హనుమాన్ బజ్ బాగుంది కానీ..!

ప్రశాంత్ వర్మ డైరెక్షన్ లో తెరకెక్కిన హనుమాన్ సినిమా సంక్రాంతికి రిలీజ్ లాక్ చేశారు

Update: 2024-01-02 16:30 GMT

పరిశ్రమ బాగుండాలి అంటే స్టార్ సినిమాలు మాత్రమే ఆడితే సరిపోదు చిన్న సినిమాలు కూడా మంచి విజయాలను అందుకోవాలి. ఏడాదికి పదుల సంఖ్యలో రిలీజ్ అయ్యే స్టార్ సినిమాల కన్నా వందల సంఖ్యల్లో రిలీజైన చిన్న సినిమాలు ఆడితేనే పరిశ్రమకు ఎంతో మేలు జరుగుతుంది. అయితే ఫెస్టివల్ టైం వస్తే కేవలం స్టార్ సినిమాలే రావాలి.. వారికే థియేటర్లు కేటాయించాలన్న పంథా కొనసాగుతుంది. అయితే సినిమా పరిశ్రమ అందరిది ఇక్కడ అన్ని సినిమాలు ఆడాలి. ఫెస్టివల్ టైం లో చిన్న సినిమాలకు కూడా థియేటర్లు కేటాయించాలి. ఇంతకుముందు ఏమో కానీ ఈ సంక్రాంతికి ఈ ప్రయత్నం బాగా జరుగుతుంది.

ప్రశాంత్ వర్మ డైరెక్షన్ లో తెరకెక్కిన హనుమాన్ సినిమా సంక్రాంతికి రిలీజ్ లాక్ చేశారు. ఈ సినిమాను పొంగల్ రిలీజ్ ఆపడానికి చాలా ప్రయత్నాలు జరుగుతున్నాయి. కానీ ఎలాగైనా సరే సినిమా రిలీజ్ చేయాలని చూస్తున్నారు మేకర్స్. ఆల్రెడీ సంక్రాంతికి వచ్చే సినిమాలన్నీ హనుమాన్ ని ఆపాలని ప్రయత్నించి విఫలమయ్యాయి. హనుమాన్ సినిమా విజువల్ వండర్ గా రాబోతుంది. తను ఎంచుకున్న కథ.. ఇచ్చిన బడ్జెట్ తో ప్రశాంత్ వర్మ బెస్ట్ అవుట్ పుట్ ఇచ్చాడు.

అయితే సినిమా సంక్రాంతికి వస్తున్న కారణంగా థియేటర్ల సంఖ్య చాలా తక్కువ ఉంది. హనుమాన్ కి అది మైనస్ అని చెప్పొచ్చు. ఇక మరోపక్క స్టార్ సినిమాలకు అభిమానులు చూపించే ఉత్సాహం తెలిసిందే. ఆ టైం లో హనుమాన్ ని పట్టించుకుంటారా లేదా అన్నది కూడా తెలియాల్సి ఉంది. స్టార్ సినిమాల మధ్య భీకరమైన పోటీ మధ్య హనుమాన్ రావడం పెద్ద రిస్కే అయినా ఇప్పటివరకు తమని నడిపించిన ఆ హనుమాన్ ఈ సినిమాకు తోడుగా ఉంటారని చెబుతున్నారు మేకర్స్.

హనుమాన్ సినిమాలో తేజ సజ్జ లీడ్ రోల్ లో నటించగా అమృత అయ్యర్ ఫిమేల్ లీడ్ గా నటించింది. ఇండియన్ సూపర్ హీరో మూవీగా ప్రమోట్ చేస్తున్న హనుమాన్ సినిమా ట్రైలర్ ఇంప్రెసివ్ గా అనిపించగా సినిమాకు ఆడియన్స్ నుంచి మంచి బజ్ అయితే వచ్చింది. మరి అందుకు తగినట్టుగా సినిమా ఫలితం ఉంటుందా లేదా అన్నది చూడాలి. ఓ పక్క పెద్ద సినిమాలు గుంటూరు కారం, సైంధవ్, నా సామిరంగ, ఈగల్ సినిమాలు పోటీకి వస్తుండగా వీటికి పోటీగా హనుమాన్ ఎలాంటి రిజల్ట్ అందుకుంటుందో చూడాలి.

Tags:    

Similar News