హరిహర వీరమల్లు.. అసలు క్రిష్ తో కన్ఫ్యూజనేంటి?

అయితే ఇప్పుడు మే 2వ రెండవ తేదీన ఒక అప్డేట్ ఇవ్వబోతున్నట్లు చెబుతున్న నిర్మాణ సంస్థ ఊహించిన విధంగా పోస్టర్లతో అందరికీ షాక్ అయితే ఇచ్చింది.

Update: 2024-05-01 11:55 GMT

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కెరీర్ లోనే మొదటి ఫ్యాన్ ఇండియా మూవీగా పరిహార విరమల్లు సినిమా ఒక సంచలనం క్రియేట్ చేయబోతుంది అని మొదట్లో ఫ్యాన్స్ ఎంతో సంతోషించారు. అందులోనూ క్రిష్ ఆ సినిమాను డైరెక్ట్ చేస్తూ ఉండడంతో అంచనాల స్థాయి మరింత పెరిగింది. ఎందుకంటే అతను ఇంతకుముందు బాలయ్యతో చేసిన గౌతమీపుత్ర శాతకర్ణి సినిమా ఎలాంటి ఫలితాన్ని అందించిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.

జెట్ స్పీడ్ లోనే ఆ సినిమాను పూర్తి చేసిన ఇండస్ట్రీలో అగ్ర దర్శకులను సైతం ఆశ్చర్యపరిచాడు క్రిష్. అలాంటి చారిత్రాత్మక సినిమాను ఆరు నెలల్లో పూర్తి చేయడం అంటే మాటలు కాదు. ఇక వీరమల్లు సినిమా అంత స్పీడ్ ఫా కాకపోయినా ఒక ఏడాదిలో ఫినిష్ చేస్తాడు అని అందరూ అనుకున్నారు. కానీ పలు కారణాల వలన ఆ సినిమా వాయిదా పడుతూ వస్తోంది.

ఒకవైపు పవన్ కళ్యాణ్ రాజకీయాలతో బిజీగా ఉండడం అలాగే స్క్రిప్ట్ విషయంలో కూడా కొంత మార్పులు జరగడంతో చాలాసార్లు సినిమా షూటింగ్ కు బ్రేకులు పడ్డాయి. ఇక ఈ విషయంపై ఇప్పటి వరకు సరైన క్లారిటీ ఇవ్వని నిర్మాత మాత్రం అప్డేట్స్ అయితే గట్టిగా ఇస్తున్నారు. సినిమాపై హైప్ ఏ మాత్రం తగ్గకుండా ఎప్పటికప్పుడు పోస్టర్స్ ద్వారా లేదంటే టీజర్ ద్వారా సినిమా రాబోతున్నట్లు ఒక గుడ్ న్యూస్ అయితే చెబుతూ వస్తున్నాడు.

అయితే ఇప్పుడు మే 2వ రెండవ తేదీన ఒక అప్డేట్ ఇవ్వబోతున్నట్లు చెబుతున్న నిర్మాణ సంస్థ ఊహించిన విధంగా పోస్టర్లతో అందరికీ షాక్ అయితే ఇచ్చింది. ఎందుకంటే ఆ పోస్టర్లలో దర్శకుడు పేరు లేదు. కానీ సోషల్ మీడియాలో మాత్రం క్రిష్ అకౌంట్ తో ట్యాగ్ చేస్తున్నారు. అంతే కాకుండా ప్రమోషన్స్ చేస్తున్న విధానంలో కూడా క్రిష్ పేరు పూర్తిగా కనిపించకుండా అయితే చేయడం లేదు.

పోస్టర్లలో మాత్రమే క్రిష్ పేరు అసలు కనిపించకపోవడం కాస్త కన్ఫ్యూజన్ కి గురిచేస్తుంది. నిజంగానే క్రిష్ ను తీసేసారా లేదంటే కొత్తగా ఏమైనా ప్లాన్ వేసారా అనే కామెంట్స్ కూడా వినిపిస్తున్నాయి. మరొక ఆశ్చర్యకరమైన విషయం ఏమిటి అంటే ఈ సినిమాను క్రిష్ డైరెక్ట్ చేయకపోతే నిర్మాత రత్నం కుమారుడు జ్యోతి కృష్ణ డైరెక్ట్ చేసే అవకాశం ఉన్నట్లుగా మరొక టాక్ వినిపిస్తోంది.

ఆ దర్శకుడు ఇప్పటివరకు సరైన సక్సెస్ అందుకోలేదు. గోపిచంద్ తో తీసిన ఆక్సిజన్ సినిమాతో పాటు రీసెంట్ గా వచ్చిన రూల్స్ రంజాన్ సినిమా కూడా దారుణంగా డిజాస్టర్ అయ్యింది. ఇక ఇప్పుడు పవన్ కళ్యాణ్ చారిత్రాత్మక సినిమా అంటే అతనితో సాధ్యమయ్యే పనేనా? అనే సందహం కలుగుతోంది. లేదంటే నిర్మాత మరొక దర్శకుడుని రంగంలోకి దింపుతాడా అనే విషయం తెలియాలి అంటే మరికొంత కాలం ఆగాల్సిందే.

Tags:    

Similar News