అలా చేయ‌క‌పోతే ఆ స్టార్ హీరో కోట్ల వ‌సూళ్ల‌కి గండి!

అందులోనూ క‌న్న‌డ‌, త‌మిళ్ లో హీరోలు సినిమా వేడుక‌ల‌కు తెల్ల లుంగీలు ధ‌రించి హాజ‌ర‌వుతుంటారు.

Update: 2024-09-06 07:31 GMT

లుంగీ డాన్స్ తో షారుక్ ఖాన్ పాన్ ఇండియాని ఏ రేంజ్ లో షేక్ చేసాడో చెప్పాల్సిన ప‌నిలేదు. 'చెన్నై ఎక్స్ ప్రెస్' లోని లుంగీ సాంగ్ అత‌డికి ప్ర‌త్యేక‌మైన ఇమేజ్ ని తీసుకొచ్చింది. సౌత్ ఆడియ‌న్స్ కి ఆ పాట‌తో షారుక్ మ‌రింత గా క‌నెక్ట్ అయ్యాడు. ఆ ఒక్క పాట‌తో సౌత్ లో కోట్ట‌ వ‌ర్షం కురిపించిన స్టార్ గానూ నిలిచాడు. లుంగీ అనేది సౌత్ సంప్ర‌దాయం. క‌న్న‌డ‌, మ‌ల‌యాళం, త‌మిళం, తెలుగు ఏ భాష తీసుకున్న లుంగీ అనే దానికి ప్ర‌త్యేక‌మైన గుర్తింపు ఉంది.


అందులోనూ క‌న్న‌డ‌, త‌మిళ్ లో హీరోలు సినిమా వేడుక‌ల‌కు తెల్ల లుంగీలు ధ‌రించి హాజ‌ర‌వుతుంటారు. అభిమానుల పెళ్లిళ్ల‌కు సైతం అదే లుక్ లో వెళ్ల‌డం ఆ రెండు ప‌రిశ్ర‌మ హీరోల ప్ర‌త్యేక‌త. ఆ టాక్టీని షారుక్ ఖాన్ తెలివిగా ప‌ట్టుకుని ఎన్ క్యాష్ చేసుకున్నాడు. అయితే ఈ క్రెడిట్ ఇవ్వాల్సింది మాత్రం షారుక్ ఖాన్ కి కాదు..ఆ సినిమా ద‌ర్శ‌కుడు రోహిత్ శెట్టికి అని చెప్పాలి.

అవును తొలుత ఈ సినిమాలో లుంగీ పాట డాన్స్ చేయ‌డం షారుక్ ఖాన్కి ఎంత మాత్రం ఇష్టం లేద‌న్న సంగ‌తిని ఆ పాట ఆల‌పించిన ఫేమ‌స్ సింగ‌ర్ హ‌నీ సింగ్ తెలిపాడు. లుంగీ డాన్స్ పాట న‌చ్చ‌లేద‌ని షారుక్ తిర‌స్క‌రించారు. ఎంతో క‌ష్ట‌ప‌డి కంపోజ్ చేసిన పాట కావ‌డంతో చాలా బాధ‌గా అనిపించింది. దీంతో సొంతంగా నా మ్యూజికల్ బ్యాడ్ ద్వారా ఆ పాట మార్కెట్ లో రిలీజ్ చేయాల‌నుకున్నాను.

ఈ విష‌యం ద‌ర్శ‌కుడు రోహిత్ శెట్టికి తెలిసింది. ఆయ‌న కూడా ఈ పాట సినిమాలో ఉండాల్సిందేన‌ని ప‌ట్టుబ‌ట్టారు. షారుక్ తో జ‌రిగిన డిస్క‌ష‌న్ గురించి చెప్పాను. దీంతో రోహిత్ రంగంలోకి షారుక్ ఖాన్ ని ఒప్పించారు. కానీ అది అంత ఈజీగా జ‌ర‌గ‌లేదు. షారుక్ ని ఒప్పించ‌డానికి ఆయ‌న చాలా శ్ర‌మించాల్సి వ‌చ్చింది` అని అన్నాడు.

Tags:    

Similar News