మ్యాడీ లేకపోతే కంగన ఖాళీయే
ఇది ఇంతకీ ఏ ఫ్రాంఛైజీ అంటే.. కంగన, మాధవన్ ప్రధాన పాత్రలు పోషించిన బ్లాక్ బస్టర్ `తను వెడ్స్ మను` గురించే.
ప్రతిష్ఠాత్మక ఫ్రాంఛైజీ సినిమాలో తనకు అవకాశం ఉందో లేదోనని ప్రతిభావంతుడైన ఆర్.మాధవన్ అలియాస్ మ్యాడీ సందేహం వ్యక్తం చేసారు. వారు నన్ను ఎంపిక చేసుకున్నారో లేదో.. దీని గురించి నాకు పూర్తి అవగాహన లేదు. మేకర్స్ నుంచి నాకు ఎలాంటి సమాచారం లేదు. బహుశా నన్ను తీసుకోకపోవచ్చు.. అని వ్యాఖ్యానించారు.
ఇది ఇంతకీ ఏ ఫ్రాంఛైజీ అంటే.. కంగన, మాధవన్ ప్రధాన పాత్రలు పోషించిన బ్లాక్ బస్టర్ `తను వెడ్స్ మను` గురించే. ఈ ఫ్రాంఛైజీలో మూడో భాగం సెట్స్ పైకి వెళ్లనుంది. ఆనంద్ ఎల్ రాయ్ ఇప్పటికే స్క్రిప్టును రెడీ చేస్తున్నారు. కంగన ఇందులో త్రిపాత్రాభినయం చేయనుంది. అయితే ఇప్పటివరకూ మాధవన్ ఉన్నాడా? లేదా? అన్నదానిపై మేకర్స్ నుంచి ఎలాంటి సమాచారం లేదు.
దీంతో తనను ప్రశ్నించిన మీడియాకు మ్యాడీ పైవిధంగా సమాధానమిచ్చారు. ఆనంద్ నన్ను ఇంకా సంప్రదించలేదని, స్క్రిప్ట్ ఏమిటో తెలియదని మాధవన్ అన్నారు. మీడియా నన్ను అడుగుతూనే ఉంది. ఆనంద్ కానీ ఇంకెవరైనా కానీ మూడవ భాగం గురించి నాతో మాట్లాడలేదు. స్క్రిప్ట్ ఏమిటో నాకు తెలియదు. బహుశా నేను అందులో లేకపోవచ్చు. నా స్థానంలో ఎవరినైనా భర్తీ చేసి ఉండవచ్చు. నాకు చిన్న ఆలోచన కూడా లేదు... అని మాధవన్ అన్నారు.
`తను వెడ్స్ మను` 2011 లో థియేటర్లలో విడుదలై భారీ విజయాన్ని సాధించింది. ఆనంద్ ఎల్. రాయ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో కంగన, మాధవన్ ప్రధాన పాత్రల్లో నటించారు. 2015 లో `తను వెడ్స్ మను రిటర్న్స్` తెరకెక్కి బ్లాక్ బస్టర్ అయంది. రెండో భాగంలో కంగనా రనౌత్ ద్విపాత్రాభినయంలో నటించింది. ఇప్పుడు మూడో భాగంలో త్రిపాత్రాభినయం చేస్తుందని కథనాలొస్తున్నాయి. అయితే మాధవన్ తనను ఎంపిక చేసుకున్నారో లేదోననే సందేహం వ్యక్తం చేయగానే, అసలు మ్యాడీ లేనిదే తను వెడ్స్ మను లేదని అతడు ఉంటేనే దానికి అందం! అంటూ అభిమానులు వ్యాఖ్యానిస్తున్నారు. ప్రస్తుతం కంగన మార్కెట్ పూర్తిగా జీరోకి పడిపోయింది. ఇలాంటి సమయంలో మ్యాడీ అవసరం చాలా ఎక్కువ అని అభిమానులు కొందరు సూచిస్తున్నారు.