పాపుల‌ర్ హీరోయిన్ విడాకుల‌పై గుస‌గుస‌

ఇషా ఇటీవ‌ల త‌న కుటుంబ స‌భ్యులతో అనుబంధం గురించి ఆస‌క్తిక‌ర పోస్టులు చేసింది.

Update: 2024-01-22 03:49 GMT

సెల‌బ్రిటీ ప్ర‌పంచంలో విడాకుల వార్త‌లు ఆశ్చ‌ర్య‌ప‌రుస్తున్నాయి. ఇటీవ‌ల‌ సానియా మిర్జా- షోయ‌బ్ మాలిక్ జంట బ్రేక‌ప్ అధికారికంగా ధృవీక‌ర‌ణ అందుకోగానే, ఇంత‌లోనే షోయ‌బ్ ప్ర‌ముఖ పాక్ న‌టిని పెళ్లాడి షాకిచ్చాడు. దీనికి ముందు సానియా విడాకుల‌ను ప్ర‌స్థావిస్తూ పోస్ట్ చేసిన క్రిప్టిక్ పోస్ట్ అభిమానుల‌ను క‌ల‌వ‌ర‌ప‌రిచింది.

ఇప్పుడు డ్రీమ్ గ‌ర్ల్ హేమ‌మాలిని కుమార్తె, న‌టి ఈషా డియోల్ తన భర్త భరత్ నుండి విడిపోయిందా? అంటూ బాలీవుడ్ మీడియాలో క‌థ‌నం వెలువ‌డ‌డం షాకిస్తోంది. దీనికి కార‌ణం ఈషా డియోల్ క్రిప్టిక్ పోస్ట్. 29 జూన్ 2012న ధర్మేంద్ర - హేమ మాలిని కుమార్తె ఈషా డియోల్ ముంబై-ఇస్కాన్ ఆలయంలో భరత్ తఖ్తానిని వివాహం చేసుకున్నారు. ఇది సింపుల్ వెడ్డింగ్. ఈ జంట‌కు పిల్ల‌లు ఉన్నారు. అయితే తాజాగా ఈషా చేసిన గుప్తమైన పోస్ట్ విడాకుల పుకార్లకు దారితీసింది. తాజా పోస్ట్‌లో ఈషా తన తొలి చిత్రంలో డ్యాన్స్ చేస్తున్న వీడియోను షేర్ చేసి గుంబ‌న‌గా వ్యాఖ్యానించింది. ఈషా ఎంతో ఎన‌ర్జిటిక్ గా ఇందులో డ్యాన్సులు చేస్తోంది.

కొన్నిసార్లు మీకు మీరుగా వ‌దులుకున్న‌ప్పుడు... మీ గుండె చప్పుడుకు తగ్గట్టుగా నృత్యం చేయాలి! అంటూ ఈ డ్యాన్స్ వీడియోకి గుంబ‌న‌(క్రిప్టిక్‌) గా క్యాప్ష‌న్ ఇచ్చింది. నా మొదటి చిత్రం..18 ఏళ్ల క్రితం రిలీజైంద‌ని తెలిపింది. నిర్మాత బోనీక‌పూర్, దర్శ‌కుడు ఫ‌ర్హాన్ అక్త‌ర్ ల‌ను ట్యాగ్ చేస్తూ.. ఆస‌క్తిక‌ర విష‌యాలు తెలిపింది. గత గురువారం 11/1 నాటికి నా మొదటి చిత్రం విడుద‌లై 22 సంవత్సరాలు పూర్తయింది. నేను ఒక పోస్ట్ చేయడం మిస్ అయ్యాను. ఇది నా మొదటి చిత్రం కాబ‌ట్టి ఎప్ప‌టికీ ఆరాధిస్తాను.. అని రాసింది.

ఇషా ఇటీవ‌ల త‌న కుటుంబ స‌భ్యులతో అనుబంధం గురించి ఆస‌క్తిక‌ర పోస్టులు చేసింది.

బాక్సాఫీస్ వద్ద ఆల్ టైమ్ బ్లాక్ బస్టర్ గా మారిన గదర్ 2లో తన నటనకు సోదరుడు సన్నీ డియోల్ పై ఈషా డియోల్ ప్రశంసల వర్షం కురిపించింది. తన తాజా ఇంటర్వ్యూలో ఈషా సీక్వెల్‌లోని చేతి పంపు సన్నివేశం గురించి మాట్లాడింది . ఇది చిత్రానికి హైలైట్ అని పేర్కొంది.

ఇటీవల విలేకరుల సమావేశంలో సన్నీ డియోల్ ఈ చిత్రం అద్భుతమైన విజయం గురించి మాట్లాడుతూ, ``నేను చాలా ఒత్తిడికి గురయ్యాను, ప్రతి ఒక్కరూ జీవితంలో ఏదో ఒకదానిపై ఒత్తిడికి గురవుతారు ఎందుకంటే ప్రతి ఒక్కరూ కష్టపడి పని చేస్తారు. విఫలమవ్వాలని కోరుకోరు. నా జీవితంలో.. నేను ఎల్లప్పుడూ సత్య మార్గంలో నడిచాను.. అది చేయడం చాలా కష్టమైన పని... అని అన్నారు.

Tags:    

Similar News