ఒట్టేసి చెబుతున్నా థౌసండ్ పర్సెంట్ హిట్టు..!
మైక్ అందుకున్న నాని తనకు వైజాగ్ అంటే చాలా ఇష్టమని. తను నటించిన ఏ జోనర్ సినిమా అయినా ఇక్కడ ఆడతాయని అన్నారు.
నేచురల్ స్టార్ నాని లీడ్ రోల్ లో నూతన దర్శకుడు శౌర్యువ్ డైరెక్షన్ లో వస్తున్న సినిమా హాయ్ నాన్న. వైరా ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో రూపొందిన ఈ సినిమాలో నాని సరసన మృణాల్ ఠాకూర్ హీరోయిన్ గా నటించింది. సినిమాకు హేషం అబ్దుల్ వాహాబ్ మ్యూజిక్ అందించారు. డిసెంబర్ 7న రిలీజ్ అవుతున్న ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ వైజాగ్ లో నిర్వహించారు. ఈ ఈవెంట్ లో నాని ఎనర్జిటిక్ స్పీచ్ ఆడియన్స్ ని అలరించింది.
మైక్ అందుకున్న నాని తనకు వైజాగ్ అంటే చాలా ఇష్టమని. తను నటించిన ఏ జోనర్ సినిమా అయినా ఇక్కడ ఆడతాయని అన్నారు. అందుకు వైజాగ్ ఆడియన్స్ కు థాంక్స్ అని అన్నారు. వైజాగ్ లో ఉన్న అందరు సాయంత్రం బీచ్ కి వస్తారు అలానే డిసెంబర్ 1న మీ అందరు థియేటర్ కి వెళ్లాలని చెప్పారు నాని.
డిసెంబర్ కూడా న్యూ జనవరి లా అయ్యింది.. డిసెంబర్ లో కొత్త సంక్రాంతి.. సినిమా పండుగ.. సినిమాలన్నీ కూడా డిసెంబర్ లో కూడా రిలీజ్ అవుతున్నాయి. సో ఇక నుంచి డిసెంబర్, జనవరి రెండు నెలలు సినిమాలు సెలబ్రేట్ చేసుకోవాలి. డిసెంబర్ లో కూడా అలాంటి ఒక లవ్ దొరుకుతుందని అన్నారు.
డిసెంబర్ 1న తెలుగు దర్శకుడు సందీప్ వంగ బాలీవుడ్ వెళ్లి తీసిన యానిమల్ రిలీజ్ అవుతుంది. డిసెంబర్ 7న మై డియర్ ఫ్రెండ్ ఎక్స్ ట్రా ఆర్డినరీ మ్యాన్. డిసెంబర్ 22న ప్రభాస్ సలార్ రిలీజ్ అవుతుంది. నాకెంతగానో ఇష్టమైన రాజ్ కుమార్ హిరాణి డైరెక్ట్ చేసిన డంకీ సినిమా రిలీజ్ అవుతుంది. డిసెంబర్ 29న సుమ గారి అబ్బాయి సినిమా రిలీజ్ అవుతుంది. ఈ సినిమాలు అన్ని గొప్ప బ్లాక్ బస్టర్ అయ్యి డిసెంబర్ కూడా సినిమా పండుగ అని డిక్లేర్ చేయాలని కోరుతున్నా అని అన్నారు నాని. ఇక ఇన్ని సినిమాల్లో డిసెంబర్ 7న హాయ్ నాన్న అనే సినిమా మీ మనసుల్లో నిలిచిపోయే సినిమా వస్తుంది. ఈ సినిమాపై 1000 పర్సెంట్ నమ్మకంతో ఈ మాట చెబుతున్నా అన్నారు నాని.
ఈ టీం అంతా మీ మనసులో ప్రత్యేక స్థానం సంపాదించుకుంటారు. చాలామంది నాని ఈ సినిమాలో ఏడిపించేస్తాడని అనుకుంటున్నారు కానీ మీ కళ్లలో నీళ్లు కూడా సంతోషంగా వస్తాయని అన్నారు. శౌర్య తో పనిచేసినందుకు గర్వంగా అనిపిస్తుంది. నిర్మాతలు వాళ్ల ప్రొడక్షన్ హౌస్ లో వారి ఫస్ట్ సినిమా ఒక గొప్ప సినిమా అవ్వాలని అనుకున్నారు. ఈరోజు ఆ ప్రామిస్ ని నిలబెట్టుకున్నందుకు ఇంకా గర్వంగా ఉందని అన్నారు నాని.
హేషం ఈ సినిమాకు బెస్ట్ మ్యూజిక్ అందించాడు. టీం అంతా కూడా తలేత్తుకుని చెప్పగలిగే ఒక సినిమా చేశాం. ప్రియదర్శి కూడా మంచి పాత్ర చేసింది. శృతి హాసన్ కూడా మంచి సాంగ్ చేసింది. వైజాగ్ ఆడియన్స్ అందరికీ సినిమా రిలీజ్ ముందు ఇవ్వాల్సిన పాజిటివ్ ఇచ్చేశారు మీ అందరికీ థాంక్స్ అని అన్నారు. ఈ సినిమా చూశాక పాప పర్ఫార్మెన్స్ ని చూసి మీరంగా సర్ ప్రైజ్ అవుతారని కియరా పాప గురించి చెప్పారు నాని.