హాలీవుడ్ చిహ్నానికి 100 ఏళ్లు!
ప్రపంచంలో ఎన్ని సినీ పరిశ్రమలున్నా హాలీవుడ్ సినిమాలకు పెట్టింది పేరుగా ఆచిహ్నం ఓ ప్రత్యేకమైన గుర్తింపును కలిగింది. తాజాగా అది ఏర్పాటు చేసి 100 ఏళ్లు పూర్తయింది.
ప్రపంచంలోనే అత్యంత గుర్తింపు పొందిన చిహ్నాల్లో లాస్ ఎంజెలీస్ లోని హాలీవుడ్ చిహ్నం ఒకటి. దీనికంటూ ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. ప్రపంచంలో ఎన్ని సినీ పరిశ్రమలున్నా హాలీవుడ్ సినిమాలకు పెట్టింది పేరుగా ఆచిహ్నం ఓ ప్రత్యేకమైన గుర్తింపును కలిగింది. తాజాగా అది ఏర్పాటు చేసి 100 ఏళ్లు పూర్తయింది. ఈ సంకేతం తొలుత 1923 డిసెంబర్ 8న హాలీవుడ్ ల్యాండ్ అనే పేరుతో రియల్ ఎస్టేట్ అభివృద్ధి కోసం ఏర్పాటు చేసారు.
13 అక్షరాలతో 30 అడుగుల వెడల్పు..43 అడుగుల పొడవు కలిగి ఉంటుంది. 3 నుంచి 9 అడుగుల మెటల్ తో భారీ స్థంభాలతొ దాన్ని నిర్మించారు. రాత్రి సమయంలో రంగు రంగు లైట్లతో కనువిందు చేస్తూ ప్రేక్షకుల్ని అలరిస్తోంది. 1935 లో తొలిసారి ఆ హాలీవుడ్ సంకేతానికి మరమ్మత్తులు చేసారు. ఐదేళ్ల తర్వాత దాన్ని లాస్ ఎంజలీస్ నగరానికి విరాళంగా ఇచ్చారు. 1947 లో మరోసారి మరమ్మత్తులు చేసి ల్యాండ్ అనే పదాన్ని తొలగించారు.
అప్పటి నుంచి ఆ నగరంలోని వినోద పరిశ్రమకి చిహ్నంగా మారింది. 100 వార్షికోత్సవాన్ని పురస్కరిం చుకుని ఆ కాలంలో మెరిసిన హాలీవుడ్ ల్యాండ్ ను తలపించేలా హాలీవుడ్ పదాన్ని లైట్లతో ప్రకాశింప జేసారు. హాలీవుడ్ అనే శబ్దం వినగానే ఆ సంకేతం అందరి మదిలో వెంటనే మెదులుతుంది. అక్కడి పరిశ్రమ నుంచి ఎలాంటి సినిమా విడుదలవుతందనేది తర్వాత సంగతి ముందు హాలీవుడ్ అక్షరాల లోగో మాత్రం కళ్ల ముందు కనిపిస్తుంది.
100 ఏళ్ల చరిత్రను కలిగింది కాబట్టే! ఆ పదానికి అంత గొప్ప ఖ్యాతి దక్కింది. ప్రపంచ వ్యాప్తంగా వివిధ పరిశ్రమల నుంచి ఎన్నో రకాల సినిమాలు ఏటా రిలీజ్ అవుతుంటాయి. అవి ఏ భాషలు ..ప్రాంతానికి చెందిన సినిమాలు అయినప్పటికీ ఓ విదేశీ చిత్రం రిలీజ్ అవుతుందంటే? దాన్ని హాలీవుడ్ సినిమాగానే పరిగణిస్తుంటారు. భారత్ లో హాలీవుడ్ సినిమాల ప్రభావం ఏ రేంజ్ లో ఉందన్నది చెప్పాల్సిన పనిలేదు. అందులోనూ బాలీవుడ్ పరిశ్రమపై ఆ ప్రభావం ఎక్కువగా కనిపిస్తుంది. మేకింగ్ పరంగా అక్కడి నుంచే స్పూర్తి పొంది సినిమాలు చేస్తున్నారు.