హనుమాన్ రూ.5 స్ట్రాటజీ.. క్లిక్కయితే..

సినిమాని మార్కెట్ చేసుకోవడానికి దర్శక, నిర్మాతలు ఎవరి సరికొత్త ఆలోచనలతో జనాల్లోకి వెళ్తారు.

Update: 2024-01-08 10:33 GMT

సినిమాని మార్కెట్ చేసుకోవడానికి దర్శక, నిర్మాతలు ఎవరి సరికొత్త ఆలోచనలతో జనాల్లోకి వెళ్తారు. ఆడియన్స్ ని థియేటర్స్ వద్దకి రప్పించడానికి కొంతమంది బై వన్ గెట్ వన్ టికెట్స్ ఆఫర్ పెడతారు. కొంతమంది కంటెంట్ ని ట్రైలర్, సాంగ్ ద్వారా వీలైనంతగా జనాల్లోకి పంపించే ప్రయత్నం చేస్తారు. అయితే కంటెంట్ ని ఆడియన్స్ కి కనెక్ట్ చేయడానికి కొంతమంది ట్రెండింగ్ విషయాలని కూడా వాడుకుంటారు.

తెలంగాణ ఎన్నికల సమయంలో నాని ఒక పొలిటికల్ లీడర్ తరహాలో ప్రెస్ మీట్ పెట్టాడు. ఇది బాగా వైరల్ అయ్యింది. అలాగే ఆదిపురుష్ సినిమాకి హనుమాన్ కోసం ఒక షీట్ ఖాళీగా ఉంచుతామని చెప్పి న్యూస్ వైరల్ చేశారు. ఇది కొద్దిరోజులు బాగానే పనిచేసి సినిమాకి మంచి ఓపెనింగ్స్ వచ్చాయి. ఇప్పుడు హనుమాన్ సినిమా విషయంలో అలాంటి ఇంటరెస్టింగ్ స్ట్రాటజీని ప్రశాంత్ వర్మ ఎనౌన్స్ చేశాడు.

హనుమాన్ సినిమా థియేటర్స్ లో రిలీజ్ అయిన తర్వాత టికెట్ పై వచ్చే ప్రతి ఐదు రూపాయిలు అయోధ్య రామమందిరానికి విరాళంగా ఇస్తామని చిత్ర యూనిట్ ప్రకటించింది. త్వరలో అయోధ్య రామమందిరం ప్రారంభోత్సవం జరగబోతోంది. ఇప్పటికే దేశవ్యాప్తంగా ప్రముఖులకి ఆహ్వానాలు అందిస్తున్నారు. మూలవిరాట్టు కూడా సిద్ధం అయిపొయింది.

జనవరి 22న దేశవ్యాప్తంగా దీపావళి జరుపుకోవాలని ఇప్పటికే ప్రధాని పిలుపునిచ్చారు. ఇలాంటి సమయంలో దేశం యావత్తు అయోధ్య రామమందిరంతో ఎమోషనల్ గా కనెక్ట్ అయ్యి ఉంది. మీడియాలో ఇదే ట్రెండింగ్ నడుస్తోంది. ఇప్పుడు హనుమాన్ సినిమా ద్వారా వచ్చే రెవెన్యూలో రామమందిరానికి విరాళం అనేసరికి హిందుత్వ భావజాలం ఉన్న ప్రతి ఒక్కరు కనెక్ట్ అయ్యి సినిమాకి వెళ్తారు. కానీ కంటెంట్ మినిమం కనెక్ట్ అయ్యేలా ఉండాలి. కాస్త యావరేజ్ టాక్ వచ్చినా సెంటిమెంట్ బలంగా కొనసాగుతుంది.

ముఖ్యంగా నార్త్ ఇండియాలో ఈ స్ట్రాటజీ జనాల్లోకి వెళ్తే కలెక్షన్స్ పెరగడం గ్యారెంటీ అనే మాట వినిపిస్తోంది. కంటెంట్ మీద ఎలాగూ నమ్మకం ఉండటంతో ఈ స్ట్రాటజీ కారణంగా ఆడియన్స్ కి మరింత బెటర్ గా రీచ్ చేసినట్లు అవుతుందనే నమ్మకంతో చిత్ర యూనిట్ 5 రూపాయిల కాన్సెప్ట్ ని ఎనౌన్స్ చేసినట్లు తెలుస్తోంది.

Tags:    

Similar News