ఆ ప్యాలెస్ కి అంత చరిత్ర ఉందా?
తాజాగా ఇది సెట్ నిర్మాణం కాదు ఒరిజినల్ ప్యాలెస్ అని తెలుస్తోంది. ఆ అతిపెద్ద భవంతి పటౌడీ వారసుడు సైఫ్ అలీఖాన్ ది అని తెలిసింది.
ఇటీవల రిలీజ్ అయిన 'యానిమల్' బాక్సాఫీస్ వద్ద వసూళ్ల సునామీ కొనసాగిస్తోన్న సంగతి తెలిసిందే. భారీ యాక్షన్ సన్నివేశాలు..రణబీర్ పెర్పార్మెన్స్..ఆహార్యం ఓ రేంజ్ లో అభిమానుల్ని టచ్ చేసింది. సిక్కు కుటుంబ నేపథ్యాన్ని ఆధారంగా తీసుకుని సందీప్ రెడ్డి ఎంచుకున్న పాయిట్ బాగానే వర్కౌట్ అయింది. బల్బీర్ రాజ్ దీర్ సింగ్ పాత్రలో అనీల్ కపూర్ రాజసం..అతని కుమారుడు విజయ్ సింగ్ రోల్ లో రణబీర్ నటన గురించి చెప్పాల్సిన పనిలేదు.
ఇక ఈ సినిమాలో అందమైన ప్రత్యేకమైన ప్యాలెస్ కూడా ఉంది. సింగ్ కుటుంబమంతా ఆ ప్యాలెస్ లోనే ఉంటుంది. ఈ ప్యాలెస్ సినిమాలో బాగా హైలైట్ అయింది. దీంతో ఈ ప్యాలెస్ సెట్ వేసారా? లేక ఒరిజినల్ ప్యాలెస్ లో షూట్ చేసారా? ఇలా కొన్ని సందేహాలున్నాయి. తాజాగా ఇది సెట్ నిర్మాణం కాదు ఒరిజినల్ ప్యాలెస్ అని తెలుస్తోంది. ఆ అతిపెద్ద భవంతి పటౌడీ వారసుడు సైఫ్ అలీఖాన్ ది అని తెలిసింది.
10 ఎకరాల విస్తీర్ణంలో 150 గుదులు ఆ ప్యాలెస్ లో ఉన్నాయిట. దీని విలువ 1000 కోట్లకు పైగానే ఉంటుం దని అంచనా. ఇప్పటి వరకూ ఈ ప్యాలెస్ లో చాలా బాలీవుడ్ సినిమాలు షూట్ చేసారుట. కానీ ఈ ప్యాలెస్ చరిత్ర గురించిగానీ..అందులో షూటింగ్ ల గురించి గానీ ఇంతవరకూ తెలుగు ప్రేక్షకులకు తెలియదు. తొలిసారి తెలుగు దర్శకుడు సందీప్ రెడ్డి ఆ ప్యాలెస్ ని తన సినిమా షూట్ కి అద్దెకు తీసుకోవడంతో తెలుగు ఆడియన్స్ కి తెలుస్తుంది.
ఈ ప్యాలెస్ కి చాలా ఏళ్ల క్రితం నాటిదట. అయితే ప్యాలెస్ ని ఎక్కడా చెక్కు చెదరకుండా ఉండేలా పటౌడీ వారసులు చర్యలు తీసుకోవడంతోనే అలా ఉంది. బిల్డింగ్ పరంగా ఏదైనా సమస్య వచ్చినా దాని డిజైన్ మార్చకుండా మరమ్మత్తులు చేయడంతోనే ఇప్పటికీ అలాగే ఉందని తెలుస్తోంది. పురాతన భవనం అయినా ఇప్పటకీ 1000 కోట్లు పలుకుతుంది అంటే ఆ ప్యాలెస్ గొప్పతనం ఏంటో అర్దం చేసుకోవచ్చు.