హనుమాన్.. హైప్ పెంచేందుకు అదే బెస్ట్ టైమ్
ఈ రోజుల్లో భాషతో సంబంధం లేకుండా కొన్ని సినిమాలు అందుకుంటున్న ఫలితాలు మాత్రం అందరిని ఆశ్చర్యపరుస్తున్నాయి.
ఈ రోజుల్లో భాషతో సంబంధం లేకుండా కొన్ని సినిమాలు అందుకుంటున్న ఫలితాలు మాత్రం అందరిని ఆశ్చర్యపరుస్తున్నాయి. దేశంలో జరుగుతున్న కొన్ని మార్పులు కూడా సినిమాల ఫలితాలపై ఆధారపడి ఉన్నాయి అంటే ఆశ్చర్య పోవాల్సిన అవసరం లేదు. ఎప్పటికప్పుడు పరిస్థితులకు తగ్గట్టుగా కూడా సినిమా మేకర్స్ వారి కంటెంట్ మార్చుకుంటూ వెళ్తున్నారు.
సినిమా ప్రమోషన్స్ కోసం కొన్ని పరిస్థితులు కూడా వారికి కలిసి వస్తున్నాయి. ఇక రాబోయే హనుమాన్ సినిమాకు కూడా ఒక హిందుత్వ అంశం బాగా కలిసి వచ్చే ఛాన్స్ ఉంది. అది ఏ మాత్రం క్లిక్ అయినా కూడా కార్తికేయ 2 రేజ్ లో ఈ సినిమా కూడా నార్త్ ఇండస్ట్రీలో ఒక ఊపు ఉపేయగలదు. అని చెప్పవచ్చు కలెక్షన్ కూడా ఊహించని రేంజ్ లో వచ్చే అవకాశం ఉంటుంది.
ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో రూపొందిన హనుమాన్ సినిమాలో తేజ సజ్జా హీరోగా నటించాడు. నిజానికి ఈ సినిమాలో పాన్ ఇండియా రేంజ్ కు తగ్గట్టుగా పెద్దగా క్యాస్ట్ అయితే ఏమీ లేదు. కేవలం టైటిల్ తోనే సినిమా కంటెంట్ పై అంచనాలు పెంచారు. ఇప్పటికి విడుదలైన ఒక టీజర్ కూడా బాగా ఆకట్టుకుంది. ఇక సంక్రాంతిలో పోటీ గట్టిగానే ఉన్నప్పటికీ కూడా అదే సమయానికి వస్తున్నాము అని చిత్ర యూనిట్ సభ్యులు చాలా బలంగా చెబుతున్నారు.
అయితే అంత పోటీలో కూడా ఈ సినిమాతో ఎందుకు రిస్క్ చేస్తున్నారు అనే ఆలోచన రాకుండా ఉండదు. అయితే దీని వెనుక బలమైన కారణం ఉంది. అదే అయోధ్య రామ మందిరం ప్రారంభం. ఎన్నో వివాదాలు తర్వాత అయోధ్యలో రామ మందిరం నిర్మాణం రూపుదిద్దుకుంటున్న విషయం తెలిసిందే. ఇక 2024 జనవరి 24న రామ మందిరం ప్రారంభించాల్సి ఉంది.
అయితే హనుమాన్ సినిమా 2024 జనవరి 12న విడుదల కానుంది. అంటే జనవరి నెలలో కూడా అయోధ్య రామమందిరానికి సంబంధించిన అంశాలు మాత్రం గట్టిగా వైరల్ అవుతాయి. ఇక ఆ టైమ్ లో హనుమాన్ ట్యాగ్ ట్రెండ్ తో చిత్ర యూనిట్ సభ్యులు చేసే ప్రమోషన్ అందులో క్లిక్ అయితే హైప్ వేరే లెవెల్లో ఉంటుంది. కాబట్టి కేవలం తెలుగులోనే కాకుండా నార్త్ ఇండస్ట్రీలో కూడా మంచి హైప్ వచ్చే అవకాశం ఉంది. కానీ ఆదిపురుష్ తరహాలో కాకుండా హనుమాన్ నిరాశ పరచకుండా మంచి కంటెంట్ ఇస్తే బాక్సాఫీస్ వద్ద జోరుగా కలెక్షన్స్ అందుకోవచ్చు.