ఖమ్మంలో వేగంగా వీరమల్లు..ఏప్రిల్ నుంచి జనాల్లోనే!
అయితే చివరి షెడ్యూల్ లో భాగంగా ప్రస్తుతం ఖమ్మంలో శర వేగంగా చితరీకరణ జరుగుతుంది.;

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కథానాయకుడిగా జ్యోతి కృష్ణ దర్శకత్వంలో 'హరిహర వీరమల్లు' తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. ఇప్పటికే షూటింగ్ తుది అంకానికి చేరుకుంది. ప్రధానంగా పవన్ కళ్యాణ్ పై నాలుగు రోజుల షూటింగ్ పెండింగ్ ఉంది. పవన్ డేట్లు ఇస్తే వీలైనంత త్వరగా పూర్తి చేయాలని ఎదురు చూస్తు న్నారు. అయితే చివరి షెడ్యూల్ లో భాగంగా ప్రస్తుతం ఖమ్మంలో శర వేగంగా చితరీకరణ జరుగుతుంది.
ఇక్కడ పవన్ లేని కొన్ని కీలక సన్నివేశాలు చిత్రీకరిస్తున్నట్లు సమాచారం. ఈ షూట్ పూర్తయిన వెంటనే మేకర్స్ ప్రచారం పనులు మొదలు పెడతారని సమాచారం. ఇప్పటికే మే 9న రిలీజ్ తేదీగా ప్రకటించిన సంగతి తెలిసిందే. ఏప్రిల్ లో పవన్ నాలుగు రోజులు డేట్లు ఇస్తే షూటింగ్ సహా అన్ని పనులు పూర్తి మే 9 కల్లా అన్ని పనులు పూర్తి చేస్తారు. అయితే ఆ షూట్ తో సంబంధం లేకుండా ప్రచారం ప్లాన్ చేస్తున్నారు.
పవన్ కళ్యాణ్ కెరీర్ లో ఇదే తొలి పాన్ ఇండియా చిత్రమిది. బహుభాషల్లో రిలీజ్ అవుతుంది. ఈ నేపథ్యంలో హైదరాబాద్ సహా చెన్నై, బెంగుళూరు, ముంబైలో సినిమాని ప్రత్యేకంగా ప్రమోట్ చేయాలి. ఇంకా అవసరం అనుకుంటే దేశంలో పలు పట్టణాల్లోనూ ప్రచారం చేయాల్సి ఉంటుంది. ఇవన్నీ మే 9 లో పు పూర్తి చేయాలంటే వచ్చే నెల నుంచి ప్రచారం కూడా మొదలు పెట్టాలి. అన్నిచోట్లకు పవన్ వెళ్లే పరిస్థితి ఎలాగూ ఉండదు.
హైదరాబాద్ లో నిర్వహించే ప్రీ రిలీజ్ ఈవెంట్ కు మాత్రమే హాజరయ్యే అవకాశం ఉంది. మిగతా అన్ని ప్రాంతాల్లో టీమ్ హీరోయిన్లు ఇతర బృందంతా దగ్గరుండి ప్రచారం చేయించాల్సిందే. స్థానికంగా ఉండే హీరోలను అతిధులగా ఆహ్వానించే అవకాశం ఉంటుంది. మరోవైపు సోషల్ మీడియాలో కూడా ప్రచారం చేయాలి. ఇప్పటికే ఆ టీమ్ ను కూడా అలెర్ట్ చేసినట్లు సమాచారం.