హనుమాన్.. ఇక అసలైన ఆయుధం రెడీ

యువ దర్శకుడు ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో ఒకప్పటి చైల్డ్ ఆర్టిస్ట్ తేజ సజ్జ హీరోగా నటిస్తున్న ఈ సినిమా మొదటి భారతీయ అసలైన సూపర్ హీరో చిత్రంగా రాబోతోంది.

Update: 2023-12-12 11:18 GMT

2024 సంక్రాంతి కి పోటీ పడుతున్న సినిమాలలో హనుమాన్ ఒకటి. యువ దర్శకుడు ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో ఒకప్పటి చైల్డ్ ఆర్టిస్ట్ తేజ సజ్జ హీరోగా నటిస్తున్న ఈ సినిమా మొదటి భారతీయ అసలైన సూపర్ హీరో చిత్రంగా రాబోతోంది. ఇది ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ యొక్క మొదటి భాగం. ఇప్పటికే వైరల్‌గా మారిన టీజర్‌తో సినిమాకు మంచి క్రేజ్ ఏర్పడింది.


ఇక మేకర్స్ ఇప్పటివరకు విడుదల చేసిన మూడు పాటలకు అద్భుతమైన స్పందన వచ్చింది. అలాగే సినిమాలో గ్రాఫిక్స్ కూడా ఎట్రాక్ట్ చేసే విధంగా ఉంటాయి అని కొన్ని షాట్స్ తోనే చెప్పేశారు. ఇక ఈ మోస్ట్ ఎవైటెడ్ సినిమా థియేట్రికల్ ట్రైలర్‌కి సంబంధించిన అప్‌డేట్‌పై క్లారిటీ ఇచ్చారు. హను-మాన్ అఫీషియల్ ట్రైలర్‌ను డిసెంబర్ 19న విడుదల చేయనున్నట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు.

అందుకు సంబంధించిన ఒక ప్రత్యేకమైన పోస్టర్ కూడా విడుదల చేశారు. పోస్టర్ లో కథానాయకుడు కళ్ళు మూసుకుని దేవుడిని ప్రార్థిస్తున్నట్లు హైలెట్ చేశారు, అతని వెనుక భారీ హనుమాన్ విగ్రహం ఉంది. ఈ ట్రైలర్ అంజనాద్రి ఫాంటసీ ప్రపంచంలోకి తీసుకు వెళుతుంది అని అని అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అలాగే సంక్రాంతి సినిమాలతో పోటి పడాలి అంటే ఈ సినిమాకు ప్రధానంగా ట్రైలర్ ఒక ఆయుధం అని చెప్పాలి. తప్పకుండా ట్రైలర్ ఆకట్టుకునేలా ఉంటుందని చిత్ర యూనిట్ నమ్మకంతో చెబుతోంది.

ప్రైమ్‌షో ఎంటర్‌టైన్‌మెంట్‌పై కె నిరంజన్ రెడ్డి ప్రతిష్టాత్మకంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా, శ్రీమతి చైతన్య సమర్పిస్తున్నారు. ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్‌గా అస్రిన్ రెడ్డి, లైన్ ప్రొడ్యూసర్‌గా వెంకట్ కుమార్ జెట్టి, అసోసియేట్ ప్రొడ్యూసర్‌గా కుశాల్ రెడ్డి వ్యవహరిస్తున్నారు. ఈ సినిమాకు గౌరహరి, అనుదీప్ దేవ్, కృష్ణ సౌరభ్ త్రయం సంగీతం అందించారు.

ఇక అమృత అయ్యర్ కథానాయికగా నటిస్తుండగా, వినయ్ రాయ్ ప్రతినాయకుడిగా నటిస్తుండగా, వరలక్ష్మి శరత్‌కుమార్ కీలక పాత్రలో కనిపించనున్నారు. HANU-MAN సినిమా 2024 జనవరి 12న తెలుగు, హిందీ, మరాఠీ, తమిళం, కన్నడ, మలయాళం, ఇంగ్లీష్, స్పానిష్, కొరియన్, చైనీస్ మరియు జపనీస్‌తో సహా పలు భారతీయ భాషల్లో పాన్ వరల్డ్‌ రేంజ్ లో విడుదల కానుంది.

Tags:    

Similar News