క్లాస్+మాస్ కలిపి కొట్టేస్తోన్న హీరో!
ప్లాప్ ఇచ్చిన డైరక్టర్ కే మరోసారి నాని ఛాన్స్ ఇవ్వడంతో ఈ సినిమాపై అతడు ఎంత కాన్పిడెంట్ గా ఉన్నాడు? అన్నది చెప్పొ చ్చు.
నేచురల్ స్టార్ నాని పుల్ స్వింగ్ లో ఉన్నాడు. 'దసరా'తో వంద కోట్ల హీరో అయ్యాడు. ఆసినిమా నానికి మాస్ లో మంచి ఫాలోయింగ్ తెచ్చి పెట్టింది. అప్పటివరకూ నేచురల్ స్టార్ అనే నాని మాస్ స్టార్ అనే కొత్త ట్యాగ్ తోనూ పిలుస్తున్నారు. ఆ వెంటనే 'హాయ్ నాన్న' అంటూ మరో క్లాసిక్ హిట్ సొంతం చేసుకున్నాడు. ఇదే ఊపులో 'సరిపోదా శనివారం'తో హ్యాట్రిక్ నమోదు చేయాలని ఆశపడుతున్నాడు. ప్లాప్ ఇచ్చిన డైరక్టర్ కే మరోసారి నాని ఛాన్స్ ఇవ్వడంతో ఈ సినిమాపై అతడు ఎంత కాన్పిడెంట్ గా ఉన్నాడు? అన్నది చెప్పొ చ్చు.
విజయం సాధిస్తే ఇది క్లాస్ కోటాలోకే పోతుంది. గతంలో వివేక్ అత్రేయ తెరకెక్కించిన 'అంటే సుందరానికి' సినిమా ఓ సెక్షన్ ఆడియన్స్ ని బాగానే మెప్పించింది. కానీ మాస్ కి రీచ్ అవ్వలేదు. ఈసారి అలాంటి వైఫల్యం జరగకుండా ఉంటుందనే నాని నమ్ముతున్నాడు. ఈ సినిమా తర్వాత నాని 'హిట్ ది థర్డ్ కేస్' చిత్రాన్ని పట్టాలెక్కిస్తున్నాడు. ఇప్పటికే శైలేష్ కోలను నాని కోసం వెయిట్ చేస్తున్నాడు. హిట్ ప్రాంచైజీ నుంచి వస్తోన్న మూడవ చిత్రం. దీనిపై భారీ అంచనాలే ఉన్నాయి.
ఇప్పటికే నాని రోల్ ఎలా ఉంటుం దన్నది సెకెండ్ కేస్ లోనే రివీల్ చేసారు. అలాగే 'బలగం' ఫేం వేణు దర్శకత్వంలో 'ఎల్లమ్మ' అనే మరో చిత్రానికి కూడా నాని కమిట్ అయ్యాడు. ఇది తెలంగాణ బ్యాక్ డ్రాప్ లో సాగే స్టోరీ. బలంగా వేణుకి మంచి పేరు రావడంతో ఈ సినిమాపైనా మంచి అంచనాలే ఉన్నాయి. అతడి సినిమాలు అన్ని వర్గాల్ని మెప్పించే విధంగా ఉంటాయని చెప్పొచ్చు. ఇది పూర్తయిన తర్వాత మళ్లీ 'దసరా' డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెలని తెరపైకి తేనున్నాడు.
స్టార్ హీరోలంతా బిజీగా ఉండటంతో శ్రీకాంత్ మళ్లీ నాని నే డేట్లు అడుగుతున్నాడు. నానిని 100 కోట్ల క్లబ్ లో చేర్చిన డైరెక్టర్ కాబట్టి అతడికి నో చెప్పడానికి ఛాన్సే లేదు. అయితే తొలి చిత్రంలో మాస్ నానిని చూపించిన శ్రీకాంత్ రెండవ చిత్రంలో ఎలా చూపిస్తాడు? అన్నది చూడాలి. ప్రస్తుతం నాని కోసమే కథ సిద్దం చేసే పనిలో బిజీగా ఉన్నాడు. మొత్తంగా నాని ఈ రెండేళ్ల పాటు ఈ చిత్రాలతోనే బిజీగా ఉంటాడని తెలుస్తోంది.