రామమందిరానికి హనుమాన్ విరాళం..!
జనవరి 12న రిలీజ్ అవుతున్న ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ఆదివారం జరిగింది.
తేజా సజ్జా లీడ్ రోల్ లో ప్రశాంత్ వర్మ డైరెక్షన్ లో వస్తున్న సినిమా హనుమాన్. సంక్రాంతికి స్టార్ సినిమాలకు పోటీగా ఈ సినిమా వస్తుంది. జనవరి 12న రిలీజ్ అవుతున్న ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ఆదివారం జరిగింది. ఈ ఈవెంట్ కి మెగాస్టార్ చిరంజీవి గెస్ట్ గా వచ్చారు. హనుమాన్ ఈవెంట్ లో చిరంజీవి స్పీచ్ హైలెట్ గా నిలిచింది.
ఈవెంట్ లో చిరంజీవి మాట్లాడుతూ.. హనుమాన్ ఈవెంట్ కి రావడానికి నాలుగు కారణాలు అని అన్నారు. అందులో ఒకటి ఆరాధ్య దైవం అమ్మానాన్నల తర్వాత తను ప్రార్ధించే హనుమాన్ ని సెంట్రిక్ గా తీసుకుని చేసిన సినిమా అవ్వడం.. డైపర్ లు వేసుకున్న స్థాయి నుంచి డయాస్ మీద స్పీచ్ ఇచ్చే స్థాయికి వచ్చిన తేజా సజ్జా మరో రీజన్. ఈమధ్య ఎక్కడ విన్నా హనుమాన్ కి సంబంధించిన న్యూస్ వింటున్నా.. అందులోని వి.ఎఫ్.ఎక్స్, గ్రాఫిక్స్, సౌండింగ్ గురించి అడిగి తెలుసుకున్నాను.. ఈ వేడుకకు రావడం ప్రశాంత్ వర్మ కూడా మరో కారణమని అన్నారు.
కొద్దిరోజుల క్రితం తేజా సజ్జా, ప్రశాంత్ వర్మ వచ్చి సినిమా ఈవెంట్ కి ముఖ్య అతిథిగా రావాలని అడిగితే కచ్చితంగా వస్తానని చెప్పాను. నా ఆరాధ్య దైవం గురించి తను మాట్లాడే సందర్భం ఎప్పుడు రాలేదు. ఎక్కడ చెప్పుకోలేదు. కానీ ఒక్కోసారి మనలోని భక్తి చెప్పుకోవాలని అనిపిస్తుంది. తను చిన్నప్పటి నుంచి ఆంజనేయ స్వామిని తలచుకుంటూ ఒక నిబద్ధతతో లక్ష్యంతోటి ఈ స్థాయికి వచ్చానంటే అలాంటి స్వామి గురించి సినిమా తీసిన ఈ స్టేజ్ మీద ఆయనతో ఉన్న అనుబంధం చెప్పుకోవాలని అనుకుంటునానని అన్నారు.
మనం ఆయనకు సరెండర్ అయితే ఆయన ఎంత స్పూర్తి దాయకంగా ఉంటుందని హనుమాన్ ని చిన్నప్పటి నుంచి నమ్ముకుంటున్న తనకు తెలుసని అన్నారు. మా ఇంట్లో దైవ భక్తులు లేరు.. నాన్న కమ్యునిస్ట్.. కానీ ఆయన ట్రాన్స్ ఫర్ విషయంలో ఒకసారి ఇబ్బంది పడుతుంటే.. హనుమాన్ ఆయన ట్రాన్స్ ఫర్ ని ఆయన అనుకున్న చోటికి వచ్చేలా చేశారు. అప్పటి నుంచి నాతో పాటు నాన్న కూడా హనుమాన్ భక్తుడిగా మారారు.
తన జీవితంలో చాలాసార్లు హనుమాన్ తనకు తోడుగా ఉన్నారు. లాటరీలో హనుమంతుడు క్యాలెండర్ రావడం దగ్గర నుంచి చెన్నైలో ఫిల్మ్ ఇన్ స్టూట్ లో చేరే వరకు తనకు హనుమాన్ అండగా ఉన్నాడని చెప్పుకొచ్చారు చిరంజీవి.
హనుమంతుడు వెంట నేను పడ్డానో.. లేదా ఆయన నా వెంట పడ్డారో కానీ ఆయన నా జీవితంలో ఒక భాగస్వామ్యం అయ్యారని అన్నారు చిరంజీవి.
డిగ్రీ అయ్యాక నెక్స్ట్ ఏం చేయాలో అని అనుకుంటున్న టైం లో చెన్నై వెళ్లి ఫిల్మ్ ఇన్ స్టూట్ లో చేరాను. ఒక టైం లో తన పెరట్లో హనుమంతుడు బొమ్మ కనిపించింది. ఆ బొమ్మని లాకెట్ చేసి తన మెడలో వేశారు. 19878, 79 నుంచి సినిమా అవకాశాలు వచ్చేలా చేశాయి. నాకు ఇండస్ట్రీలో తిరిగులేదని అనుకునేలా చేశారు.
నేను చేసిన అప్పటి సినిమాల్లో హనుమాన్ లాకెట్ ఉండేది. 2000 లో అన్నయ్య సినిమా చేస్తుండగా అది మిస్ అయ్యింది. అయితే ఆ టైం లో తనకు అర్థమైంది. హనుమాన్ మనలో ఉన్నాడు ఆయన నాతో ఉన్నాడు.. నాలో ఉన్నాడని అర్థమైంది.
హనుమాన్ థియేటర్ల సర్దుబాట్లు గురించి ప్రస్తావించిన చిరంజీవి ఈ సీజన్ లో చాలా సినిమాలు వస్తున్నాయి కాబట్టి అన్ని సినిమాలు బాగా ఆడాలని అన్నారు. కంటెంట్ బాగుంటే ఒకరోజు లేట్ అయినా సినిమాను చూస్తారని అన్నారు.
ఇక ఇదే వేడుక మీద అయోధ్య రామమందిరానికి హనుమాన్ ప్రతి టికెట్ నుంచి 5 రూపాయలు విరాళంగా ప్రకటించారు చిరంజీవి. ఈ అద్భుతమైన కార్యానికి నడుం బిగించిన ఈ చిత్ర యూనిట్ కి అంతా మంచి జరుగుతుందని సినిమా తప్పకుండా విజయం సాధిస్తుందని అన్నారు.