మరో హిట్‌ మూవీ సీక్వెల్‌ కన్ఫర్మ్‌

ఈ మధ్య కాలంలో అన్ని భాషల సినిమా ఇండస్ట్రీలోనూ సీక్వెల్స్‌ ట్రెండ్‌ కొనసాగుతోంది. కొన్ని సినిమాలకు ముందుగానే రెండు పార్ట్‌లకు తగ్గట్లుగా కథను రెడీ చేసుకుంటూ ఉన్నారు.

Update: 2025-01-19 20:30 GMT

ఈ మధ్య కాలంలో అన్ని భాషల సినిమా ఇండస్ట్రీలోనూ సీక్వెల్స్‌ ట్రెండ్‌ కొనసాగుతోంది. కొన్ని సినిమాలకు ముందుగానే రెండు పార్ట్‌లకు తగ్గట్లుగా కథను రెడీ చేసుకుంటూ ఉన్నారు. కొన్ని సినిమాలు హిట్ అయిన తర్వాత సీక్వెల్‌ లేదా ప్రీక్వెల్‌ను ప్లాన్‌ చేస్తున్నారు. ప్రస్తుతం సెట్స్‌పై చాలా సీక్వెల్స్‌, ప్రీక్వెల్స్ ఉన్నాయి. ఇటీవల సంక్రాంతికి వచ్చిన సంక్రాంతికి వస్తున్నాం సినిమాకు సీక్వెల్‌ తీసే ఆలోచన ఉన్నట్లు దర్శకుడు అనిల్ రావిపూడి ప్రకటించాడు. అంతే కాకుండా అదే సంక్రాంతికి విడుదల అయిన డాకు మహారాజ్ సినిమాకు ప్రీక్వెల్‌ను ప్లాన్‌ చేస్తామని నిర్మాత నాగవంశీ ప్రకటించాడు. ఇలా చాలా సినిమాలకు ప్రీక్వెల్‌, సీక్వెల్‌ను ప్లాన్‌ చేస్తున్నారు.

ఇటీవల మలయాళ సినిమా ఇండస్ట్రీ నుంచి వచ్చిన సినిమా 'మార్కో'. ఉన్ని ముకుందన్‌ హీరోగా మనీఫ్‌ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా బాక్సాఫీస్‌ వద్ద రూ.100 కోట్ల వసూళ్లు రాబట్టింది. మలయాళ సినిమా ఇండస్ట్రీలో ఏ సర్టిఫికెట్‌ దక్కించుకున్న సినిమా వంద కోట్లు రాబట్టడం ఇదే ప్రథమం. మార్కో సినిమా మలయాళ సినిమా ఇండస్ట్రీలో బిగ్గెస్ట్‌ బ్లాక్ బస్టర్‌ సినిమాల జాబితాలో చేరింది. హిందీ, తెలుగు భాషల్లోనూ డబ్‌ అయిన ఈ సినిమాకు మంచి స్పందన దక్కింది. బిగ్గెస్ట్‌ బ్లాక్ బస్టర్‌గా నిలిచిన మార్కో సినిమాకి సీక్వెల్‌ రూపొందించే ఆలోచన ఉన్నట్లుగా దర్శకుడు హనీఫ్‌ అధికారికంగా ప్రకటించాడు.

హిట్‌ సినిమాలకు సీక్వెల్‌ రావడం చాలా కామన్‌ విషయం అయ్యింది. అందుకే ఈ సినిమాకు సీక్వెల్‌ అంటూ ప్రకటించడం పెద్ద ఆశ్చర్యాన్ని కలిగించలేదని కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. అయితే మార్కో సినిమా కథకి సీక్వెల్‌కి ఎంత స్కోప్‌ ఉన్నది అనేది ఇక్కడ ప్రత్యేకంగా చూడాల్సిన అవసరం ఉంది. మార్కో సినిమాను మొదట రెండు పార్ట్‌లుగా అనుకోలేదు. కనుక కథను ముగించారు. అయితే రెండో పార్ట్‌ కోసం మళ్లీ కొత్త కథను రాసుకోవాల్సి ఉంది. రెండో కథ ఈ స్థాయిలో ప్రేక్షకులను అలరించే అవకాశం ఉందా అనేది చూడాలి.

ఉన్ని ముకుందన్‌ సినిమాలకు మలయాళ సినిమా ఇండస్ట్రీలో మంచి స్పందన దక్కడం మనం చూస్తూనే ఉంటాం. అయితే ఇప్పటి వరకు ఆయన్ను చూసిన సినిమాలతో పోల్చితే మార్కో సినిమా అత్యంత క్రూరమైన సన్నివేశాలను కలిగి ఉంది. అదే తరహాలో మార్కో 2 లోనూ అంతకు మించిన హింసాత్మక సన్నివేశాలను డిజైన్‌ చేసే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. మార్కో సినిమాలో రవి బస్రూర్‌ అందించిన బ్యాక్‌గ్రౌండ్‌ స్కోర్‌ హైలైట్‌గా నిలిచింది. కనుక సీక్వెల్‌లోనూ ఆయన మార్క్ బ్యాక్‌ గ్రౌండ్‌ స్కోర్‌తో యాక్షన్‌ సన్నివేశాలను దడదడలాడిస్తే ప్రేక్షకులు మరో విజయాన్ని కట్టబెట్టే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి.

Tags:    

Similar News