క్రికెటర్ కి 'ఎక్స్' పెళ్లి ప్రపోజల్ పెట్టిన హీరోయిన్
అయితే సోషల్ మీడియాలో మాత్రం రెగ్యులర్ గా ఫోటోలు షేర్ చేస్తూ, తన అభిప్రాయాలను పంచుకుంటూ ఉండటం వల్ల వార్తల్లో నిలుస్తోంది.
మంచు మనోజ్ ప్రయాణం సినిమా తో తెలుగు సినీ ప్రేక్షకులకు పరిచయం అయిన ముద్దుగుమ్మ పాయల్ ఘోష్. ఈ అమ్మడు ప్రస్తుతం పెద్దగా సినిమాలేమి చేయడం లేదు. అయితే సోషల్ మీడియాలో మాత్రం రెగ్యులర్ గా ఫోటోలు షేర్ చేస్తూ, తన అభిప్రాయాలను పంచుకుంటూ ఉండటం వల్ల వార్తల్లో నిలుస్తోంది.
తాజాగా మరోసారి ఈ అమ్మడు వార్తల్లో నిలిచింది. ఈసారి ఏకంగా స్టార్ క్రికెటర్ మహ్మద్ షమి ని పెళ్లి చేసుకునేందుకు సిద్ధం అంటూ ప్రకటించింది. ఆ మధ్య షమి వైవాహిక జీవితంలో ఇబ్బందులు ఎదురయ్యాయి. దాంతో ఆయన క్రికెట్ పై కూడా ప్రభావం పడింది.
ప్రపంచ కప్ కి ముందు వరకు కూడా షమి పై పెద్దగా అంచనాలు లేవు. కానీ అనూహ్యంగా జట్టులో ఎంట్రీ ఇచ్చిన షమి కేవలం నాలుగు మ్యాచ్ ల్లో 16 వికెట్లు తీసి అద్భుతమైన విజయాలను టీం ఇండియాకు అందించాడు. ప్రపంచ కప్ లో అపజయం లేకుండా దూసుకు పోతున్న టీం ఇండియా దూకుడు లో షమి పాత్ర కీలకం అనడంలో సందేహం లేదు.
ఇన్నాళ్లు షమి గురించి పట్టించుకోని వారు కూడా ఇప్పుడు ఆయనపై ప్రశంసలు కురిపిస్తూ ఇండియాకు మరో ప్రపంచకప్ ను తెచ్చి పెట్టడంలో కచ్చితంగా షమి కీలక పాత్ర పోషిస్తాడు అంటున్నారు. ఇదే సమయంలో హీరోయిన్ పాయల్ ఘోష్ తాను షమిని పెళ్లి చేసుకునేందుకు సిద్ధంగా ఉన్నాను, అయితే అతడు ఇంగ్లీష్ ను మెరుగు పర్చుకోవాలంటూ కామెంట్ చేసింది.
మొత్తానికి షమికి పెళ్లి ప్రపోజల్ పెట్టిన పాయల్ ఘోష్ ట్వీట్ అందరిని ఆకర్షిస్తోంది. అదే సమయంలో నువ్వు షమీని ప్రేమిస్తే ఇంగ్లీష్ తో పనేంటి అన్నట్లుగా కొందరు ఆమెకు కౌంటర్ ఇస్తున్నారు. పాయల్ పెళ్లి ప్రపోజల్ పై షమి స్పందించలేదు. ప్రస్తుతం ప్రాక్టీస్ లో బిజీగా ఉన్న షమి ఇలాంటి విషయాలపై ఫోకస్ పెట్టడం లేదు. ఈ మెగా టోర్నమెంట్ తర్వాత అయినా షమి ఈ పెళ్లి ప్రపోజల్ పై స్పందిస్తాడేమో చూడాలి.