ఉపేంద్ర UI - ఆడియన్స్ ని టెస్ట్ చేస్తున్నారా?

అయితే ప్రేక్షకుల ఆలోచనకి పదును పెట్టే ఫజిల్ తరహాలో కథనం ఉంటే అంత వేగంగా కనెక్ట్ కారు. కేవలం ఒక వర్గం ప్రేక్షకులకి మాత్రమే సినిమా పరిమితం అయిపోతుంది.

Update: 2024-12-17 04:25 GMT

విలక్షణ నటుడిగా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు సొంతం చేసుకున్న నటుడు ఉపేంద్ర. కన్నడ సూపర్ స్టార్ గా అతనికి ప్రత్యేకమైన ఫ్యాన్ బేస్ కూడా ఉంది. ఉపేంద్ర దర్శకుడిగా కూడా మంచి హిట్స్ అందుకున్నాడు. ఆయన చెప్పే కథలు చాలా విభిన్నంగా ఉంటాయి. వాటిని అర్ధం చేసుకుంటే చాలా థ్రిల్లింగ్ గా అనిపిస్తాయి. లేదంటే బోరింగ్ గా ఉంటాయి. సినిమాటిక్ రూల్స్ అన్ని బ్రేక్ చేసి ఉపేంద్ర తన కథలని తెరపై ఆవిష్కరిస్తూ ఉంటారు.

ఎవ్వరు చేయనటువంటి పాత్రలు చేస్తారు. అందుకే విలక్షణ నటుడిగా ఉపేంద్రకి మంచి గుర్తింపు ఉంది. డబ్బింగ్ సినిమాల ద్వారానే తెలుగు ప్రేక్షకులకి కూడా ఉపేంద్ర చేరువ అయ్యారు. ఆయన నుంచి డిసెంబర్ 20న 'UI' మూవీ థియేటర్స్ లోకి వస్తోంది. ఉపేంద్ర స్వీయ దర్శకత్వంలోనే ఈ చిత్రం తెరకెక్కింది. అందుకే మూవీపై కొంత ఆసక్తి నెలకొని ఉంది. ఇప్పటికే రిలీజ్ అయిన టీజర్ కూడా సినిమాపై డిఫరెంట్ ఒపీనియన్ కలిగించింది.

ఏదో కొత్తగా చెప్పబోతున్నాడనే అభిప్రాయం పబ్లిక్ లో ఉంది. ఇదిలా ఉంటే ఉపేంద్ర కూడా ఈ మూవీ ప్రీరిలీజ్ ఈవెంట్ లో మాట్లాడుతూ సినిమా గురించి ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. ప్రభాస్ 'కల్కి' మైథలాజికల్ వెర్షన్ లో ఉంటుంది. మా సినిమా సైకలాజికల్ వెర్షన్ లో కల్కిలా ఉంటుందని కామెంట్స్ చేశారు. ఈ సినిమా స్టార్టింగ్ నుంచి కథ చాలా డిఫరెంట్ గా సాగుతుందని, దానిని డీకోడ్ చేస్తే కచ్చితంగా మీరు థ్రిల్ ఫీల్ అవుతారని అన్నారు.

అలాగే మీరు ఈ సినిమా చూస్తున్నప్పుడు నేను ఎం చెబుతున్నాను అనేది ఈజీగా డీకోడ్ చేస్తారని కూడా అన్నారు. అయితే ప్రేక్షకులు థియేటర్స్ కి వచ్చిన తర్వాత తెరపై చెప్పే కథని ఆస్వాదిస్తూ ఉంటారు. డీప్ గా ఆలోచిస్తూ సినిమా చూసే పరిస్థితి ఉండదు. చాలా వరకు రిలాక్స్ అవ్వడం కోసం, ఎంజాయ్ చేయడం కోసమే మూవీకి వస్తారు. అందుకే మాస్ అండ్ ఎంటర్టైన్మెంట్ సినిమాలు ఎక్కువగా సక్సెస్ అవుతూ ఉంటాయి.

అయితే ప్రేక్షకుల ఆలోచనకి పదును పెట్టే ఫజిల్ తరహాలో కథనం ఉంటే అంత వేగంగా కనెక్ట్ కారు. కేవలం ఒక వర్గం ప్రేక్షకులకి మాత్రమే సినిమా పరిమితం అయిపోతుంది. ముఖ్యంగా బీ,సి సెంటర్ ఆడియన్స్ ఆలోచిస్తూ సినిమాని చూడరు. వారికి కావాల్సిన వినోదం మూవీలో ఉంటేనే ఆసక్తి చూపిస్తారు. అలాంటి వారికి హై ఇంటెలిజెన్స్ మూవీస్ ఒక పట్టాన అర్ధం కావు. మరి ఉపేంద్ర తన 'UI' సినిమాతో ప్రేక్షకులకి ఎంటర్టైన్మెంట్ ఇస్తున్నారా లేదంటే పరీక్ష పెడుతున్నారా అనేది థియేటర్స్ లో చూసేంత వరకు తెలియదు. కానీ కంటెంట్ క్లిక్కయితే మాత్రం సినిమాకు మంచి రెస్పాన్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. మరి ఉపేంద్ర ప్రయోగం ఎంతవరకు క్లిక్కవుతుందో చూడాలి.

Tags:    

Similar News