మిస్టర్ బచ్చన్ దెబ్బకొట్టినా మెగా ఆఫర్?

టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ హరీష్ శంకర్.. మిస్టర్ బచ్చన్ మూవీతో రీసెంట్ గా ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే.

Update: 2024-09-23 14:30 GMT

టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ హరీష్ శంకర్.. మిస్టర్ బచ్చన్ మూవీతో రీసెంట్ గా ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. బాలీవుడ్ సూపర్ హిట్ మూవీ అజయ్ దేవగన్ రైడ్ కథను తీసుకుని మార్పులు చేర్పులు చేసి.. రవితేజ హీరోగా సినిమాను తెరకెక్కించారు. భారీ అంచనాల మధ్య రిలీజ్ అయిన ఆ మూవీ డిజాస్టర్ గా మారింది. దీంతో చిన్న బ్రేక్ తీసుకున్న ఆయన.. ఇప్పటికే హోల్డ్ లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఉస్తాద్ భగత్ సింగ్ ప్రాజెక్టుతో బిజీగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి.

ఏపీ రాజకీయాల్లో బిజీగా ఉన్న పవన్ కళ్యాణ్.. త్వరలోనే ఉస్తాద్ సెట్స్ లోకి అడుగుపెడతారని కొద్ది రోజులుగా టాక్ వినిపిస్తోంది. అదే సమయంలో రీసెంట్ గా కమర్షియల్ యాడ్ ను చేశారు హరీష్ శంకర్. అందులో మిల్క్ బ్రాండ్ ను ప్రమోట్ చేస్తూ మెగాస్టార్ చిరంజీవి కనిపించారు. యాడ్ భలేగా ఉందని, చిరు అన్నయ్య మూవీ గుర్తొచ్చిందని నెటిజన్లు కామెంట్లు పెట్టారు. హరీష్ శంకర్ వర్క్ పై కూడా అనేక ప్రశంసలు కురిపించారు పలువురు మెగా అభిమానులు.

చిరు, హరీష్ కాంబోలో మూవీ వచ్చినా బాగుంటుందని, బాస్ ను భలేగా చూపించేలా ఉన్నారని అభిప్రాయపడ్డారు. ఇప్పుడు వారి కోరిక తీరనుందని, చిరు- హరీష్ కాంబోలో సినిమా తెరకెక్కనుందని కొన్ని గంటలుగా టాలీవుడ్ వర్గాల్లో జోరుగా ప్రచారం సాగుతోంది. యాడ్ అయ్యాక.. హరీష్ వర్క్ మెచ్చి చిరు ఆఫర్ ఇచ్చారని ప్రచారం జరుగుతోంది. స్టార్ ప్రొడ్యూసర్ డీవీవీ దానయ్య నిర్మించనున్నారని వార్తలు వస్తున్నాయి.

వచ్చే ఏడాది సినిమా షూటింగ్ ప్రారంభం కానుందని, త్వరలోనే అఫీషియల్ అనౌన్స్మెంట్ రానుందని గుసగుసలు వినిపిస్తున్నాయి. డీవీవీ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై గ్రాండ్ గా స్టార్ట్ ప్రొడ్యూసర్ దానయ్య నిర్మించనున్నారని టాక్ వినిపిస్తోంది. ఇప్పటికే ఆయన.. చిరంజీవితో పాటు హరీష్ శంకర్ కు అడ్వాన్స్ పంపేశారని కూడా ఊహాగానాలు చక్కర్లు కొడుతున్నాయి. కానీ ఇవన్నీ రూమర్లేనని తాజాగా తెలుస్తోంది. ఎలాంటి ప్రాజెక్ట్ ఫిక్స్ అవ్వలేదనే టాక్ ఇప్పుడు ఎక్కువగా వినిపిస్తోంది.

అయితే చిరంజీవితో వర్క్ చేయాలనే కోరిక తనకు ఉందని హరీష్ శంకర్.. పలుమార్లు తన మనసులోని మాటను బయట పెట్టారు. చిరు గ్రీన్ సిగ్నల్ ఇస్తే.. రౌడీ అల్లుడు, దొంగ మొగుడు జానర్ లో సినిమా తీస్తానని తెలిపారు. అవుట్ అండ్ అవుట్ కమర్షియల్ మూవీ తెరకెక్కిస్తానని వెల్లడించారు. ఇక హరీష్ శంకర్ యాడ్ చేశాక మెగా ఆఫర్ అందుకున్నాడని వార్తలు రాగా.. ఇప్పుడు అవి తూచ్ అని తెలుస్తోంది. మరి ఫ్యూచర్ లో చిరుతో హరీష్ సినిమా చేస్తారో లేదో వేచి చూడాలి.

Tags:    

Similar News