హీరోయిన్లను అక్కడికే పరిమితం చేయోద్దు!
హీరోయిన్లకు హీరోలకు ధీటుగా సమాన పారితోషికం ఇవ్వాలని ఇప్పటికే పలువురు సీనియర్ భామలు డిమాండ్ చేస్తున్న సంగతి తెలిసిందే.
హీరోయిన్లకు హీరోలకు ధీటుగా సమాన పారితోషికం ఇవ్వాలని ఇప్పటికే పలువురు సీనియర్ భామలు డిమాండ్ చేస్తున్న సంగతి తెలిసిందే. హీరోలతో పొలిక చేస్తే తాము ఎంత మాత్రం తక్కువదని..కానీ పురుషాధిక్య పరిశ్రమలో తమకి సమాన వేతనం దక్కలేదని లబోదిబోమన్న సందర్భాలెన్నో ఉన్నాయి. దీపికా పదుకొణే..ఐశ్వర్యారాయ్...ప్రియాంకచోప్రా..కంగనా రనౌత్..రాణీ ముఖర్జీ లాంటి భామలు ఎప్పుడో ఈ విషయంపై ఎంతో ఓపెన్ గా తమ అభిప్రాయాలు చెప్పారు.
ఈ నేపథ్యంలో మిగతా భామలకంటే కంగన ఓ అడుగు ముందుకేసి ఏకంగా ఆమె సొంతంగా లేడీ ఓ రియేంటెండ్ సినిమాలు చేయడం మొదలు పెట్టింది. వాటిలో కొన్ని సినిమాలు వందల కోట్ల వసూళ్లని సైతం సాధించడం మరింత మందిలో స్పూర్తిని రగిలించింది. అంతకంటే ముందు రాణీముఖర్జీ ఈ తరహా ప్రయత్నాలు చేసి సక్సెస్ అయింది. వాళ్లద్దరి స్పూర్తితో దీపికా పదుకొణే కూడా తన అదృష్టాన్ని పద్మావతి రూపంలో పరీక్షించుకుని పాస్ అయింది.
తాజాగా బాలీవుడ్ దర్శకులు పాత్రల పరంగా హీరోయిన్లకు ఇస్తోన్న ప్రాధాన్యతని ఉద్దేశించి దీపిక మరోసారి సంచలన వ్యాఖ్యలు చేసింది. `సున్నింతంగా ఉండే పాత్రలు..బెదరుచూపులు..తడబడే పాత్రలు.. చేతి నిండా పనులతో సినిమాల్లో చూపించే హీరోయిన్లు..ఛాన్స్ వస్తే అదరగొట్టే హీరోయిన్లను కొన్ని పాత్రలకే పరిమితం చేస్తున్నారు. ఈ అభిప్రాయాన్ని మార్చుకోవాలి. మార్చే అవసరం కూడా వాళ్లపైనే ఉంది.
హీరోలు ప్రధాన పాత్రల్లో నటించినా నాయికా ప్రాధాన్యం ఉన్న చిత్రాలనే ఎంచుకుంటాను. హీరోలకు పోటీగా హీరోయిన్లు యాక్షన్ సన్నివేశాలతో ప్రేక్షకుల్ని మెప్పిస్తున్నారు. వాళ్లని కేవలం సున్నితమైన పాత్రలకే పరిమితం చేయాలనే ఆలోచన మారాలి. హీరోయిన్లు ..హీరోలకు ఏ విషయంలో తక్కువ కాదని గ్రహించాలి. అప్పుడే హీరోయిన్లు మరిన్ని గొప్ప పాత్రలు పోషించడానికి అవకాశం ఉంటుంది` అని అంది.