మొదటి రోజు 50 కోట్ల షేర్ ఈ హీరోలకు చాలా ఈజీ
ఈ ఏడాది టాలీవుడ్ నుంచి హనుమాన్, కల్కి 2898ఏడీ సినిమాలు పాన్ ఇండియా రేంజ్ లో సక్సెస్ అందుకున్నాయి.
టాలీవుడ్ లో ప్రస్తుతం స్టార్ హీరోలు అందరూ కూడా పాన్ ఇండియా సినిమాలు చేస్తున్నారు. ఇవన్నీ కూడా భారీ హైప్ ఉన్న ప్రాజెక్ట్స్ కావడం విశేషం. 200 నుంచి 300 కోట్ల బడ్జెట్ తో ఈ సినిమాలు తెరకెక్కుతున్నాయి. మన హీరోలు అందరూ కూడా వారి మార్కెట్, బ్రాండ్ ఇమేజ్ ని పాన్ ఇండియా సినిమాలతో పెంచుకోవడానికి రెడీ అవుతున్నారు. ఈ ఏడాది టాలీవుడ్ నుంచి హనుమాన్, కల్కి 2898ఏడీ సినిమాలు పాన్ ఇండియా రేంజ్ లో సక్సెస్ అందుకున్నాయి.
మరో అరడజనుకి పైగా సినిమాలు పాన్ ఇండియా స్థాయిలో సత్తా చాటడానికి నెక్స్ట్ ఐదు నెలల కాలంలో రాబోతున్నాయి. అయితే మొదటి రోజు 50 కోట్లకి పైగా షేర్ కలెక్ట్ చేసే సత్తా కొన్ని సినిమాలకి మాత్రమే ఉంది. వాటిలో చూసుకుంటే ఈ ఏడాది కొన్ని సినిమాలు రాగా, మరికొన్ని 2025లో ప్రేక్షకుల ముందుకి రానున్నాయి. వాటిలో ముందుగా వినిపించే పేరు దేవర. యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఈ చిత్రాన్ని పాన్ ఇండియా ప్రాజెక్ట్ గా చేస్తున్నాడు.
కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ సినిమా సెప్టెంబర్ 27న థియేటర్స్ లోకి రాబోతోంది. భారీ బడ్జెట్ తో ఈ చిత్రాన్ని యువసుధా ఆర్ట్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఈ సినిమా బిజినెస్ ఆల్ మోస్ట్ అన్ని ఏరియాలలో కంప్లీట్ అయినట్లు తెలుస్తోంది. కచ్చితంగా ఈ సినిమా మొదటి రోజు 50 కోట్లకి పైగా షేర్ ని వరల్డ్ వైడ్ గా అందుకునే ఛాన్స్ ఉందనే మాట వినిపిస్తోంది.
అలాగే ఈ ఏడాది డిసెంబర్ లో రానున్న గ్లోబల్ స్టార్ గేమ్ చేంజర్ కూడా 50 కోట్లకి పైగా షేర్ ని మొదటిరోజు వసూళ్లు చేసే ఛాన్స్ ఉంది. పాన్ ఇండియా లెవల్ లో రామ్ చరణ్ కి ఉన్న మార్కెట్ గేమ్ చేంజర్ కి మంచి ఓపెనింగ్స్ తీసుకొస్తుందని భావిస్తున్నారు. అలాగే డిసెంబర్ 6న రిలీజ్ కానున్న ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుష్ప 2 కూడా మొదటి రోజు 50 కోట్లకి పైగా షేర్ ని కలెక్ట్ చేసే ఛాన్స్ ఉందని ట్రేడ్ పండితులు అంచనా వేస్తున్నారు. నిజానికి పుష్ప 2 మూవీ 100 కోట్లని మొదటి రోజు కలెక్ట్ చేస్తుందని భావిస్తున్నారు.
అలాగే వచ్చే ఏడాది రిలీజ్ కానున్న సినిమాలలో డార్లింగ్ ప్రభాస్ రాజాసాబ్ మూవీ చాలా ఈజీగా 50 కోట్ల షేర్ ని అందుకుంటుందని సినీ విశ్లేషకులు అంటున్నారు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఓజీ మూవీ వరల్డ్ వైడ్ గా పాన్ ఇండియా ప్రాజెక్ట్ గా రిలీజ్ కానుంది. ఈ నేపథ్యంలో ఓజీ కూడా 50 కోట్ల షేర్ ని మొదటి రోజు టచ్ చేసే ఛాన్స్ ఉందని అంచనా వేస్తున్నారు. వీటిలో ఎన్ని 50 కోట్లకి పైగా షేర్ ని మొదటి రోజు అందుకొని రికార్డ్ సృష్టిస్తుందనేది వేచి చూడాలి.