ప్రీ రిలీజ్ ఈవెంట్‌ లో రాఖీ.. కొత్త ప్రమోషన్‌?

ప్రీ రిలీజ్ ఈవెంట్ లో దర్శకుడు కార్తీక్ ఘట్టమనేనికి హీరోయిన్‌ అనుపమ పరమేశ్వరన్‌ రాఖీ కట్టడం అందరి దృష్టిని ఆకర్షించింది.

Update: 2024-02-05 06:07 GMT

ఈ మధ్య సినిమాలను ఎంత కొత్తగా రూపొందించారు అనేదాని కంటే, ఎంత విభిన్నంగా ప్రమోషన్ చేశారు అనేది ముఖ్యం గా మారింది. ప్రమోషన్‌ విభిన్నంగా చేసి జనాల్లోకి సినిమాను తీసుకు వెళ్తేనే మినిమం ఓపెనింగ్స్ వస్తున్నాయి. తద్వారా పాజిటివ్ టాక్ వస్తే మంచి వసూళ్లు నమోదు అవుతున్నాయి.

అందుకే స్టార్‌ హీరోల నుంచి చిన్న హీరోల వరకు ప్రమోషన్‌ ను చాలా విభిన్నంగా చేయడం మనం చూస్తూ ఉన్నాం. ఈ వారం లో రవితేజ నటించిన ఈగల్ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. చాలా విభిన్నంగా ప్రమోషన్ చేస్తూ జనాల్లోకి తీసుకు వెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. తాజాగా ప్రీ రిలీజ్ ఈవెంట్ ను భారీగా నిర్వహించారు.

ప్రీ రిలీజ్ ఈవెంట్ లో దర్శకుడు కార్తీక్ ఘట్టమనేనికి హీరోయిన్‌ అనుపమ పరమేశ్వరన్‌ రాఖీ కట్టడం అందరి దృష్టిని ఆకర్షించింది. అందమైన అమ్మాయిలు అన్నయ్య అనకూడదు అంటూ ఒక వైపు రవితేజ అనడం కూడా అందరి దృష్టిని ఆకర్షించింది.

కార్తీక్‌ తో అనుపమ నాలుగు సినిమాలకు గాను వర్క్‌ చేసింది. ఆ అనుబంధంతో కార్తిక్‌ ను అన్నయ్య అంటూ అనుపమ పిలుస్తుందట. అనుపమ అన్నయ్య అనగానే పక్కనే ఉన్న యాంకర్‌ సుమ రాఖి తెచ్చి ఇచ్చి కట్టమంది. ప్రీ రిలీజ్ వేడుక స్టేజ్‌ మీదే కార్తీక్ కి అనుపమ రాఖీ కట్టింది.

ఇది మొత్తం కూడా పబ్లిసిటీ స్టంట్ అంటూ కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఇదో తరహా కొత్త ప్రమోషన్ లా ఉందనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. కార్తీక్ ను అనుపమ అన్నయ్య అని పిలవడం చాలా రోజుల నుంచి జరుగుతుంది. ఇప్పుడు సడెన్‌ గా సుమ రాఖీ తెచ్చి ఇచ్చి కట్టించడం అనేది ప్లాన్‌ చేసినట్లుగా అనిపిస్తోంది.

ఏది ఏమైతేనేం సినిమాకు మంచి పబ్లిసిటీ వచ్చే విధంగా ప్రీ రిలీజ్ ఈవెంట్ స్టేజ్ పై దర్శకుడికి హీరోయిన్ అనుపమ రాఖీ కట్టింది. వారు అనుకున్నట్లుగానే ఈగల్ సినిమాకు మంచి పబ్లిసిటీ అయితే దక్కింది. ఈ సినిమా ఫిబ్రవరి 9న ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెల్సిందే.

 

Tags:    

Similar News