మెగా ప్రిన్స్ గట్ ఫీలింగ్‌కి హ్యాట్సాఫ్
ఇప్పుడు అదే బాటలో మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ కూడా హిందీ బెల్ట్ లో అసాధారణ ఫీట్ వేయాలని భావిస్తున్నాడు.
ఇటీవలి కాలంలో టాలీవుడ్ యంగ్ హీరోలు పాన్ ఇండియా మార్కెట్ ని ఛేజిక్కించుకుంటున్నారు. అడివి శేష్, నిఖిల్, తేజ సజ్జా లాంటి యువహీరోలు మంచి కంటెంట్ ఉన్న సినిమాలతో దీనిని సాధించి చూపించారు. వారు నటించిన సినిమాలకు హిందీ బెల్ట్ నుంచి భారీ వసూళ్లు దక్కాయి.
ఇప్పుడు అదే బాటలో మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ కూడా హిందీ బెల్ట్ లో అసాధారణ ఫీట్ వేయాలని భావిస్తున్నాడు. అతడు నటించిన `ఆపరేషన్ వాలెంటైన్` తెలుగు - హిందీలో ద్విభాషా చిత్రంగా విడుదల కానుంది. ఇటు తెలుగులో ప్రమోషన్స్ సహా అటు హిందీ వెర్షన్ ప్రమోషన్స్ విషయంలోను వరుణ్ దూకుడుగా ప్లాన్ చేస్తున్నాడని సమాచారం. `ఆపరేషన్ వాలెంటైన్` మార్చి 1న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈసారి హిందీలో తన ప్రభావం చూపాలని అతడు భావిస్తున్నాడు. ఇటీవల తెలుగు సినిమా హిందీ మార్కెట్ లో వేగంగా ఎదుగుతోంది. దీనిని తాను కూడా కొనసాగించాలని అతడు భావిస్తున్నాడు.
వరుణ్ తేజ్ ప్రయత్నం అభినందించదగినది. గత కొన్నేళ్లుగా వరుణ్ తేజ్ కి సరైన హిట్టు పడలేదు. వెంకీతో కలిసి నటించిన `ఎఫ్ 2` ఫ్రాంఛైజీ సినిమాల విజయం తప్ప సోలోగా సరైన బ్లాక్ బస్టర్ పడలేదు. అందుకే ఇప్పుడు అతడి ప్రయత్నం సఫలం కావాలని ఆకాంక్షిద్దాం. పాన్ ఇండియాలో సక్సెస్ కోసం చేసే ప్రతి ప్రయత్నానికి ప్రోత్సాహం అవసరం. ఆపరేషన్ వాలెంటైన్ కథాంశం ఆసక్తికరం. వైమానిక దళం నేపథ్యంలో హీరోయిజానికి సంబంధించిన కథాంశంతో ఇది రూపొందింది. యూనివర్శల్ అప్పీల్ ఉన్న కంటెంట్ మూవీ. అందువల్ల హిందీలోను ఆడుతుందనే అభిమానులు భావిస్తున్నారు. సినిమాలో కంటెంట్ నచ్చితే భాషతో సంబంధం లేకుండా ఆడుతున్నాయి. అందువల్ల వరుణ్ తేజ్ సినిమాలో క్వాలిటీ కంటెంట్ అతడికి ఆశించిన మంచి విజయాన్ని అందిస్తుందని ఆశిద్దాం.