ఆ డైరెక్టర్ కి నాలుగు నెలలే టైమ్ ఇచ్చాడా?
కానీ ఆయన అనుకున్నట్లు జరగలేదు. పీకే మరింతగా జనాల్లో తిరగాల్సిన ఆవశ్యకత ఏర్పడటంతో? నో మూవీస్ ఓన్లీ పాలిటిక్స్ అంటూ ఏపీలో బిజీ అయ్యారు.
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమా షూటింగ్ లన్నీ బంద్ పెట్టిన సంగతి తెలిసిందే. ఏపీ లో ఎన్నికల సమయం దగ్గరపడటంతో! ఈ నాలుగు నెలలో రాజకీయాలపైనే దృష్టి పెట్టాలని పీకే డిసైడ్ అవ్వడంతో ఎక్కడి షూటింగ్ లు అక్కడ నిలిచిపోయాయి. `ఓజీ`...`ఉస్తాద్ భగత్ సింగ్`..`హరి హర వీరమల్లు` మూడు ఆన్ సెట్స్ లో ఇప్పటికే కొంత భాగం షూటింగ్ పూర్తిచేసిన సంగతి తెలిసిందే. వీరమల్లు ఆలస్యమైనా `ఓజీ` ..`ఉస్తాద్ భగత్ సింగ్` ల్ని మాత్రం పూర్తిచేసి ఎన్నికలకంటే ముందే థియేటర్లోకి తీసుకురావాలని పవన్ సైతం భావించారు.
కానీ ఆయన అనుకున్నట్లు జరగలేదు. పీకే మరింతగా జనాల్లో తిరగాల్సిన ఆవశ్యకత ఏర్పడటంతో? నో మూవీస్ ఓన్లీ పాలిటిక్స్ అంటూ ఏపీలో బిజీ అయ్యారు. దీంతో హరీష్ శంకర్ మాస్ రాజా రవితేజ్ తో కొత్త ప్రాజెక్ట్ ని సెట్ చేసుకున్నాడు. ప్రస్తుతం హరీష్ ఆ సినిమా పనుల్లోనే బిజీగా ఉన్నాడు. ఉస్తాద్ భగత్ సింగ్ నుంచి పూర్తిగా బయటకు వచ్చేసి రవితేజ తో ముందుకెళ్తున్నారు.
అయితే ఈ సినిమా ని హరీష్ మూడు..నాలుగు నెలల్లోనే పూర్తి చేయాల్సి ఉందని తెలుస్తోంది. పవన్ ఎట్టి పరిస్థితుల్లో ఏప్రిల్-మే కల్లా రెడీ అయిపోతారు. అప్పటికీ ఏపీలో ఎన్నికలు పూర్తైపోతాయి. అటుపై పవన్ మళ్లీ బిజీ అయ్యేది సినిమాల్లోనే. అందులోనూ ఉస్తాద్ భగత్ సింగ్..ఓజీ సినిమాలో ముందు పూర్తి చేస్తారు. సైమల్టేనియస్ గా హరి హరి వీరమల్లుని సెట్స్ పైకి తీసుకెళ్తారా? లేదా? అన్నది తర్వాత సంగతి ముందు కమిట్ అయిన రెండు చిత్రాలు పూర్తి చేసి అభిమానుల ముందకు రావాలన్నది ఆయన ప్లాన్ గా కనిపిస్తుంది.
ఈ నేపథ్యంలో హరీష్ ఈ గ్యాప్ లో రవితేజ సినిమా షూటింగ్ పూర్తి చేయాల్సి ఉంటుంది. అంటే ఓ వైపు షూటింగ్ చేస్తూనే మరోవైపు పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా నిర్వహించాలి. అప్పుడే హరీష్ శంకర్ ఫ్రీ అవ్వగలిగేది. మరి ఈ మధ్యలో పవన్ ఇంకేదైనా ప్లాన్ చేస్తే ప్లానింగ్ తారుమారు అవ్వడానికి అవకాశం ఉంటుంది.