జ‌నాల్ని చూసి షాకైపోతున్న హీరోలు!

వాళ్ల కోరిక మేర‌కు... సినిమా ని జ‌నాల్లోకి తీసుకెళ్లేందుకు సౌత్ లో ఎప్ప‌టి నుంచో ఓ క‌ల్చ‌ర్ లా కొన‌సాగుతోంది.

Update: 2023-11-29 11:30 GMT

తెలుగు..త‌మిళ్ లో సినిమా ప్ర‌చారం అంటే ఏ రేంజ్ లో ఉంటుందో తెలిసిందే. రిలీజ్ కి ముందు అభిమానుల స‌మ‌క్షంలో జ‌రిగే ఆడియో.. ప్రీ రిలీజ్ ఈవెంట్ ల‌తో ద‌ద్ద‌రిల్లిపోతుంది. వేలాది మంది అభిమానులు ఆ వేడుక‌ల కోసం సినిమా ప్రారంభమైన నాటి నుంచి వెయిట్ చేస్తారు. వాళ్ల కోరిక మేర‌కు... సినిమా ని జ‌నాల్లోకి తీసుకెళ్లేందుకు సౌత్ లో ఎప్ప‌టి నుంచో ఓ క‌ల్చ‌ర్ లా కొన‌సాగుతోంది.

ఇలాంటి వేడుక‌లు కోసం హీరోలు ..మిగ‌తా చిత్ర‌బృందం అంతా కూడా అంతే ఎగ్జైట్ మెంట్ తో ఎదురు చూస్తుంది. ఎన్ని సినిమాలు చేసినా..ప్రీ రిలీజ్ ఈవెంట్ వేదిక ఎక్కుతుంటే? ఎప్పుడూ ప్రెష్ అనే ఫీలింగ్ క‌లుగుతుంది. ఈ సంప్ర‌దాయం భ‌విష్య‌త్ లో ఇంకా కొత్త పుంత‌లు తొక్క‌నుంది. సోషల్ మీడియా అందుబా టులో ఉన్నా! ఓటీటీలు ఉన్నా? హీరోని ప్రీ రిలీజ్ వేదిక‌పై చూస్తే దొరికే కిక్కే వేర‌ప్ప అనే అభిమానులు ఉన్నం కాలం ఈ సంప్ర‌దాయం కొన‌సాగుతుంది.

ఇప్పుడా కిక్ బాలీవుడ్ హీరోల‌కు సౌత్ ఆడియ‌న్స్ అందిస్తున్నారు. ఆ మ‌ధ్య జ‌వాన్ ప్రీ రిలీజ్ ఈవెంట చెన్నైలో ఏ రేంజ్ లో జ‌రిగిందే తెలిసిందే. దీనికి ఆ సినిమాలో హీరో షారుక్ ఖాన్ చెన్నై వ‌చ్చాడు. ఆ సినిమా డైరెక్ట్ చేసింది త‌మిళీయ‌న్ అట్లీ. వేలాది మంది అభిమానుల స‌మ‌క్షంలో ఈవెంట్ ని గ్రాండ్ స‌క్సెస్ అయింది. అంత మంది అభిమానుల్ని చూసే స‌ర‌కి షారుక్ విస్తుపోయాడు. ఇలాంటి వేడుక‌లో ఎప్పుడూ పాల్గొన‌లేద‌ని..ఇదే తొలి అనుభ‌వం అని సంబ‌ర‌ప‌డ్డారు.

తాజాగా యాన‌మిల్ ప్రీ రిలీజ్ కూడా హైద‌రాబాద్ లో ఘ‌నంగా జ‌రిగిన సంగ‌తి తెలిసిందే. ఈ వేడుక‌కు ర‌ణ‌బీర్ క‌పూర్..అనీల్ క‌పూర్..బాబి డియోల్ చిత్ర యూనిట్ అంతా పాల్గొంది. ఇది హిందీ సినిమా. కానీ హైద‌రాబాద్ లోనే ఈవెంట్ నిర్వ‌హించ‌డం... దానికి భారీ ఎత్తున అభిమానులు రావ‌డంతో ఈవెంట్ పెద్ద స‌క్స‌స్ అయింది. క‌నుచూప మేర జ‌నాల్ని చూసి ర‌ణ‌బీర్ ...అనీల్ క‌పూర్ షాక్ అయ్యారు. ఇద్ద‌రు స్టేజ్ పై డాన్సులు కూడా చేసేసారు. ఆ వేడుక‌ను గొప్ప అన‌భూతిగా పంచుకున్నారు.

ఎందుకంటే బాలీవుడ్ లో ఈ ర‌క‌మైన క‌ల్చ‌ర్ లేదు. అక్క‌డ భారీ అభిమానులున్నా!ఇలాంటి ఈవెంట్లు నిర్వ‌హించ‌రు. సినిమా రిలీజ్ ముందు ఓస్టార్ హోట‌ల్ లో సింపుల్ గా ఓ ప్రెస్ మీట్ పెట్టి...జ‌నాల్లోకి సినిమాని వ‌దిలేస్తారు. అంత‌కు మంచి ఎలాంటి ఈవెంట్లు చేయ‌రు. మిగ‌తా ప్రచార‌మంతా సోష‌ల్ మీడియాలోనే జ‌రుగుతుంది. అలాంటి హిందీ న‌టులు తెలుగు..త‌మిళ ఈవెంట్లు చూసి షాక్ అవుతు న్నారు. గ‌తంలో అమీర్ ఖాన్ కూడా ఓ మెగా ఈవెంట్ కి వ‌చ్చేసి అలాగే స‌ర్ ప్రైజ్ అయ్యారు.

Tags:    

Similar News