హిందీలో 50కోట్ల క్లబ్‌తో 'హనుమాన్' సంచలనం

ఆయ‌న హ‌నుమాన్ ఘ‌న‌విజ‌యాన్ని ప్ర‌శంసిస్తూ.. రాబోయే వారంలో రూ.50 కోట్ల మార్కును అందుకుంటుంద‌ని తెలిపారు.

Update: 2024-02-02 07:18 GMT

తేజ స‌జ్జా ప్ర‌ధాన పాత్ర‌లో ప్ర‌శాంత్ వ‌ర్మ తెర‌కెక్కించిన హ‌నుమాన్ సంక్రాంతి బ‌రిలో విడుదలై సంచ‌ల‌న విజ‌యం సాధించిన సంగ‌తి తెలిసిందే. ఈ సినిమా తెలుగు-త‌మిళం స‌హా హిందీలోను అత్యంత భారీగా విడుద‌లైంది. ఇప్ప‌టికే దాదాపు 300 కోట్లు వ‌సూలు చేసిన ఈ చిత్రం మూడో వారంలోను వ‌సూళ్ల హ‌వా సాగిస్తోంది. ఆ మేర‌కు ప్ర‌ఖ్యాత హిందీ క్రిటిక్ త‌ర‌ణ్ ఆద‌ర్శ్ త‌న ట్వీట్ లో వివ‌రాలు అందించారు.

ఆయ‌న హ‌నుమాన్ ఘ‌న‌విజ‌యాన్ని ప్ర‌శంసిస్తూ.. రాబోయే వారంలో రూ.50 కోట్ల మార్కును అందుకుంటుంద‌ని తెలిపారు. ఇది అద్భుతం అని ప్ర‌శంసించారు. హ‌నుమాన్ 3వ వారం... శుక్ర 1.85 కోట్లు, శని 1.40 కోట్లు, ఆది 1.60 కోట్లు, సోమవారం 36 లక్షలు, మంగళవారం 41 లక్షలు, బుధవారం 42 లక్షలు, గురువారం 43 లక్షలు వ‌సూలు చేసింది. హిందీ వెర్ష‌న్ మొత్తం 46.06 కోట్లు వ‌సూలైంది అని తెలిపారు.

కేవ‌లం 30 కోట్ల బడ్జెట్‌తో తెర‌కెక్కిన‌ హనుమాన్ ప్ర‌పంచ‌వ్యాప్తంగా 300 కోట్ల గ్రాస్‌ను అధిగ‌మించ‌బోతోంది. 100 శాతం రాబడులు అందించిన హిస్టారికల్ బ్లాక్ బస్టర్ చిత్ర‌మిద‌ని ట్రేడ్ నిపుణులు ప్ర‌శంసిస్తున్నారు. హ‌నుమాన్ శాటిలైట్, డిజిట‌ల్ స‌హా అన్నివిధాలా మంచి మార్కెట్ చేసిన చిత్రంగా నిలిచింది. పోటీబ‌రిలో హృతిక్ రోష‌న్ ఫైట‌ర్ చిత్రం విడుద‌లైనా హ‌నుమాన్ వ‌సూళ్ల‌లో హ‌వా సాగించ‌డం ఆస‌క్తిని క‌లిగించింది. త‌దుప‌రి ప్ర‌శాంత్ వ‌ర్మ హ‌నుమాన్ కి సీక్వెల్ క‌థ‌తో `జై హనుమాన్`ని తెర‌కెక్కిస్తున్న సంగ‌తి తెలిసిందే. ఈ సీక్వెల్ పై భారీ బ‌జ్ నెల‌కొంది. ఇందులో బాలీవుడ్ స్టార్ హీరో ర‌ణ‌వీర్ సింగ్ కీల‌క పాత్ర‌లో న‌టించే అవ‌కాశం ఉంద‌ని క‌థ‌నాలొచ్చాయి.


Tags:    

Similar News