ఆన్ సెట్స్ లో హీరో రూమ్ కి రమ్మన్నాడు!
ఇన్ స్టా..ఫేస్ బుక్...ట్విటర్ లాంటి మాధ్యమాల్లో కొంతమంది స్వచ్ఛందంగా ముందుకు రాగా..మరికొంత మంది వివిధ ఇంటర్వ్యూలో..వివిధ పరిశ్రమలో ఎదురైన అనుభవాల్ని బట్టబయలు చేసారు.
`#మీటూ ఉద్యమం`లో భాగంగా దేశ వ్యాప్తంగా ఎంత మంది నటీమణులు తెరపైకి వచ్చారో తెలిసిందే. క్యాస్టింగ్ కౌచ్ పేరుతో ఇండస్ట్రీ భాగోతాల్ని బయటపెట్టే ప్రయత్నం చేసారు. సీనియర్ నటీమణుల నుంచి నేటి తరం హీరోయిన్ల వరకూ చాలా మంది తమ అనుభవాల్ని పబ్లిక్ గానే బయట పెట్టారు. ఇన్ స్టా..ఫేస్ బుక్...ట్విటర్ లాంటి మాధ్యమాల్లో కొంతమంది స్వచ్ఛందంగా ముందుకు రాగా..మరికొంత మంది వివిధ ఇంటర్వ్యూలో..వివిధ పరిశ్రమలో ఎదురైన అనుభవాల్ని బట్టబయలు చేసారు.
అప్పటి నుంచి ఎవరో ఒకరు కాస్టింగ్ కౌచ్ గురించి స్పందిస్తూనే ఉన్నారు. తాజాగా తమిళ బిగ్ బాస్ సీజన్ 7 కంటెంస్టెం ట్..సీనియర్ నటి విచిత్ర తనకెదురైన అనుభవాల్ని వివరించారు. షోలో భాగంగా జీవితంలో గుర్తు పెట్టుకున్న టర్నింగ్ పాయింట్ గురించి చెప్పమంటే? తనకెదురైన చేదు అనుభవాన్ని చెప్పుకొచ్చా రు. `20 ఏళ్ల క్రితం ఓ పెద్ద సినిమాలో నటిస్తున్నప్పుడు అందులో హీరో నన్ను గదికి రమ్మని పిలిచాడు.
ఈ విషయాన్ని దర్శకుడి దృష్టికి తీసుకెళ్తే రివర్స్ లో నన్నే తిట్టి పంపాడు. అక్కడ నుంచి అంతా వేధించ డం మొదలు పెట్టారు. నిజాయితీగా ఉంటే ఇంతలా వేధిస్తారా? అని అప్పుడే అర్దమైంది` అన్నారు. అలాగే ఫైట్ మాస్టర్ తో ఎదురైన కొన్ని అనుభవాలు షేర్ చేసుకున్నారు. విచిత్ర ఆ సినిమాకు పనిచేసిన మేనేజర్ నే వివాహం చేసుకుని స్థిరపడ్డారు. విచిత్ర చాలా పాత నటి.
1991 లో కెరీర్ మొదలు పెట్టిన కన్నడ నటి. చాలా సినిమాల్లో సపోర్టింగ్ రోల్స్ చేసారు. తాజాగా విచిత్ర వ్యాఖ్యలతో నెట్టింట వైరల్ అవుతున్నారు. ఎవరు నటి? అంటూ గూగూల్ సెర్చ్ విపరీతంగా జరుగుతోంది. విచిత్రకు ఈ వ్యాఖ్యలు నెట్టింట మంచి పాపులారిటీని తెచ్చి పెడుతున్నట్లు తెలుస్తోంది.