నలుగురిలో సాయిపల్లవికి చిర్రెత్తుకొచ్చే ఒకే ఒక్క పని!
ఆ జన సమూహంలో ఫోటోలు ఇవ్వడానికి వాళ్లు కూడా చాలా ఇబ్బంది పడుతుంటారు.
అందమైన హీరోయిన్లు సాధారణ జనాల్లోకి వెళ్తే పరిస్థితి ఎలా ఉంటుందన్నది? చెప్పాల్సిన పనిలేదు. ఒకప్పుడు ఆటోగ్రాఫులంటూ మీద మీదకు వెళ్లేవారు. ఇప్పుడు సెల్పీలంటూ ముఖం మీద ముఖం పెట్టి క్లిక్ మనిపిస్తున్నారు. చుట్టూ ఎలాంటి పరిస్థితులున్నా సరే సెల్పీ ప్లీజ్ అంటూ మీద మీద కి వెళ్తుంటారు. ఆ జన సమూహంలో ఫోటోలు ఇవ్వడానికి వాళ్లు కూడా చాలా ఇబ్బంది పడుతుంటారు. ఎంత సహనంగా ఉండాలన్నా? ఒక్కోసారి ఆ సహనాన్ని కోల్పోయే పరిస్థితులు ఏర్పడుతుంటాయి.
అయితే ఇలా ఫోటోలు తీసుకోవడమే కాదు అనుమతి లేకుండా ఫోటో తీసుకోవడం కూడా అస్సలు ఇష్టముండదని సాయి పల్లవి అభిప్రాయపడింది. నలుగురిలోకి వెళ్లినప్పుడు ఫోటోలు కోసం వెంట పడతారు. కానీ ఇలా చేయడం తనకు ఎంత మాత్రం నచ్చదంది. తానేమీ చెట్టునో? పుట్టునో? కాదంది. అలాగే ఓ విలువైన కట్టడాన్నో కాదు అంది. ఇలా కాకుండా మీతో ఫోటో తీసుకోవచ్చా? అని అడిగితే ఎంత బాగుంటుంది.
అలా అడిగితే ఎవరైనా వద్దు అని అంటారా? అలాగే చుట్టూ ఎక్కు మంది ఉండి అందరూ ఒకేసారి తనని చూస్తే చాలా ఇబ్బందిగా ఫీలవుతుందిట. లోలోపల కంగారు, భయంగానూ అనిపిస్తుంది అంది. ఆ సమయంలో ఎంతో ఆందోళనకు గురవుతుందిట. అలాగే ఎవరైనా అదే పనిగా ప్రశంసించినా సరే అలాంటి అనుభూతే కలుగుతుందిట.ఆ సమయంలో ఒకటి రెండు అని అంకీలు లెక్కపెట్టి ఆ సందర్భం నుంచి బయటకు వచ్చే ప్రయత్నం చేస్తానంది.
అలాగే అమ్మడికి అతిగా ఆలోచించే అలవాటు కూడా ఉందిట. దాన్నిపోగొట్టుకునేందుకు ప్రతీరోజు క్రమం తప్ప కుండా ధ్యానం చేస్తుందిట. తక్కువ మ్యాకప్ వేసుకోవడం..సంప్రదాయ బద్దంగా ఉండటం అంటే ఇష్టమంది. కొంత మంది మోడ్రన్ బ్యూటీ గా ఎందుకు ఉండవు? అని అడుగుతారంది. కానీ దానికి తన నుంచి ఎలాంటి సమాధానం వెళ్లదని చెప్పుకొచ్చింది.