హరి హరపై ఇది నిజమేనా? నమ్మొచ్చా!
పవన్ రాజకీయ వ్యవహారాల్లోనూ బిజీగా ఉన్నారు కాబట్టి రెండు రకాల జర్నీ సాగిస్తున్నారు. ఆయన నుంచి సినిమా గురించి ఎలాంటి అప్ డేట్ ఆశించడం అన్నది తప్పే అవుతుంది.
పవన్ కళ్యాణ్ కథానాయకుడిగా నటిస్తోన్న `హరి హరి హరవీరమల్లు` విషయంలో అసలేం జరుగుతుందో క్లారిటీ లేదు. సినిమా ప్రారంభించి సంవత్సరాలు గడుస్తున్నా! ఒక్క అప్ డేట్ కూడా బయటకు రావడం లేదు. దీంతో సినిమా ఉందా? రద్దయిందా? అనే సందేహాలు సైతం తెరపకి వచ్చాయి. అయినా వాటిపై చిత్ర యూనిట్ నుంచి ఎలాంటి వివరణగానీ..క్లారిటీ గానీ లేదు. ఆ సినిమా తర్వాత పవన్ కమిట్ అయిన సినిమాలు పూర్తిచేసాడు గానీ...వీరమల్లు బ్యాకెండ్లో ఏం జరుగుతుందన్నది ఏనాడు వెల్లడించింది లేదు.
పవన్ రాజకీయ వ్యవహారాల్లోనూ బిజీగా ఉన్నారు కాబట్టి రెండు రకాల జర్నీ సాగిస్తున్నారు. ఆయన నుంచి సినిమా గురించి ఎలాంటి అప్ డేట్ ఆశించడం అన్నది తప్పే అవుతుంది. ఇక చిత్ర నిర్మాతలుగానీ... దర్శకుడు గానీ ఏనాడు మీడియా ముందుకు వచ్చింది లేదు. క్రిష్ ఏకంగా 2024 లో కొత్త ప్రాజెక్ట్ పట్టాలెక్కిం చబోతున్నాడని సైతం ప్రచారం సాగుతోంది. దాన్ని బట్టి చూస్తే వీరమల్లు రద్దయిందని మెజార్టీ వర్గం భావించడానికి ఆస్కారం కనిపిస్తోంది. ఇంతలోనే మరో వార్త తెరపైకి వస్తోంది. ఇందులో వాస్తవం ఎంతోతెలియదు గానీ వీరమల్లుని ఇంకా నిరుత్సాహ పరచడానికైతే ఛాన్స్ కనిపిస్తుందనే చెప్పాలి.
విరమల్లు నిర్మాతల్లో ఒకరైన ఏం.ఎరత్నం తనయుడు జ్యోతికృష్ణ తాజాగా రంగంలోకి దిగినట్లు తెలు స్తోంది. `రూల్స్ రంజన్` సినిమా పనుల్లో బిజీగా ఉండటం వల్ల నాన్న సినిమా వ్యవహారాలు తాను పట్టించుకోలేదని..ఇప్పుడు బడ్జెట్ సహా అన్ని చాలా విషయాల్లో ప్రతికూల సన్నివేశాలు కనిపిస్తున్నట్లు తెరపైకి వస్తోంది. వీరమల్లుకు షూటింగ్ కి సంబంధించి అప్ అండ్ డౌన్స్ ఉన్నట్లు ప్రచారం సాగుతోంది. బడ్జెట్ సహా వివిధ కారణాలతో ప్రాజెక్ట్ ముందుకు కదలడం లేదని..తనయుడు ఈ విషయంలో సీరియస్ గా చర్యలు తీసుకునే దిశగా ముందడుగు వేస్తున్నట్లు వినిపిస్తుంది.
ఇదే నిజమైతే బడ్జెట్ పరంగా పెద్దగా సమస్య ఉండదు. పీకే సినిమా కాబట్టి చాలా మంది నిర్మాతలు ముందుకొస్తారు. ప్రీ రిలీజ్ బిజినెస్ తో డీల్ క్లోజ్ చేసి నిర్మాణాన్ని తాత్కాలికంగా పట్టాలెక్కించవచ్చు. కానీ ఏం చేయాలన్నా? పవన్ కళ్యాణ్ కెమెరా ముందుకు రావాలి. కానీ ప్రస్తుతం పవన్ ఏపీ రాజకీయాల్లో సీరియస్ గా ఉన్నారు. టీడీపీతో పొత్తు పెట్టుకున్న నేపథ్యంలో ఇప్పటికిప్పుడు ఆయన సొంత నిర్ణయాలు కూడా ఎలా పడితే? అలా తీసుకోవడానికి వీలు లేదు. ఎన్నికలయ్యే వరకూ కలిసి ప్రయాణం చేయా ల్సిందే. మరో మూడు నెలల్లో ఎన్నికలు ఉన్నాయి కాబట్టి అప్పటివరకూ పవన్ కూడా ముందకు రాని సన్నివేశమే కనిపిస్తోంది.