా తల్లి ఇచ్చింది అంటూ అప్పట్లో చాలా మంది కామెంట్స్‌ చేశారు. కానీ ఏ తల్లి కూడా తన కూతురుకు సినిమాల ఆఫర్ల కోసం అలాంటి పని చేయదు. సినిమా ఇండస్ట్రీలో ఉన్న వారిపై కొందరు ఇలాంటి విమర్శలు చేయడం సర్వసాధారణ విషయం.

Tags:    

Similar News