సుశాంత్ ఆడేదెప్పుడు టెస్ట్ మ్యాచులే!

అక్కినేని ఫ్యామిలీ నుంచి టాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చిన సుశాంత్ జ‌ర్నీ గురించి చెప్పాల్సిన ప‌నిలేదు

Update: 2023-08-04 06:40 GMT

అక్కినేని ఫ్యామిలీ నుంచి టాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చిన సుశాంత్ జ‌ర్నీ గురించి చెప్పాల్సిన ప‌నిలేదు. హీరోగా ఎంట్రీ ఇచ్చి అటుపై క్యారెక్ట‌ర్ ఆర్టిస్ట్ గా ట‌ర్నింగ్ తీసుకున్నాడు.' కాళిదాసు'..'క‌రెంట్'..'అడ్డా' లాంటి చిత్రాల్లో హీరో పాత్ర‌ల‌తో మెప్పించిన సుశాంత్ అటుపై 'అల‌వైకుంఠ‌పుర‌ములో'...'రావ‌ణ‌సుర' లాంటి చిత్రాల్లో విభిన్న పాత్ర‌ల్లో క‌నిపించాడు. మ‌ధ్య మ‌ధ్య‌లో హీరో అవ‌కాశాలు అందుకుంటూ కాన్సెప్ట్ బేస్డ్ చిత్రాలు చేస్తున్నాడు.

అయినా ఓ సారి హీరో నుంచి క్యారెక్ట‌ర్ ఆర్టిస్ట్ గా ట‌ర్న్ తీసుకుంటే? అది కెరీర్ కి సెకెండ్ ఇన్నింగ్స్ నే ఇండస్ట్రీ భావిస్తుంది. త్వ‌ర‌లో 'భోళా శంక‌ర్' సినిమాతో ప్రేక్ష‌కుల్ని మెప్పించ‌డానికి రెడీ అవుతున్నాడు. ఈ సంద‌ర్భంగా మీ రెండో ఇన్నింగ్స్ ఎలా సాగుతుంది? అని ప్ర‌శ్నిస్తే ఆస‌క్తిక‌ర బ‌ధులిచ్చారు.

'నేను ఇన్నింగ్స్ ల వైజ్ గా కెరీర్ ని డిసైడ్ చేయ‌లేదు. నేను ఎప్పుడూ ఆడేది టెస్ట్ మ్యాచులే. ఇదంతా ప్ర‌ణాళిక ప్ర‌కారం చేసిందేం కాదు. హీరో..అతిధి పాత్ర‌....స‌హాయ పాత్ర‌లంటూ గీరి గీసుకుని లేను. ఎలాంటి పాత్ర వ‌చ్చినా చేసుకుంటూ వెళ్లిపోవ‌డమే. ఈ జ‌ర్నీని నేను ఎంతో ఆస్వాదిస్తున్నా. 'అల‌వైకుంఠ‌పురములో' చిత్రం ఈ ర‌క‌మైన జ‌ర్నీకి బీజం ప‌డింది. అందులో త్రివిక్ర‌మ్ కొత్త‌గా చూపించారు. ఆసినిమాతో చాలా నేర్చుకున్నా. అలాగే 'రావ‌ణసుర' లో ప్ర‌తి నాయ‌కుడి ఛాయ‌లున్న పాత్ర‌లో విభిన్నంగా చూపించారు.

అంత‌కు ముందు హీరో జర్నీ డిఫ‌రెంట్. తాజాగా చిరంజీవి గారి సినిమాలో న‌టిస్తున్నా. చిన్న నాటి నుంచి చిరంజీవిగారి సినిమాలు చూస్తూ పెరిగా. ఇప్పుడు ఆయ‌న సినిమాలో నేను న‌టించ‌డం స‌ర్ ప్రైజ్ గా అనిపిస్తుంది. నాకు ఆయ‌న డాన్సులంటే పిచ్చి. చ‌దువుకునే రోజుల్లో ఆయ‌న పాటల చిత్రీక‌ర‌ణ సెట్స్ కి రెండు..మూడు సార్లు వెళ్లాను. ఆ డాన్సులు చూసి ఇంట్లో ప్రాక్టీస్ చేసే వాడిని. ఈ సినిమాలో ఆయ‌న‌తో క‌లిసి ఓ స్టెప్ కూడా వేసా. ఇలాంటి అవ‌కాశం ఎంత మందికి దొరుకుతుంది. కెరీర్ ప‌రంగా డిఫ‌రెంట్ పాత్ర‌లు పోషించాలి. అప్పుడే న‌టుడిగా నేను కొత్త‌గా ట్రై చేసాను అని చెప్పుకోగ‌ల‌ను. ప్ర‌స్తుతం హీరోగా రెండు సినిమాల్ని ఒకే చేసా' అని అన్నారు.

Tags:    

Similar News